తెలంగాణ సైన్స్ అకాడమీ
స్థాపన | 2014 |
---|---|
రకం | తెలంగాణ ప్రభుత్వ సంస్థ |
కేంద్రీకరణ | సైన్స్, టెక్నాలజీ రంగాలను అభివృద్ధి చేయడం |
కార్యస్థానం | |
సేవలు | 2015, ఏప్రిల్ 30 (ప్రారంభం) |
తెలంగాణ సైన్స్ అకాడమీ, తెలంగాణ రాష్ట్రానికి చెందిన సైన్స్ సంస్థ. సైన్స్, టెక్నాలజీ రంగాలను అభివృద్ధి చేయడం, ప్రజలలో శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంచడం, పుస్తకాలు-పత్రికల ప్రచురణ కోసం ఒక వేదికను అందించడం ఈ అకాడమీ ప్రధాన లక్ష్యం. దీని ప్రధాన కార్యాలయం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని తార్నాకలో ఉంది.[1]
ఏర్పాటు
[మార్చు]1963లో ఆంధ్రప్రదేశ్ సైన్స్ అకాడమీ ఏర్పాటయింది. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆంధ్రప్రదేశ్ సైన్స్ అకాడమీ నుండి తెలంగాణ సైన్స్ అకాడమీ విభజించబడింది. 2015 ఏప్రిల్ 30 నుండి ఈ అకాడమీ తన కార్యకలాపాలు ప్రారంభించింది.
పాలకవర్గం
[మార్చు]పరమాణు జీవశాస్త్రవేత్త, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ మాజీ డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ మోహన్ రావు అధ్యక్షతన కొత్త ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌ను జనరల్ బాడీ ఎన్నుకుంది.
విధులు, లక్ష్యాలు
[మార్చు]- సైన్స్ అండ్ టెక్నాలజీని అభివృద్ధి చేయడం
- శాస్త్రవేత్తలకు ప్రోత్సాహిస్తూ అవార్డులు అందించడం[2]
- ప్రజలలో శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించడం
- సైన్స్‌పై పుస్తకాలు & పత్రికల ప్రచురణ కోసం ఒక వేదికను అందించడం
- సైన్స్ రంగంలో కృషిచేసిన విద్యావేత్తలు, నిపుణులు, శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలకు ఫెలోషిప్స్ అందించడం
ప్రాంతీయ కేంద్రాలు
[మార్చు]అకాడమీ తన కార్యకలాపాలను విస్తరించడానికి, అందరికి చేరువయ్యేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో తన ప్రాంతీయ కేంద్రాలను స్థాపించింది.[3]
- నిజామాబాద్ ప్రాంతీయ కేంద్రం (మెదక్ & నిజామాబాద్ జిల్లాలు)
- వరంగల్ ప్రాంతీయ కేంద్రం (వరంగల్ & ఖమ్మం)
- హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం (హైదరాబాద్ & రంగారెడ్డి)
- నల్గొండ ప్రాంతీయ కేంద్రం (నల్గొండ & మహబూబ్‌నగర్)
- కరీంనగర్ ప్రాంతీయ కేంద్రం (కరీంనగర్ & నిజామాబాద్)
సదస్సులు
[మార్చు]2018 డిసెంబరు 22 నుండి 24 వరకు వరంగల్ లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అకాడమీ మొట్టమొదటి తెలంగాణ స్టేట్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహించబడింది. మూడు రోజుల జరిగిన ఈ సదస్సులో 'తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం సైన్స్ & టెక్నాలజీ' అనే అంశంపై అనేక చర్చలు, ప్రతిపాదనలు, పత్ర సమర్పణలు జరిగాయి.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Telangana Academy of Sciences (TAS) Hyderabad". www.tasc.org.in. Archived from the original on 2021-11-20. Retrieved 2022-02-28.
- ↑ Watson, Shweta (2017-07-12). "Star in the making". Deccan Chronicle (in ఇంగ్లీష్). Archived from the original on 2017-07-16. Retrieved 2022-02-28.
- ↑ "Telangana Academy of Sciences (TAS) Hyderabad - About Us". www.tasc.org.in. Archived from the original on 2020-06-07. Retrieved 2022-02-28.
- ↑ India, The Hans (2018-12-21). "First Science Congress from tomorrow". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2022-02-28. Retrieved 2022-02-28.