Jump to content

తెలుగు భాషోద్యమ సమితి, తిరుపతి

వికీపీడియా నుండి
(తెలుగు భాషోధ్యమ సమితి,తిరుపతి నుండి దారిమార్పు చెందింది)

తెలుగు భాషోధ్యమ సమితి, తిరుపతి తెలుగు భాష పరిరక్షణ కొరకు, తెలుగు భాష వికాశం కొరకు తిరుపతిలో 2005 వ సంవత్సరంలో ఏర్పడిన సంస్థ.


తెలుగు వికీపీడియా సభలో ప్రసంగిస్తున్న సాకం నాగరాజు

నిర్వాహకులు

[మార్చు]
  1. సాకం నాగరాజ: వ్వవస్థాపకులు.
  2. గంగవరపు శ్రీదేవి., అధ్యక్షురాలు.,
  3. పేరూరి బాలసుబ్రమణ్యం. ప్రధాన కార్య దర్శి

ప్రాచీన హోదా

[మార్చు]

తెలుగు భాషకు ప్రాచీన హోదా సాధించుకోవడానికి ఉద్యమ స్థాయిలో పనిచేయడానికి.............. (ప్రస్తుతం తెలుగు భాషకు ప్రాచీన భాష హోదా ఇవ్వబడినది)

ప్రపంచ పుస్తక పఠన దినం

[మార్చు]

ప్రపంచ పుస్తక దినం అయిన 11, సెప్టెంబరు నాటి నుండి ఒక వారంపాటు పుస్తక పఠన వారోత్సవాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించడము. పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలకు వెళ్ళి పుస్తక పఠన ప్రాముఖ్యాన్ని విద్యార్థులకు వివరించి పుస్తక పఠన ప్రాముఖ్యతను వారికి వివరించడము. విద్యార్థుల చేత పుస్తకాలను చదివించడము. ఈ సందార్భంగా... ఈ సంస్థ ప్రచురించిన, ఇతర పుస్తకాలను విద్యార్థులకు ఉచితంగా పంపిణి చేయడము.

తెలుగు కవుల, రచయితల జయంతి

[మార్చు]

తెలుగు కవుల, రచయితల జయంతి, శతజయంతి ఉత్సవాలను ప్రతి ఏడు నిర్వహించడము, ఆయా కవుల, రచయితల వారి రచనలను ప్రశంసిస్తూ పుస్తకావిష్కరణ నిర్వహించడము.

ప్రచురణలు

[మార్చు]

ఇంతవరకు ప్రచురించిన పుస్తకాలు: 1.తెలుగు పద్యం మానాన్నా ..., 2.చిత్తూరు కథ, 3. విద్యార్థులకొరకు శ్రీశ్రీ., 4. పుస్తకం సాక్షిగా మొదలగునవి ప్రచురించ బడ్డాయి.

ఈ సమితిలో సభ్యులు

[మార్చు]

రచయితలు, ఉపాద్యాయులు, ఉద్యోగులు, తిరుపతిలో పుస్తక ప్రియులు, వైద్య వృత్తి కారులు, కళాకారులు, వంటి వివిధ వర్గాలకు చెందిన వారు ఈ సమితిలో సభ్యులుగా ఉన్నారు.

సాహిత్య సభలు

[మార్చు]

కేంద్ర సాహిత్య అకాడమీ, సంయుక్త సహకారంతో. ఆంధ్ర ప్రదేశ్ అభ్యుదయ రచయిల సంఘం. (అరసం) కలిసి సాహిత్య సభలను నిర్వహించడము.

తెలుగు భాష బ్రంహోత్సవాలు

[మార్చు]

తెలుగు భాష సంయుక్త వికాస వేదిక 2004, 2005, 2006 సంవత్సారాలలో వరుసగా తిరుపతిలో జరిగిన తెలుగు భాష బ్రహ్మోత్సవాల నిర్వహణకు బాగా స్వామిగా వుండి సంపూర్ణ సహకారము అందించింది.

గుర్తింపు

[మార్చు]

తిరుపతిలో అనేక పర్యాయాలు, సాహిత్య భాషా కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహించిన ప్రతిష్ఠాత్మక సాహిత్య సంస్థగా ఈ సంస్థకు గుర్తింపు ఉంది.

మూలాలు

[మార్చు]

సాక్షి చిత్తూరు. 13.9.2008