తెలుగు భాష విధానం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Black outdoor statue with an orange garland
తెలుగుతల్లి విగ్రహం, తెలుగు ప్రజల సంకేతం

తెలుగు భాష విధానం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని విధానం. తెలంగాణ విభజనకు ముందు ఈ రాష్ట్రాలలోని ప్రజలలో 84 శాతం మంది తెలుగు భాషను మొదటి భాషగా తీసుకున్నారు.[1][2] తెలుగు భాషా మద్దతుదారులు భాషకు ప్రోత్సాహకత, భాష పట్ల ప్రభుత్వ మద్దతు లేదని గమనించారు. గుర్తింపు, ప్రమోషన్లో తెలుగు అధికారిక భాషా హక్కుల కోసం కృషిచేస్తున్నారు.

స్థితి[మార్చు]

తెలుగు, ఆంగ్ల భాషలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని పాఠశాలలో బోధిస్తున్న ప్రధాన భాషలు. కొన్ని పాఠశాలలలో ఇతర ప్రాంతీయ భాషలైన ఉర్దూను బోధనా భాషగా వాడుతున్నారు. ఈ రెండు రాష్ట్రాలలో తెలుగు భాష అనేది తప్పనిసరిగా బోధించవలసినది. మెట్రిక్యులేషన్ చదివేవారికి తెలుగు భాష ధారాళంగా రావాలి.[3][4]

అంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలలో ఆంగ్లమాద్యమం పాఠశాలల సంఖ్యను పెంచుటకు కృషి చేస్తుంది. కొన్ని రాష్ట్ర పాఠశాలలలో ఒక్క ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే బోధించుటలు ప్రతిపాదనలు వచ్చినందున ఈ విధానం తల్లిదండ్రులకు ఆంగ్లమాద్యమంపై పెరుగుతున్న కోరికను ప్రతిబింబిస్తుంది. ఆంగ్ల మాధ్యమ పాఠశాలల కోసం పెరిగిన డిమాండ్‌ను పొందలేకపోవడంతో ప్రభుత్వ రంగం విద్యార్థులను కోల్పోతోందని భావించబడుతుంది.[5][6]

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని ప్రైవేటు పాఠశాలల్లో ఇంగ్లీష్-మాధ్యమిక విద్యను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆంగ్ల-మాధ్యమ విద్యకు సంబంధించిన ధోరణికి కొందరు తెలుగు భాషా కార్యకర్తలలో అప్రమత్తమై, తెలుగు భాషను తక్కువస్థాయిలో ఉంచడం, తెలుగు-మాట్లాడేవారి భాష హక్కుల గూర్చి రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసారు.[7] ఇంగ్లీష్ భాషా మాధ్యమ పాఠశాలల్లో విద్యార్థులు తెలుగులో మాట్లాడినందువలన శిక్షలు మరింత పెరిగిపోయాయి.[8]

2019-20 నుండి ఆంధ్రప్రదేశ్ లో అన్ని ప్రభుత్వ పాఠశాలలలో ఆంగ్ల బోధనా మాధ్యమం ప్రవేశపెడుతున్నారు.[9] తెలుగు పాఠ్యాంశంగా తప్పనిసరి చేయనున్నారు.

చాలామంది విద్యావంతులైన తెలుగు ప్రజలు జ్ఞానం ఆధారిత ఉద్యోగాల అన్వేషణలో ప్రపంచవ్యాప్తంగా ప్రయాణిస్తున్నారు, అనేక దేశాలు తమ మాతృభాషలో విద్యను అందించడం ద్వారా భారతదేశం కంటే వేగంగా వృద్ధి చెందుతున్నారని గమనించారు. భారతదేశం అంతటా, స్థానిక భాషా న్యాయవాదులు ఆంగ్లంపై తక్కువ ఆధారపడాలని డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ యొక్క ఒక రోజు స్థూల జాతీయోత్పత్తి (GDP) కంటే తక్కువగా ఖర్చు చేసే ఖర్చుతో రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాష అభివృద్ధికి కృషిచేయవచ్చు. ప్రపంచంలోని ఏ దేశం దాని మాతృభాషలో విద్యను అందించకుండా అభివృద్ధి చెందలేదు. అంతర్జాతీయ భాషగా ఆంగ్ల భాష పరిణామం చెందడానికి ఆంగ్ల ప్రజల అంకితభావం, భాషపై ప్రేమ, వారి భాషను అభివృద్ధి చేయాలనే ప్రయత్నాలు ముఖ్యమైనవి. యునైటెడ్ కింగ్‌డం లో, వెల్ష్(మైనారిటీ భాష) కూడా ప్రోత్సహించబడుతుంది. యునైటెడ్ కింగ్‌డమ్‌ లో వెల్ష్ భాష (సుమారు 750,000 మంది ప్రజలు మాట్లాడతారు) యొక్క చట్టపరమైన హోదా భారతదేశంలో ఉన్న తెలుగు భాష (85 మిలియన్ల మంది) తో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది.

తెలుగు ప్రచారం[మార్చు]

2012లో ఆంధ్రప్రదేశ్ లోని అధికార భాషా కమీషన్ కు చెందిన భాషా ఉద్యమకారులు 22 సంవత్సరాల విరామం తర్వాత ప్రపంచ తెలుగు సభలను నిర్వహించారు. ఈ కార్యక్రమం విజయవంతమైనది. ప్రపంచ వ్యాప్తంగా 5000 మంది తెలుగు ప్రతినిధులు తిరుపతి లో జరిగిన సభలకు హాజరయ్యారు.[10]

అమలు[మార్చు]

  • 2013-14 విద్యా సంవత్సరం నుండి 10వ తరగతి వరకు తెలుగు భాషను తప్పనిసరిగా నేర్పించాలి.[3]
  • 2012 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని షాపులు, వాణిజ్య ప్రకటలలను తప్పనిసరిగా తెలుగులోనే రాయాలని ప్రకటించింది.[11]
  • పాఠశాలలలో తెలుగు మాట్లాడే విద్యార్థులకు శిక్షించే ఉపాధ్యాయులు గల పాఠశాలకు గుర్తింపు రద్దు చేయబడుతుంది.[12][13]
  • ప్రపంచ యునికోడ్ కన్సార్టియంలో చేరడం, యునికోడ్-ఆధారిత లిపిని తెలుగు కొరకు అభివృద్ధి చేస్తోంది.[14]
  • గ్రామం నుండి రాష్ట్ర కార్యదర్శి స్థాయి వరకు అధికారిక ఉత్తరప్రత్యుత్తరాలు తెలుగులో ఉంటుంది, అన్ని అధికారిక పత్రాలు తెలుగులో సంతకం చేయబడతాయి.[15]
  • వార్షిక రాష్ట్రస్థాయి కార్యక్రమాలైన తెలుగు భాషా దినోత్సవం (గిడుగు వెంకట రామమూర్తి జన్మదినం సందర్భంగా)[16], అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం, అధికార భాషా దినోత్సవం [17], ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ జన్మదినం[18] కార్యక్రమాలను తెలుగు భాషాభివృద్ధికి స్ఫూర్తిని అందించడానికి నిర్వహిస్తారు.
  • 2012-2013లో తెలుగు భాష, సంస్కృతిని ప్రోత్సహించడానికి ప్రతి జిల్లాకు 2 మిలియన్ల రూపాయలను వెచ్చిందింది.[19]
  • తెలుగులో ఉత్తర ప్రత్యుత్తరాలను ప్రోత్సహించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నపురస్కారాలు అందజేస్తుంది.
  • హైకోర్టు మినహా అన్ని కోర్టు విచారణలు, తీర్పులు తెలుగులోనే ఉంటాయి.[20][21]
  • రాష్ట్ర ప్రభుత్వం 2013 లో తెలుగు అభివృద్ధి సంవత్సరంగా ప్రకటించింది.[22][23]

ప్రోత్సాహాలు[మార్చు]

  • తెలుగు భాషను అభివృద్ధి చేయడానికి ఒక మంత్రిత్వశాఖ[24] ప్రారంభించబడింది. పుస్తక అనువాదాలు చేయడం, పదజాలాభివృద్ధి చెయడం, తెలుగు ఫైన్ ఆర్ట్స్, సాహిత్య అకాడమీలు పునరుద్ధరించడం,[25] సాఫ్టువేర్ అభివృద్ధి [26] వంటి కార్యక్రమాలు జరుగుతున్నవి.
  • రాష్ట్ర ప్రభుత్వం నియామకాల్లో తెలుగు-మాధ్యమిక విద్యార్థులకు ప్రాధాన్యత.[27]

స్వచ్ఛంద కార్యక్రమాలు[మార్చు]

ప్రత్యామ్నాయ తెలుగు పదాలను ఉపయోగించి, తెలుగు కార్యక్రమాలలో ఆంగ్ల భాషను తగ్గించటానికి ప్రింట్, దృశ్య తెలుగు మీడియా చర్యలు తీసుకున్నాయి.[28] ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నేషనల్ క్రికెట్ అకాడమీ కోచింగ్ మాన్యువల్ ను తెలుగులోకి అనువదించింది.[29]

మూలాలు[మార్చు]

  1. "Census of India - Distribution of the 22 Scheduled Languages". www.censusindia.gov.in. Retrieved 2018-02-27.
  2. "Census of India - Statement II". www.censusindia.gov.in. Retrieved 2018-02-27.
  3. 3.0 3.1 "Telugu to be compulsory in State schools". 29 January 2013. Retrieved 17 March 2013.
  4. "Telugu now a mandatory subject for Telangana Class 1 to 12 school students". India Today (in ఆంగ్లం). 2017-09-14. Retrieved 2018-02-27.
  5. "English medium must in state schools, says Andhra Pradesh government". deccanchronicle.com/ (in ఆంగ్లం). 2017-05-01. Retrieved 2018-02-27.
  6. "AP mulls over English medium in government schools". The Hans India (in ఆంగ్లం). Retrieved 2018-02-27.
  7. Dayashankar, K. M. (2016-01-17). "Telugu loses out to English as medium of education". The Hindu (in ఆంగ్లం). ISSN 0971-751X. Retrieved 2018-02-27.
  8. "Girl caned for speaking Telugu in school". 9 March 2012. Retrieved 17 March 2013.
  9. Wikisource link to ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2019-20. వికీసోర్స్. Wikisource page link 16. 
  10. "PM Manmohan Singh lauds Telugu people". 29 December 2012. Archived from the original on 5 ఫిబ్రవరి 2013. Retrieved 17 March 2013. Check date values in: |archive-date= (help)
  11. "Shop signs must be in Telugu In Andhra Pradesh". 24 November 2012. Retrieved 17 March 2013.
  12. "Private schools warned against discouraging Telugu". 26 October 2012. Retrieved 17 March 2013.
  13. "It's going to be Telugu 'Velugu' vs English-Vinglish". Retrieved 17 March 2013.
  14. "Telugu set to become world language". 9 September 2011. Retrieved 17 March 2013.
  15. "Officials appending signatures in Telugu". 7 February 2013. Retrieved 17 March 2013.
  16. "Celebrate Telugu language – Remembering Gidugu Ramamurthy". 30 August 2012. Archived from the original on 11 ఏప్రిల్ 2013. Retrieved 17 March 2013. Check date values in: |archive-date= (help)
  17. "May 14 is official language day in AP". 5-2-2013. Archived from the original on 11 ఏప్రిల్ 2013. Retrieved 17 March 2013. Check date values in: |date=, |archive-date= (help)
  18. "Brown, father of modern day Telugu language". 2 November 2008. Retrieved 17 March 2013.
  19. "Efforts to promote Telugu language to get a fillip". Retrieved 17 March 2013.
  20. "Chief Minister N Kiran Kumar Reddy endorses use of Telugu in judiciary". Archived from the original on 28 మే 2013. Retrieved 17 March 2013. Check date values in: |archive-date= (help)
  21. "Stress on use of mother tongue in courts". 10 March 2013. Retrieved 17 March 2013.
  22. "2013 declared Telugu Development Year". Retrieved 27 March 2013.[permanent dead link]
  23. "Rs. 25 crore allocated for 'Telugu Baata'". Retrieved 27 March 2013.
  24. "Separate ministry to promote Telugu: CM". 28 December 2012. Retrieved 17 March 2013.
  25. "Plan to revive fine arts, literature academies: Buddha Prasad". 9 February 2013. Retrieved 17 March 2013.
  26. "CM gets award for success of Telugu conference held in USA". 18 February 2012. Archived from the original on 4 ఫిబ్రవరి 2013. Retrieved 17 March 2013. Check date values in: |archive-date= (help)
  27. "Weightage for Telugu medium students in govt jobs likely". 2012-11-26. Retrieved 17 March 2013.
  28. "Telugu language slowly back on track in media". 2012-12-20. Retrieved 17 March 2013.
  29. "National Cricket Academy coaching manual in Telugu". 2012-07-30. Retrieved 17 March 2013.