తెలుగు రామాయణాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుగు మాట్లాడే ప్రాంతాలలో హిందువులకు ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు. రామాయణం ప్రకారం అగస్త్యుని ద్వారా వనవాసంలో నివసించేందుకు అత్యంత నివాసయోగ్య ప్రాంతం గోదావరీ పరీవాహక ఆంధ్రదేశం. ఆంజనేయుని జన్మభూమిగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రసిద్ధి. ఆ విధంగా రామాయణానికీ, ఆంధ్రదేశానికి ఒక అవినాభావ సంబంధం ఉంది.[1] ప్రతి ఊర్లో రామాలయం ఉండటమే కాక, ప్రతి కాలంలో రామాయణం తెలుగు నేలపై వ్రాయబడింది.

క్రమము కవి పేరు రామాయణము పేరు
1 నన్నయ్య రాఘవాభ్యుదయము
2 మంత్రి భాస్కరుడు భాస్కర రామాయణము
(శిధిల భాగముల పూరణ హుళక్కి భాస్కరుడు, మల్లికార్జునభట్టు మొ॥ వారు)
3 తిక్కన సోమయాజి నిర్వచనోత్తర రామాయణం
4 ఎఱ్ఱాప్రగడ రామాయణము
5 కొఱవి సత్యనారాయణ రామాయణము
6 మొల్ల మొల్ల రామాయణము
7 అయ్యలరాజు రామభద్రుడు రామాభ్యుదయము
8 చిత్రకవి వెంకటరమణ కవి సకల వర్ణనాపూర్ణ రామాయణము
9 రఘునాధరాయలు రఘునాధ రామాయణము
(బాలకాండములో కొంతవరకే అనూదితము)
10 ఘనగిరి రామకవి యధావాల్మీకి రామాయణము
(బాలకాండములో కొంతవరకే అనూదితము)
11 మానూరి గోపాలరావు యథావాల్మీకి రామాయణము
12 కాణాదము పెద్దన సోఅయాజి
, ఐదుగురు కవులు
యథాశ్లోక తాత్పర్య రామాయణము
13 చెన్నూరి రామన్న రామాయణము
14 బసవకవి రామాయణము
15 వారణాశి లక్ష్మీపతి రామాయణము
16 మడి వ్యాళయ్య శారద రామాయణము
17 గోపీనాథము వేంకటకవి గోపీనాధ రామాయణము
18 వావిలికొలను సుబ్బారావు
(వాసుదాసు గారు)
ఆంధ్ర వాల్మీకి రామాయణం
19 జనమంచి శేషాద్రి శర్మ ఆంధ్ర శ్రీమద్ వాల్మీకి రామాయణము
20 జనమంచి శేషాద్రి శర్మ ధర్మసార రామాయణము
21 జనమంచి శేషాద్రి శర్మ సంగ్రహ రామాయణము
22 శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి శ్రీ కృష్ణ రామాయణము
23 విశ్వనాథ సత్యనారాయణ శ్రీమద్రామాయణ కల్పవృక్షము
24 కట్టా వరదరాజు వరదరాజు రామాయణము
25 కరభోసల ఏకోజీ ఏకోజీ రామాయణం
26 ధర్మవరపు సీతారామాంజనేయులు ఆంజనేయ రామాయణము
27 గడియారం వేంకట శేషశాస్త్రి శ్రీమదాంధ్రరామాయణము
28 రాళ్ళబండి నాగభూషణ శాస్త్రి మారుతి రామాయణము
29 కపిలవాయి లింగమూర్తి శారదారామాయణము
30 కపిలవాయి లింగమూర్తి రామోదాహరణము
31 కపిలవాయి లింగమూర్తి శ్రీరామవచనాలు
32 ముదిగొండ నాగవీరయ్య శాస్త్రి అభినవ రామాయణము
33 నిమ్మగడ్డ రాధాకృష్ణ దాసకవి హనుమద్రామాయణము
34 గంగయ్య తారక బ్రహ్మ రామాయణము
35 చెన్న కృష్ణయ్య సాంఖ్య రామాయణము
36 నరసింహా దేవర వేంకటశాస్త్రి విచిత్ర రామాయణము
37 ముడుంబి కృష్ణయ్య అద్భుత రామాయణము
38 గంధం శ్రీరామ్మూర్తి, ఇఱ్ఱింకి నరసింహమూర్తి యథార్ధ రామాయణము
39 వేములవాడ భీమకవి శతకంఠం/శతకంధర రామాయణము
40 లింగకవి, గంగకవి (జంటగా) శతకంఠ రామాయణము
41 వేంకట భూపతి సహస్రనామ రామాయణము
42 రామావఝల కొండయ శాస్త్రి సహస్రకంఠ రామాయణము
43 కూచిమంచి జగ్గకవి తారక బ్రహ్మ రామాయణము
44 వేంకట పార్వతీశ్వర కవులు శ్రీ రామాయణము
45 ఆత్మకూరి గోవిందాచార్యులు గోవింద రామాయణము
46 గుండు లక్ష్మణ శాస్త్రి ఆంధ్రానంద రామాయణము
47 ఆకొండి వెంకటకవి తత్త్వసంగ్రహ రామాయణము
48 ఉమర్ ఆలీషాకవి శ్రీ మద్వాల్మీకి రామాయణము
49 కామవరపు సూర్యనారాయణ దండక రామాయణము (లఘుకృతి)
50 కరణం అశ్వత్థరావు దండక రామాయణము (విస్మృత గ్రంథము)
51 మోదుకూరి పండరీనాథకవి పండరీనాధ రామాయణము
52 పి.వ్.ఎల్.ఎన్. ప్రభాకరశర్మ హనుమద్రామాయణము
53 అయినంపూడి గురునాధరావు గురునాధ రామాయణము
54 శ్రీసోమరాజు వేంకట సుబ్బరాయకవి శ్రీమదాంధ్ర ఆనందరామాయణము
55 మల్లెమాల సుందర రామిరెడ్డి మల్లెమాల రామాయణము
ఆధ్యాత్మ రామాయణములు వ్రాసిన కవులు:
56 మేడూరి సీతారామయ్య శర్మ సీతారామాయణం
57 జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తి (విహారి) పదచిత్ర రామాయణం
58 కంచర్ల శరభకవి ఆధ్యాత్మ రామాయణము
59 ఇమ్మడి జగదేవరాయలు
60 రాపాక శ్రీరామకవి
61 కాణాదము పెద్దన సోమయాజి
62 పరశురామపంతులు రామమూర్తి
63 ముడుంబై వెంకట కృష్ణమాచార్యులు
64 మోదుకూరి పండరీనాధ కవి
65 కోటమరాజు నాగయ్య
66 కృష్ణగిరి వేంకట రమణ కవి
67 అల్లమరాజు రామకృష్ణకవి
68 రామయామాత్యుడు
69 బులుసు వేంకటేశ్వర్లు
70 ఉపమాక నారాయణమూర్తి
71 శేషగిరి సుబ్రహ్మణ్యకవి (108 సంకీర్తనలతో)
72 ఆకొండి వ్యాసమూర్తి
73 తత్త్వ సంగ్రహ రామాయణం (ఆధ్యాత్మమాలికా రామాయణమని వివరణ)
వాసిష్ఠ రామాయణము : కవులు వాసిష్ఠ రామాయణము
74 మడికి సింగన
75 కామినేని ఎల్లా రెడ్డి
భోజుని చంపూరామాయణానికి అనువాదకులు చంపూరామాయణము
76 ఋగ్వేదకవి వేంకటాచలపతి
77 అల్లమరాజు రంగశాయి
78 బులుసు సీతారామకవి
79 పూసపాటి రంగనాయకామాత్యుడు
80 జయంతి రామయ్య పంతులు
81 బుద్ధవరపు మహాదేవుడు
బాలరామాయణ ఆంధ్రీకరణ బాలరామాయణ ఆంధ్రీకరణ
82 గరెంపూడి వెంకట సుబ్బయామాత్యుడు
83 ఆదిపూడి సోమనాధరావు
84 జయంతి రామయ్య పంతులు
85 నల్లాన్ చక్రవర్తుల సింహాద్రి అయ్యంగార్ (పెన్నాడ)
86 శేషగిరి వేంకట రమణకవి
విచిత్ర రామాయణ కర్తలు
87 తుమురాడ పాపకవి (రామకథా సుధార్ణవమని నామాంతరము)
88 కొమ్మాజీ సోమనాధశిల్పాచార్యుడు
89 వేల్పూరి వేంకటేశ్వర కవి
90 నరసింహదేవర వేంకట శాస్త్రి

మూలాలు[మార్చు]

  1. శ్రీమద్రామాయణములో ఆంధ్రాయణము అను ఆంధ్ర జనపద రామాయణము. మచిలీపట్టణము: శ్రీ శారదా సాహితీ సంసద్. p. ౯౬. |access-date= requires |url= (help)