Coordinates: 15°40′N 79°57′E / 15.66°N 79.95°E / 15.66; 79.95

తెల్లబాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెల్లబాడు ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం

గ్రామం
పటం
Coordinates: 15°40′N 79°57′E / 15.66°N 79.95°E / 15.66; 79.95
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంమద్దిపాడు మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( 8593 Edit this on Wikidata )
పిన్‌కోడ్523263 Edit this on Wikidata


పటం

విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల[మార్చు]

తెల్లబాడు గ్రామ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో, దాతలు శ్రీ కాట్రగడ్డ రవీంద్రబాబు, శివప్రసాదు గార్ల విరాళాలతో నిర్మించిన, నూతన భోజనశాల, సమావేశమందిరాలను, 2014, జూన్-14, శనివారం నాడు ప్రారంభించారు.

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

ప్రజా కళ్యాణమండపం:- తెల్లబాడు గ్రామంలో కీ.శే.కల్లూరి సురేంద్రబాబు ఙాపకార్ధం, వారి బంధువులు 40 లక్షల రూపాయల వ్యయంతో, ప్రజా కళ్యాణమండపం ఏర్పాటుచేసి, 2015, డిసెంబరు-2వ తేదీనాడు ప్రారంభించారు.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో పల్లెపు వెంకటేశ్వర్లు సర్పంచిగా ఎన్నికైనారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీ చెన్నమల్లేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయం 400 సంవత్సరాల చరిత్ర గలది. ఈ ఆలయంలో, 2015, మార్చి-19వ తేదీ, మాసశివరాత్రి నాడు, సూర్యకిరణాలు గర్భగుడిలోనికి ప్రవేశించి స్వామివారిని అభిషేకించినవి. అర్చకులు స్వామివారికి విశేషపూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి తరించారు.

ఈ ఆలయంలో 2015, ఆగస్టు-31వతేదీ సోమవారంనాడు, పోలేరమ్మ పొంగళ్ళ కార్యక్రమం వేడుకగా నిర్వహించారు. సాగుచేసిన పంటలుబాగా పండాలనీ, వర్షాలు బాగా కురిసి, పంటలు బాగా పంటలు బాగా పండాలనీ పూజలుచేసారు. పొంగళ్ళు సమర్పించుకొని మొక్కుబడులు తీర్చుకున్నారు. కొలుపులకు బంధుమిత్రుల రాకతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొన్నది. సాయంత్రం గ్రామములో పొంగళ్ళతో గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల వేషధారణలు, వాయిద్యాలతో ఊరేగింపు సందడిగా సాగినది.

ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

మూలాలు[మార్చు]


వెలుపలి లింకులు[మార్చు]