తోట వైకుంఠం
తోట వైకుంఠం | |
---|---|
![]() తోట వైకుంఠం | |
జననం | తోట వైకుంఠం 1942 బూరుగుపల్లి, కరీంనగర్ జిల్లా |
ప్రసిద్ధి | చిత్రకారులు |
మతం | హిందూ మతము |
''తోట వైకుంఠం' ('ఆంగ్లం: Thota Vaikuntam ) ప్రముఖ భారతీయ చిత్రకారుడు.[1] ఇతని చిత్రాలు గ్రామీణ జీవనశైలిని ప్రతిబింబించే విధంగా వుంటాయి. వైకుంఠం తెలంగాణ కరీంనగర్ జిల్లాలోని బూరుగుపల్లి గ్రామంలో 1942 లో జన్మించాడు.
జననం విద్యాభ్యాసం
[మార్చు]తోట వైకుంఠం 1942లో కరీంనగర్ జిల్లా బూరుగుపల్లిలో గ్రామంలో జన్మించారు. అచటనే వైకుంఠం పాఠశాల స్థాయిలోనే చిత్రలేఖనం ప్రారంభించారు.అనంతరం 1960లో హైదరాబాద్ లోని కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, ఆర్కిటెక్చర్లో చేరారు. 1970లో పెయింటింగ్లో డిప్లొమా పొంది, మరుసటి సంవత్సరం ఫ్యాకల్టీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో చేరడానికి ఆంధ్రప్రదేశ్ లలితకళా అకాడమీ నుంచి ఫెలోషిప్ పొందారు. బరోడాలోని మహారాజా సాయాజీరావు వర్సిటీలో ప్రఖ్యాత కళాకారుడు కె. జి. సుబ్రహ్మణ్యన్ వద్ద నైపుణ్యాలు మెరుగుపరుచుకు న్నారు. అనంతరం హైదరాబాద్ బాల్ భవన్ లో 15 ఏళ్ల పాటు కళా ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించారు. అలాగే పల్లెటూరి పిల్లగాడ, మాభూమి, మట్టిమనుషులు, దాసి చలనచిత్రాలకు కళా దర్శకుడిగా పనిచేశారు. దాసి చిత్రానికి 1989లో జాతీయ అవార్డు అందు కున్నారు. దేశంలోని అనేక రాష్ట్రాలతోపాటు లండన్, న్యూయార్క్, దుబాయ్, కాలిఫోర్నియా, సింగపూర్, హాంకాంగ్ లోని ప్రతిష్ఠాత్మక గ్యాలరీల్లో తన చిత్రాలు ప్రదర్శించడానికి వైకుంఠం ఆహ్వానాలు అందుకున్నారు.
చిత్రకళా ప్రస్థానం
[మార్చు]కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్, హైదరాబాద్ లో పెయింటింగ్ లో డిగ్రీ పొంది, పిమ్మట 1971-72లో ఆంధ్రప్రదేశ్, లలిత కళా అకాడమీ ఫెలోషిప్‌పై బరోడాలోని మహారాజా సాయాజీరావు యూనివర్శిటీలో K. G. సుబ్రమణ్యన్ వద్ద ప్రింట్‌మేకింగ్ లో శిక్షణ పొందాడు.
అతని పెయింటింగ్‌లలో స్త్రీల పట్ల ఉన్న ప్రేమను, అతని గ్రామంలో ప్రదర్శించే నాటక బృందాల పురుష కళాకారులు స్త్రీ పాత్రల వేషధారణలో వుండే ప్రభావం అతని చిన్ననాటి జ్ఞాపకాలను ప్రతిబింబిస్తుంది. తాను పెరిగిన తెలంగాణ ప్రాంతంలోని దృఢమైన పురుషులు మరియు మహిళలను శక్తివంతమైన వారిగా చూపుతూ, ప్రకాశవంతమైన రంగులలో చిత్రిస్తారు.
యుధ్ వీర్ పురస్కారం
[మార్చు]ప్రముఖ చిత్రకారుడు తోట వైకుంఠం 32వ యుద్ వీర్ ఫౌండేషన్ స్మారక అవార్డుకు ఎంపికయ్యారు. చిత్రకళా రంగంలో ఆయన చేసిన కృషికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నట్లు ఫౌండేషన్ చైర్పర్సన్, విశ్రాంతి ఐపీఎస్ అరుణా బహుగుణ, ఫౌండేషన్ కార్యదర్శి విప్మా వీర్,అన్నారు. 2025 ఎప్రిల్ 30న హైదరాబాద్ రెడ్ హిల్స్ లోని ఎఫ్ టీ సీసీఐలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆమెర్ అలీ ఖాన్ చేతులమీదుగా అవార్డుతోపాటు ప్రశంసాపత్రం రూ. లక్ష నగదు బహుమతి అందజేజేస్తారు[2].
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-09-25. Retrieved 2009-07-18.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "ప్రముఖ చిత్రకారుడు తోట వైకుంఠానికి యుధ్‌వీర్ పురస్కారం". EENADU. Retrieved 2025-04-26.
బయటి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Pages using authority control with parameters
- చిత్రకారులు
- 1942 జననాలు
- జీవిస్తున్న ప్రజలు
- కరీంనగర్ జిల్లా వ్యక్తులు
- జన్మస్థలం తెలియని వ్యక్తులు