తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి | |||
| |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2019 - ప్రస్తుతం | |||
నియోజకవర్గం | రాప్తాడు నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 06 జూన్ 1973 తోపుదుర్తి గ్రామం ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ భారతదేశం | ||
రాజకీయ పార్టీ | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | ప్రేమకుమారి, ఆత్మారామిరెడ్డి | ||
జీవిత భాగస్వామి | మనోరమ | ||
సంతానం | సాయిసిద్ధార్థరెడ్డి, ఇందిరాప్రియదర్శిని |
తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాప్తాడు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]
జననం, విద్యాభాస్యం
[మార్చు]తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లా, ఆత్మకూరు మండలం, తోపుదుర్తి గ్రామంలో ఆత్మారామిరెడ్డి, ప్రేమకుమారి దంపతులకు జన్మించాడు. ఆయన బీఈ పూర్తి చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా రాప్తాడు నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత పై 1950 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాడు. ఆయన 2012లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి రాప్తాడు నియోజకవర్గవైసీపీ ఇంఛార్జ్ గా నియమితుడయ్యాడు.
తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి 2014లో వైసీపీ అభ్యర్థిగా రాప్తాడు నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి పరిటాల సునీతపై 7774 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2019లో అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత పై 25,575 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[2]
ఆయన 2021లో తిరుపతి లోక్‌సభ సీటు ఉప ఎన్నికకు నియోజకవర్గం పరిధిలోని సూళ్ళూరుపేట నియోజకవర్గం వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా పని చేశాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (2019). "MLA Candidates Winners LIST in Andhra Pradesh Elections 2019". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
- ↑ Sakshi (2019). "వైఎస్సార్సీపీ". Archived from the original on 2 November 2021. Retrieved 8 November 2021.
- ↑ TeluguTV9 Telugu (24 March 2021). "తిరుపతి ఉప ఎన్నిక.. అధికార, ప్రతిపక్షంలోని ఆ నాయకులకు అగ్ని పరీక్ష." Archived from the original on 13 November 2021. Retrieved 13 November 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)