Jump to content

తౌహీద్ హృదయ్

వికీపీడియా నుండి
తౌహీద్ హృదయ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మొహమ్మద్ తౌహీద్ హృదయ్
పుట్టిన తేదీ (2000-12-04) 2000 డిసెంబరు 4 (వయసు 24)
బోగ్రా, బంగ్లాదేశ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి offbreak
పాత్రబ్యాటరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 140)2023 మార్చి 18 - ఐర్లాండ్ తో
చివరి వన్‌డే2023 సెప్టెంబరు 15 - ఇండియా తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.77
తొలి T20I (క్యాప్ 78)2023 మార్చి 9 - ఇంగ్లాండ్ తో
చివరి T20I2023 జూలై 14 - Afghanistan తో
T20Iల్లో చొక్కా సంఖ్య.77
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2017/18Rajshahi
2017/18Shinepukur
2019సిల్హెట్ సిక్సర్స్
2022Fortune Barishal
2023Sylhet Strikers
2023Jaffna Kings
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డేలు ట్వంటీ20 ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 14 8 13 61
చేసిన పరుగులు 496 156 748 2,201
బ్యాటింగు సగటు 41.33 26.00 41.55 48.91
100లు/50లు 0/5 0/0 2/4 1/19
అత్యుత్తమ స్కోరు 92 47* 217 122*
వేసిన బంతులు 288 72
వికెట్లు 6 1
బౌలింగు సగటు 25.16 65.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 3/19 1/18
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 1/– 10/– 14/–
మూలం: Cricinfo, 2023 జూన్ 16

తౌహిద్ హృదయ్ (జననం 2000 డిసెంబరు 4) బంగ్లాదేశ్ క్రికెట్ ఆటగాడు. [1] అతను 2017 అక్టోబరు 13న 2017–18 నేషనల్ క్రికెట్ లీగ్‌లో రాజ్‌షాహీ డివిజన్‌ తరఫున ఫస్ట్-క్లాస్ రంగప్రవేశం చేసాడు [2]

2017 డిసెంబరులో తైహిద్, 2018 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టుకు ఎంపికయ్యాడు. [3] అతను 2018 ఫిబ్రవరి 5న 2017–18 ఢాకా ప్రీమియర్ డివిజన్ క్రికెట్ లీగ్‌లో షినేపుకుర్ క్రికెట్ క్లబ్ తరపున తన తొలి లిస్టు A మ్యాచ్ ఆడాడు.[4]

2018 అక్టోబరులో 2018–19 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ కోసం అతన్ని, సిల్హెట్ సిక్సర్స్ జట్టులోకి తీసుకున్నారు.[5] అతను 2019 జనవరి 6న 2018–19 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో సిల్హెట్ సిక్సర్స్ కోసం తన ట్వంటీ20 రంగప్రవేశం చేసాడు [6] 2019 డిసెంబరులో, 2020 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. [7] 2021 ఫిబ్రవరిలో, ఐర్లాండ్ వోల్వ్స్‌తో జరిగిన స్వదేశీ సిరీస్ కోసం బంగ్లాదేశ్ ఎమర్జింగ్ స్క్వాడ్‌లో ఎంపికయ్యాడు. [8] [9]

2021 డిసెంబరులో, 2021-22 బంగ్లాదేశ్ క్రికెట్ లీగ్ సందర్భంగా తౌహీద్, 217 పరుగులు చేసి, ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో తన తొలి డబుల్ సెంచరీ సాధించాడు. [10]

2023 మార్చిలో, తైహీద్ 85 బంతుల్లో 92 పరుగులు చేసాడు. అది బంగ్లాదేశ్ బ్యాటర్లకు వన్డే రంగప్రవేశంలో అత్యధిక వ్యక్తిగత ఇన్నింగ్స్. [11]

అంతర్జాతీయ కెరీర్

[మార్చు]

2023 ఫిబ్రవరిలో, ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్ కోసం బంగ్లాదేశ్ వన్డే ఇంటర్నేషనల్ జట్టులో అతను ఎంపికయ్యాడు. [12] 2023 మార్చిలో, అతను అదే సిరీస్ కోసం ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (T20I) జట్టుకు ఎంపికయ్యాడు. [13] 2023 మార్చి 9న, ఆ సిరీస్‌లోని మొదటి T20I అతని కెరీర్లో తొలి T20I. [14] 2023 మార్చి 18న ఐర్లాండ్‌పై వన్‌డేల్లో ఆడుగుపెట్టాడు.[15] అందులో తౌహీద్ 92 పరుగులు చేశాడు. ఇది అతని వన్డే రంగప్రవేశంలో బంగ్లాదేశ్ ఆటగాడి అత్యధిక వ్యక్తిగత స్కోరు. [16]

ఇంకా, ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన సిరీస్‌లో, తైహీద్ మొదటి T20లో 47 పరుగులతో మ్యాచ్‌న్ను గెలిపించే ఇన్నింగ్సు ఆడాడు. ఆ మ్యాచ్‌లో చివరి బంతికి బంగ్లాదేశ్ గెలిచింది.

మూలాలు

[మార్చు]
  1. "Towhid Hridoy". ESPN Cricinfo. Retrieved 13 October 2017.
  2. "Tier 2, National Cricket League at Bogra, Oct 13-16 2017". ESPN Cricinfo. Retrieved 13 October 2017.
  3. "Saif Hassan likely to lead Bangladesh U-19 at World Cup". ESPN Cricinfo. 6 December 2017. Retrieved 6 December 2017.
  4. "2nd match, Dhaka Premier Division Cricket League at Fatullah, Feb 5 2018". ESPN Cricinfo. Retrieved 5 February 2018.
  5. "Full players list of the teams following Players Draft of BPL T20 2018-19". Bangladesh Cricket Board. Retrieved 29 October 2018.
  6. "3rd Match, Bangladesh Premier League at Dhaka, Jan 6 2019". ESPN Cricinfo. Retrieved 6 January 2019.
  7. "Media Release : ICC U19 CWC South Africa 2020 : Bangladesh Under 19 Team Announced". Bangladesh Cricket Board. Retrieved 21 December 2019.
  8. "Ireland Wolves tour of Bangladesh to start with four-day game in Chattogram". ESPN Cricinfo. Retrieved 9 February 2021.
  9. "Media Release: Ireland Wolves in Bangladesh 2021s Itinerary". Bangladesh Cricket Board. Retrieved 9 February 2021.
  10. "BCL: Nayeem Hasan triggers 9 for 43 collapse as East Zone beat Central Zone". ESPN Cricinfo. Retrieved 22 December 2021.
  11. "Hridoy has no regrets after missing ton on ODI debut". Cricbuzz. Retrieved 18 March 2023.
  12. "Tamim Iqbal returns to ODI side for England series". ESPNcricinfo. Retrieved 16 February 2023.
  13. "Bangladesh pick uncapped trio for England T20Is". CricBuzz. Retrieved 1 March 2023.
  14. "1st T20I (D/N), Chattogram, March 09, 2023, England tour of Bangladesh". ESPNcricinfo. Retrieved 9 March 2023.
  15. "1st ODI (D/N), Sylhet, March 18, 2023, Ireland tour of Bangladesh". ESPNcricinfo. Retrieved 18 March 2023.
  16. "Hridoy has no regrets after missing ton on ODI debut". Cricbuzz. Retrieved 18 March 2023.