త్రిపురనేని మధుసూదనరావు
త్రిపురనేని మధుసూధనరావు విప్లవ రచయితల సంఘం సభ్యుడు. అతను ప్రముఖ హేతువాద రచయిత, సంఘసంస్కర్త అయిన త్రిపురనేని రామస్వామి మనుమడు. అతను నాస్తికుడు. నటుడు, రచయిత. అతనిని తిరుపతి మావో అంటారు.
జీవిత విశేషాలు[మార్చు]
అతను 1937 జనవరి 1 న జన్మించాడు. ఎం.ఎ. తెలుగు చేశాడు. సంస్కృతం, ప్రాకృతం పై పట్టు సాధించాడు. 1964 నుంచీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తోన్న గోవింద రాజస్వామి కళాశాల, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, ఓరియెంటల్ కళాశాలల్లో ఉపన్యాసకుడిగా 1997 వరకు పనిచేశాడు. అభ్యుదయ రచయితల సంఘం (అరసం) తో అనుబంధం. 1974లో విరసం ప్రధాన కార్యదర్శి అయ్యాడు. ఎమర్జెన్సీ కాలంలో జైలు కెళ్ళాడు. మార్క్సిస్టు మానవతా వాదం ఆయన ప్రతిపాదన. వ్యాసుడు, వాల్మీకి, కాళిదాసుల మీద నాటకాలు లోయలు- శిఖరాలు అనే నాటకం రాశాడు. కవిత్వ చైతన్యం, సాహిత్యంలో వస్తు శిల్పాలు, గతితార్కిక సాహిత్య భౌతిక వాదం వంటి రచనలు బుర్రకథలు రాశాడు, లోయలు- శిఖరాలు అనే నాటకం స్వయంగా రాయడమే కాక, అందులో నటించాడు కూడా. ఎంత పెద్ద రచయిత అయినా సిద్ధాంతంలో, అవగాహనలో లోపాలుంటే ఉపేక్షించేవారు కాదు. 2004 అక్టోబరు ఎనిమిదో తేదీ కన్నుమూశాడు.[1]
రచనలు[2][మార్చు]
- కవిత్వం - చైతన్యం - విప్లవ సాహిత్య వ్యాసాలు
- తెలుగులో కవితా విప్లవ స్వరూపం - కవిసేనకు జవాబు
- మార్క్సిజం - సాహిత్య విమర్శ
- సాహిత్యంలో వాస్తు శిల్పాలు - సాహిత్య విమర్శ వ్యాసాలు
- విశ్వనాథ తిరోగమన సాహిత్యం
- కలలు, సాహిత్య విజ్ఞానం
- సాహిత్యం కుట్రకాదు - రచయితలు కుట్రదారులు కారు
- గతితార్కిక మానవతావాదం
- మార్క్సిజం సాహిత్యం - ఆర్.ఎస్.ఎస్.సాహిత్య దర్శనం
మూలాలు[మార్చు]
బయటి లంకెలు[మార్చు]
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- 1937 జననాలు
- 2004 మరణాలు
- నాస్తికులు
- విప్లవ రచయితలు
- కృష్ణా జిల్లా రచయితలు
- కృష్ణా జిల్లా హేతువాదులు
- కృష్ణా జిల్లా ఉపాధ్యాయులు
- కృష్ణా జిల్లా విప్లవ రచయితల సంఘ సభ్యులు
- కృష్ణా జిల్లా నాటక రచయితలు
- కృష్ణా జిల్లా రంగస్థల నటులు