త్రిపురాన తమ్మయదొర
స్వరూపం
త్రిపురాన తమ్మయదొర | |
---|---|
జననం | 1849 సిద్ధాంతం, శ్రీకాకుళం జిల్లా |
మరణం | 1890 |
వృత్తి | కవి. |
పిల్లలు | త్రిపురాన వేంకటసూర్యప్రసాదరాయకవి |
తల్లిదండ్రులు |
|
త్రిపురాన తమ్మయదొర (1849 - 1890) ప్రముఖ తెలుగు రచయిత, కవి.
వీరు తెలగా వంశీయుడు. తల్లి: చిట్టమాంబ (చిట్టెమ్మ). తండ్రి: వేంకటస్వామిదొర. వీరి జన్మస్థానము, నివాసము: విశాఖ పట్టణం మండలంలో శ్రీకాకుళం తాలూకా సిద్ధాంతం గ్రామం. జనను: 1849 సం. సౌమ్య సంవత్సర శ్రావణ శుద్ధ చతుర్దశి గురువారము. నిర్యాణము: 1890 సం. వికృతి సంవత్సర పుష్య శుద్ధ పూర్ణిమ.
ఇతని కుమారుడు త్రిపురాన వేంకటసూర్యప్రసాదరాయకవి కూడా సుప్రసిద్ధ కవి పండితులు.
రచనలు
[మార్చు]- 1. నీతిశతకము
- 2. పాండురంగాష్టోత్తరశతము
- 3. కామినీ నిర్మోహజనన తారావళి
- 4. విటీవిట నటనార్థమాల
- 5. ముఖలింగేశ్వరశతకము
- 6. నిద్రా విజయము
- 7. శ్రీ దేవీ భాగవత మహాపురాణము (1883 విరచితము)
మూలాలు
[మార్చు]- త్రిపురాన తమ్మయదొర, ఆంధ్ర రచయితలు, మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, 1950, పేజీలు: 110-14.