దక్షిణాఫ్రికా (పుస్తకం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దక్షిణాఫ్రికా
కృతికర్త: దిగవల్లి వేంకటశివరావు
దేశం: భారతదేశం
భాష: తెలుగు
విభాగం(కళా ప్రక్రియ): చరిత్ర
ప్రచురణ:
విడుదల: 1928

దక్షిణాఫ్రికాకు, భారతదేశానికి జాతీయోద్యమానికి పూర్వం నుంచి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. 19శతాబ్ది సమయంలోనే ఎందరో భారతీయులు కూలీలుగా పనిచేయడానికి వలసవెళ్ళారు. ఆపైన మహాత్మా గాంధీ బారిస్టరుగా పనిచేయడానికి దక్షిణాఫ్రికా వెళ్ళి సత్యాగ్రహమనే ఆయుధాన్ని కనుగొన్నారు. తన జీవితమునకు పురుషార్ధ సాధనమని తలచిన గాంధీ మహాత్ముని దక్షిణాఫ్రికా. బ్రిటీష్ పరిపాలనలో మగ్గుతూ దేశ స్వాతంత్ర్య ఉద్యమాన్ని భారత జాతీయోద్యమ స్ఫూర్తితోనే కృషిచేశారు. అటువంటి దేశ చరిత్రను నిర్మించడం వల్ల నడుస్తున్న జాతీయోద్యమానికి సహకారి అవుతుందని భావించి 1924 లోనే ఈ పుస్తక రచన ప్రారంభించారు దిగవల్లి వేంకటశివరావుగారు. ఈ పుస్తకమును తనకి అంకితమిస్తే అభ్యంతరములేదని మహాత్మా గాంధీజీ ఫిబ్రవరి 26 తేది 1927న స్వహస్తముతో పోస్టు కార్డు వ్రాశారు ("I have no objection to your dedicating your work to me provided that you do not mention anywhere that the dedication is with my permission for I do...... ". ఫిబ్రవరి 14 వ తేదీ 1928 సంవత్సరములో ఈ గ్రంథాన్ని విజ్ఞానచంద్రికామండలివారు ప్రచురించిన న గ్రంథమాలలో 36 వ పుస్తకముగా ప్రచురించబడింది. ఆంధ్రగ్రంధాలయ ముద్రాక్షరశాలలోముద్రించబడింది.

విషయసూచిక[మార్చు]

మొదటి భాగము
 1. ఇండియా - ఆఫ్రికా
 2. దేశము - జనులు
 3. పాశ్చాత్యుల రాక
 4. బోయరుల వలస
 5. కేపు కాలనీ నేటాలు రాజ్యములు
 6. బోయరు ప్రజాస్వామ్యములు
 7. బోయరులు - బోయరేతరులు
 8. బ్రిటీషు మంత్రుల రాజతంత్రము
 9. బ్రిటీషు బోయరుల యుద్ధము
 10. దక్షిణాఫ్రికా సమితి
 11. ఇతర వలస రాజ్యములు
రెండవ భాగము
 1. దక్షిణాఫ్రికా భారతీయులు
 2. వలసకూలీ
 3. గాంధీ మహాత్ముడు
 4. నేటాలు - ట్రాన్సువాలు
 5. సత్యాగ్రహ మహోద్యమము
 6. గాంధీ విజయము
 7. సామ్రాజ్య పౌరసత్వము
 8. గాంధీస్మంట్సు ఒడంబడికయొక్క గతి
 9. రాయబారములు
 10. దక్షిణాప్రికా ఒడంబడిక
 11. తూర్పు ఆఫ్రికాలోని భారతీయులు

మూలాలు[మార్చు]