Jump to content

దక్షిణాయనం

వికీపీడియా నుండి
(దక్షిణాయణం నుండి దారిమార్పు చెందింది)
సూర్యుడు
సూర్యుడు

ఉత్తరాయనం దేవతలకు పగలు
దక్షిణాయనం దేవతలకు రాత్రి
మన పూర్వీకులు సూర్యుని సంచారాన్ని రెండు భాగాలుగా విభజించారు . సూర్యుడు భూమధ్యరేఖకు ఉత్తరదిశలో ఉన్నట్లు కనిపించునప్పుడు ఉత్తరాయనం అని, సూర్యుడు భూమధ్యరేఖకు దక్షిణముగా ఉన్నట్లు కనిపించినప్పుడు దక్షిణాయనము అని పిలిచారు . (సంవత్సరాన్ని రెండు ఆయనములుగా విభజించారు.) ఏడాదిలో 6 నెలలు ఉత్తరాయనం అయితే 6 నెలలు దక్షిణాయనం. ఖగోళ శాస్త్రం ప్రకారము ప్రతి సంవత్సరము జనవరి 15 నుండి జూలై 15 వరకు ఉత్తరాయణం అని, జూలై 16 నుండి జనవరి 14 వరకు ఉండే కాలాన్ని దక్షిణాయణం అని అంటారు. ఇంతటి మార్పుకు సంబంధించిన విశేషాన్ని లోకం లోని అతి సామాన్యులకు అర్ధమయ్యేలా వివరించేందుకు పండగను చేసుకునే అలవాటును ప్రచారం లోనికి తెచ్చారు .

తెలుగు మాసాలు

[మార్చు]

1.చైత్రమాసంఉత్తరాయనం -- వసంత ఋతువు
2.వైశాఖ మాసం—ఉత్తరాయనం -- వసంత ఋతువు
3.జ్యేష్టమాసం -- ఉత్తరాయనం -- గ్రీష్మ ఋతువు
4.ఆషాఢ మాసం—ఉత్తరాయనం + దక్షిణాయనం గ్రీష్మ ఋతువు

5.శ్రావణమాసం --దక్షిణాయనం -- వర్ష ఋతువు
6.భాధ్రపద మాసం --దక్షిణాయనం -- వర్ష ఋతువు
7.ఆశ్వయుజ మాసం --దక్షిణాయనం -- శరత్ ఋతువు
8.కార్తీక మాసం—దక్షిణాయనం -- శరత్ ఋతువు
9.మార్గశిరమాసం --దక్షిణాయనం -- హేమంత ఋతువు

10.పుష్య మాసం -- దక్షిణాయనం + ఉత్తరాయణం -- హేమంత ఋతువు
11.మాఘమాసం -- ఉత్తరాయనం -- శిశిర ఋతువు
12.ఫాల్గుణమాసం -- ఉత్తరాయనం -- శిశిర ఋతువు

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]