దరియా హుస్సేన్ షేక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

షేక్ దరియా హుస్సేన్ సాంస్కృతిక కార్యకర్తగా సుప్రసిద్ధుడు. ఇతడు గుంటూరు జిల్లా, వినుకొండలో ఇమాం సాహెబ్, మౌలాబీ దంపతులకు 1933, జూలై 1న జన్మించాడు[1].

విద్య, ఉద్యోగం

[మార్చు]

ఇతని ఉన్నత పాఠశాల చదువు వినుకొండలో నడిచింది. నరసారావుపేటలో బి.ఎ., రాజమండ్రిలో బి.యిడి. చదివాడు. విద్యాశాఖలో విస్తరణాధికారిగా అనంతపురం జిల్లాలో పనిచేశాడు. ఇతడు సాహిత్య సభలలోను, సాంస్కృతిక కార్యక్రమాలలోను చురుకుగా పాల్గొన్నాడు. ఎన్నో అష్టావధానాలలో, కవిసమ్మేళనాలలో పాల్గొన్నాడు.

సాంఘిక కార్యక్రమాలలో

[మార్చు]

అనంతపురం రాయలకళాగోష్టికి కార్యదర్శిగా సేవలను అందించాడు. ఆశావాది ప్రకాశరావు, శాంతి నారాయణ తదితరులతో కలిసి పనిచేసి అనంతపురం జిల్లాలో సాహిత్యచైతన్యాన్నిపెంపొందించాడు.

రచనలు

[మార్చు]
  1. పురుషోత్తముడు
  2. విశ్వనాథ విజయము

మూలాలు

[మార్చు]
  1. అక్షరశిల్పులు - సయ్యద్ నశీర్ అహ్మద్ పుట 59