దర్గా (గ్రామం)
Jump to navigation
Jump to search
దర్గా (గ్రామం) ప్రకాశం జిల్లా కంభం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
దర్గా (గ్రామం) | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°32′37.752″N 79°5′26.448″E / 15.54382000°N 79.09068000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండలం | కంభం |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
గ్రామ పంచాయతీ
[మార్చు]2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో వేమా కృష్ణ, సర్పంచిగా, ఏకగ్రీవంగా ఎన్నికైనారు.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]శ్రీ రామాలయం:- దర్గా గ్రామ సమీపంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం, 2015,మే-30వ తేదీ శనివారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా, హోమం, కలశ ప్రతిష్ఠతోపాటు, ఇతర పూజలు నిర్వహించారు. 31వ తేదీ ఆదివారంనాడు, వేదపండితుల ఆధ్వర్యంలో యంత్రప్రతిష్ఠ, విగ్రహప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు. అనంతరం హోమం నిర్వహించి, పూర్ణాహుతి కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు కాయాకర్పూరం సమర్పించి, తీర్ధప్రసాదాలు సమర్పించారు. ఈ సందర్భంగా బంంధుమిత్రుల రాకతో, గ్రామంలో పండుగ వాతావరణం నెలకొన్నది. అనంతరం, విచ్చేసిన భక్తులకు, అన్నదానం నిర్వహించారు.