14 వ దలైలామా
14 వ దలైలామా | |
---|---|
Holiness | |
14 వ దలైలామా (ప్రస్తుత దలైలామా) | |
పరిపాలన | 1934 - |
Tibetan | ཏཱ་ལའི་བླ་མ་ |
Wylie transliteration | taa la’i bla ma |
Pronunciation | [taːlɛː lama] |
THDL | దలై లామా |
Pinyin Chinese | Dálài Lǎmā |
రాజకుటుంబము | Dalai Lama |
దలైలామా (ఆంగ్లం Dalai Lama) పేరు చెబితే ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది బౌద్ధుల హృదయాలు పూజ్య భావంతో బరువెక్కుతాయి. దలైలామా బుద్ధుల మత గురువే కాదు ప్రవాస టిబెట్ ప్రభుత్వానికి అధినేత కూడా. అహింసాయుతంగా టిబెట్ స్వాతంత్ర్యం కోసం ఏభై ఏళ్ళుగా పోరాడుతున్నాడు. 1933 లో 13వ దలైలామా నిర్యాణం తరువాత ఈయన 1935 జూలై 6 తేదీన ఉత్తర టిబెట్ లోని థక్సర్ లో పుట్టాడు. ఈయన అసలు పేరు లామోస్ తొండప్. నాలుగేళ్ళకే బౌద్ధ సన్యాసిగా మారిన తొండప్ తరువాత 14 వ దలైలామాగా అవతరించాడు. చైనా టిబెట్ ని ఆక్రమించి, అక్కడ నుంచి దలైలామాని వెళ్ళగొట్టడంతో 1959 నుంచీ ఈయన భారతదేశంలో శరణార్ధిగా ఉంటున్నాడు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని ధర్మశాలకి తొమ్మిది కిలోమీటర్ల దూరంలోని ఎత్తైన కొండల మీద మెక్లోడ్ గంజ్ లో ఈయన భవనం ఉంది. ఆ ఆవరణలో ఉండే ఆలయంలో భక్తులకు దర్శనం ఇస్తుంటాడు. దలైలామాలంతా బుద్ధుని అంశ అయిన అవలోకేశ్వరుని పునర్జన్మలని బౌద్ధుల నమ్మకం. దలైలామా మరణిస్తే, మళ్ళీ ఇంకో చోట పుట్టి, మళ్ళీ దలైలామాగా పగ్గాలు చేపడతాడని బౌద్ధుల విశ్వాసం. మహాత్మా గాంధీ మార్గంలో టిబెట్ స్వేచ్ఛ కోసం పోరాడుతున్న దలైలామాకి నోబుల్ శాంతి బహుమతి కూడా లభించింది.
దలైలామాలు
[మార్చు]సంఖ్య అసలు పేరు సంవత్సరం జన్మస్థలం
- జెడున్ ద్రుపా (1391 - 1474) షాబ్‌టాడ్ (ఉత్సాంగ్)
- జెడున్ గ్యాట్‌సో (1475 - 1542) తనాంగ్ సెగ్మీ (ఉత్సాంగ్)
- సోనం గ్యాట్‌సో (1543 - 1588) తొలుంగ్ (ఉత్సాంగ్)
- యాంటెన్ గ్యాట్‌సో (1589 - 1617) మంగోలియా
- నగ్‌వాంగ్ లాబ్‌స్టాంగ్ గ్యాట్‌సో (1617 - 1682) చింగ్‌వార్‌టాక్‌ట్సే (ఉత్సాంగ్)
- సంగ్‌యాంగ్ గ్యాట్‌సో (1682 - 1706) మాన్ తవంగ్
- కెల్‌సాంగ్ గ్యాట్‌సో (1708 - 1757) లిట్‌హాంగ్
- జాంపెల్ గ్యాట్‌సో (1758 - 1804) తోబ్‌గ్యాల్ (ఉత్సాంగ్)
- లాంగ్‌టాక్ గ్యాట్‌సో (1805 - 1815) డాన్ చోకోహార్
- సుల్ట్రీమ్ గ్యాట్‌సో (1816 - 1837) లిట్‌హాంగ్
- కేద్రుప్ గ్యాట్‌సో (1838 - 1856) గతర్
- టిన్‌లే గ్యాట్‌సో (1856 - 1875) లోహ్‌కా
- తుప్టేన్ గ్యాట్‌సో (1876 - 1933) తాక్‌పోలాండున్
- లామోస్ తొండప్ (1935 - ) థక్సర్