Jump to content

దాండేలి వన్యప్రాణుల అభయారణ్యం

వికీపీడియా నుండి
దండేలి వన్యప్రాణుల అభయారణ్యం వద్ద మలబార్ పైడ్ హార్న్ బిల్

దండేలి వన్యప్రాణుల అభయారణ్యం (Dandeli Wildlife Sanctuary) కర్ణాటక రాష్ట్రం లోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉంది. ఈ అభయారణ్యం విస్తీర్ణం 866.41 కి.మీ2 (334.52 చ. మై.). 2006 లో పొరుగున ఉన్న అన్షి నేషనల్ పార్క్ తో పాటు, ఈ అభయారణ్యాన్ని అన్షి దండేలి టైగర్ రిజర్వ్‌లో భాగంగా ప్రకటించారు. 2015 జూన్ 4 న కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కింద దండేలి ఎలిఫెంట్ రిజర్వ్ ను అధికారికంగా గుర్తించింది. దీని విస్తీర్ణం 2,321 కి.మి.2 . 2002 లో మైసూరు ఏనుగు రిజర్వ్ తరువాత కర్ణాటకలో ఇదే రెండవదిగా ప్రభుత్వం ప్రకటించింది. [1]

పక్షులను ఇష్టపడే వారికి ఈ ప్రాంతం ఒక స్వర్గం. దాదాపు 200 జాతుల పక్షులను ఇక్కడ చూడవచ్చు [2] వీటిలో ముఖ్యమయినవి - గ్రేట్ ఇండియన్ హార్న్‌బిల్ (గ్రేట్ పైడ్ హార్న్‌బిల్), మలబార్ పైడ్ హార్న్‌బిల్‌ . భారతదేశంలో బ్లాక్ పాంథర్ కలిగిన ఏకైక టైగర్ రిజర్వ్ ఇదే. ఇక్కడ ఇండియన్ స్లాథ్ ఎలుగుబంటి, ఇండియన్ పాంగోలిన్, జాయంట్ మలబార్ స్క్విరెల్, ధోలే, ఇండియన్ జాకల్, ముంట్జాక్ (మొరిగే జింక) లను కూడా చూడవచ్చు. ఏనుగులు కనపడటం చాలా సాధారణ విషయమైతే కింగ్ కోబ్రా, మగ్గర్ మొసలి (ఇండియన్ క్రొకోడైల్) దండేలి వన్యప్రాణుల అభయారణ్యంలో ప్రధాన సరీసృపాలు.

దండేలిలోని అడవులు వెదురు, టేకు తోటలతో కూడిన దట్టమైన అడవి ప్రాంతం. వృక్షజాలంతో, జంతుజాలంతో ఈ అరణ్యం సమృద్ధిగా ఉంది. పర్యాటకులకు ఈ అభయారణ్యంలో మొసళ్ళు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. ఇక్కడి పక్షులు, మొసల్లు ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తాయి. ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి మార్చి నుండి అక్టోబరు ఉత్తమ సమయం.

మూలాలు

[మార్చు]
  1. "Dandeli Elephant Reserve notified". The Hindu. Mysuru, India. 10 June 2015. Retrieved 10 August 2015.
  2. "Know more about Dandeli Wildlife Sanctuary Tourist Places & Resorts". Archived from the original on 4 నవంబరు 2015. Retrieved 18 September 2015. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)