కాళీ పులుల సంరక్షణ కేంద్రం
కాళీ పులుల సంరక్షణ కేంద్రం | |
---|---|
Location | ఉత్తర కన్నడ జిల్లా, కర్ణాటక, భారతదేశం |
Nearest city | దండెలి |
Coordinates | 15°1′N 74°23′E / 15.017°N 74.383°E |
Area | 1,300 కి.మీ2 (500 చ. మై.) |
Established | సెప్టెంబర్ 2, 1987 |
Official website |
కాళీ పులుల సంరక్షణ కేంద్రం కర్ణాటక రాష్ట్రంలో ఉత్తర కనరా జిల్లాలోని దాండేలి ప్రాంతంలో ఉంది.[1]
చరిత్ర
[మార్చు]ఈ అడవి ప్రాంతం మే 10, 1956 న దాండేలి వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంగా ప్రకటింపబడింది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఈ కేంద్రంలో ఉన్న సగభాగాన్ని కలిపి అన్షి జాతీయ ఉద్యానవనాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించి, ఈ ప్రతిపాదనను సెప్టెంబర్ 2, 1987 న అమలు చేసింది.[2] 2002 లో ఈ ఉద్యనవనాన్ని 90 చదరపు కిలోమీటర్లు మేర విస్తరించారు. అన్షి జాతీయ ఉద్యానవనం, దాండేలి వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాన్ని కలిపి "ప్రాజెక్ట్ టైగర్" కింద టైగర్ రిజర్వ్ హోదాను ఇచ్చి జనవరి, 2007 లో 'అన్షి దాండేలి టైగర్ రిజర్వ్' గా ప్రకటించారు. ఈ ఉద్యానవనంలో కాళీ నది ప్రవహిస్తుంది. ఆ నదికి గుర్తుగా డిసెంబర్ 2015 న దాండేలి అన్షి పులుల సంరక్షణ కేంద్రాన్ని కాళీ పులుల సంరక్షణ కేంద్రంగా నామకరణం చేశారు.
మరిన్ని విశేషాలు
[మార్చు]ఈ ఉద్యానవనం బెంగాల్ పులులు, చిరుతపులులు, భారతీయ ఏనుగులకు నివాసం అయింది. ఈ ఉద్యానవనం 1300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ "About the park", National Parks - Anshi National Park, Karnataka State Wildlife Board, 2011, retrieved 28 సెప్టెంబరు 2019[permanent dead link]
- ↑ Rajendran, S (17 January 2007), "Karnataka gets its fourth Project Tiger sanctuary", The Hindu, Chennai, India, archived from the original on 20 జూలై 2008, retrieved 28 September 2019