దార్ల నరసింహాచార్యులు
స్వరూపం
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
దార్ల నరసింహాచార్యులు (1908-1996) తెలుగు కవి, అభ్యుదయవాది, విమర్శకుడు, రచయిత, రంగస్థల నటుడు.
జీవిత విశేషాలు
[మార్చు]అతను అభినవ వేమన,కవిభూషణ బిరుదాంకితుడు. సింహతలలాటగంటాకంకణ సన్మానితుడు. అతని రచనలలో శ్రీనివాస స్తోత్రలహరి, కాలగతి శతకం, పార్వతి కళ్యాణం ప్రముఖమైనవి. హరిశ్చంద్ర నాటకం లో అతను నటించిన నక్షత్రకుని పాత్ర ఆ నాటకానికే వన్నె తెచ్చి పెట్టేది. అతను రచించిన శివశంభో అనే పాట ఎంతో ప్రఖ్యాతి గాంచినది. అతని భార్య పేరు వరహాలమ్మ. వీరికి ఐదుగురు సంతానం.ఇద్దరు కుమారులు,ముగ్గురు కుమార్తెలు. ఈ వంశ వృక్షము మొత్తము పిఠాపురం నందు స్థిరపడినారు. ఇప్పటిరంగస్థల నటులు నక్షత్రుడి పాత్ర దారులు వై.గోపాల రావు అతని ప్రియ శిష్యుడు.