దార్ల రామచంద్రం
స్వరూపం
దార్ల రామచంద్రం | |
---|---|
జననం | దార్ల రామచంద్రం 1958, నవంబరు 15 గొల్లచర్ల, డోర్నకల్ మండలం, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ |
మరణం | 2024, అక్టోబరు 24 |
వృత్తి | కథా రచయిత |
తండ్రి | దేవయ్య |
తల్లి | ఎల్లమ్మ |
దార్ల రామచంద్రం (1958, నవంబరు 15 - 2024, అక్టోబరు 24 ) తెలంగాణకు చెందిన కథ రచయిత.[1]
బాల్యం
[మార్చు]ఈయన 1958, నవంబరు 15న తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్ మండలం, గొల్లచర్ల గ్రామంలో జన్మించారు.[2]
పీజీ చేసిన తర్వాత సోషల్ వెల్ఫేర్ కాలేజీలో జూనియర్ లెక్చరర్‌గా చేరి ప్రిన్సిపాల్‌గా రిటైరయ్యారు. బి.ఎస్.రాములు నేతృత్వంలో సాగిన ‘దళిత రచయితలు కళాకారులు మేధావులు’ వేదికలో చురుగ్గా పాల్గొన్నారు. ఆ స్ఫూర్తితోనే దళితుల జీవితాలను, వారి గెలుపోటములను కథలుగా మలిచారు. ఈ కథలు 1995లో ‘కిర్రు చెప్పులు’ సంపుటిగా వెలువడ్డాయి.
కథా సంపుటాలు
[మార్చు]- కిర్రు చెప్పులు
కథలు
[మార్చు]- చాకిరేవు
- మమ్మల్ని బతకనివ్వరా
- నాపల్లె గుండె పగిలింది
- పల్లెతల్లి గుండె గోస
- బతుకు బడి
- బాలచంద్రుడు
- బతుకు దార
- అమ్మచెప్పిన కథ
మరణం
[మార్చు]ఈయన 2024, అక్టోబరు 24న మరణించాడు.
ఇవి కూడ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "దార్ల రామచంద్రం". www.kathanilayam.com. Retrieved 12 March 2018.
- ↑ "రచయిత: దార్ల రామచంద్రం". www.kathanilayam.com. Retrieved 12 March 2018.