Jump to content

దినేష్ కౌశిక్

వికీపీడియా నుండి
దినేష్ కౌశిక్
దినేష్ కౌశిక్


పదవీ కాలం
2014 – 2019
ముందు సుల్తాన్
తరువాత రణధీర్ సింగ్ గొల్లెన్
నియోజకవర్గం పుండ్రి

పదవీ కాలం
2005 – 2010
ముందు తేజ్వీర్ సింగ్
తరువాత సుల్తాన్
నియోజకవర్గం పుండ్రి

వ్యక్తిగత వివరాలు

జననం (1960-04-13) 1960 ఏప్రిల్ 13 (వయసు 64)
ఫతేపూర్ , పంజాబ్ , భారతదేశం (ప్రస్తుతం హర్యానా , భారతదేశం)
రాజకీయ పార్టీ స్వతంత్ర
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్
జీవిత భాగస్వామి సంధ్య కౌశిక్
సంతానం 2
నివాసం హర్యానా
వృత్తి రాజకీయ నాయకుడు

దినేష్ కౌశిక్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన పుండ్రి నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

దినేష్ కౌశిక్ స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయాల్లోకి వచ్చి ద్వారా 2000 శాసనసభ ఎన్నికలలో పుండ్రి నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మూడోస్థానంలో నిలిచాడు. ఆయన 2005 ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థి నరేందర్ శర్మపై 8,026 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]

దినేష్ కౌశిక్ ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి,[3] 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి సుల్తాన్ చేతిలో 4,051 ఓట్ల తేడాతో ఓడిపోయి, ఆ తరువాత 2014 ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రణధీర్ సింగ్ గొల్లెన్ పై 4,832 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4] దినేష్ కౌశిక్ ఆ తరువాత 2019, 2024 ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.[5][6]

మూలాలు

[మార్చు]
  1. Hindustantimes (27 September 2019). "Haryana Assembly Polls: Dinesh Kaushik, Pundri MLA". Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.
  2. Rediff (27 February 2005). "Cong secures majority in Haryana". Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.
  3. The Hindu (1 September 2009). "9 Independent ex-MLAs join Congress" (in Indian English). Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.
  4. India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  5. Times Now (8 October 2024). "Pundri Election Result , Haryana Pundri Assembly Election Result , Pundri Vidhan Sabha Result" (in ఇంగ్లీష్). Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.
  6. Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Pundri". Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.