దిలావర్ హుస్సేన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిలావర్ హుస్సేన్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ(1907-03-19)1907 మార్చి 19
లాహోర్, బ్రిటిషు భారతదేశం
మరణించిన తేదీ1967 ఆగస్టు 26(1967-08-26) (వయసు 60)
లాహోర్, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రWicketkeeper-బ్యాటరు
బంధువులుWaqar Ahmed (son)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 17)1934 జనవరి 5 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1936 ఆగస్టు 15 - ఇంగ్లాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు First-class
మ్యాచ్‌లు 3 57
చేసిన పరుగులు 254 2,394
బ్యాటింగు సగటు 42.33 28.16
100లు/50లు 0/3 4/13
అత్యధిక స్కోరు 59 122
వేసిన బంతులు 90
వికెట్లు 0
బౌలింగు సగటు
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు
క్యాచ్‌లు/స్టంపింగులు 6/1 69/33
మూలం: ESPNcricinfo, 2020 మే 15
Dilawar Hussain
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ(1907-03-19)1907 మార్చి 19
Lahore, British India
మరణించిన తేదీ1967 ఆగస్టు 26(1967-08-26) (వయసు 60)
Lahore, Pakistan
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రWicketkeeper-బ్యాటరు
బంధువులుWaqar Ahmed (son)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 17)1934 జనవరి 5 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1936 ఆగస్టు 15 - ఇంగ్లాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు First-class
మ్యాచ్‌లు 3 57
చేసిన పరుగులు 254 2,394
బ్యాటింగు సగటు 42.33 28.16
100లు/50లు 0/3 4/13
అత్యధిక స్కోరు 59 122
వేసిన బంతులు 90
వికెట్లు 0
బౌలింగు సగటు
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు
క్యాచ్‌లు/స్టంపింగులు 6/1 69/33
మూలం: ESPNcricinfo, 2020 మే 15

దిలావర్ హుస్సేన్ (1907 మార్చి 19 - 1967 ఆగస్టు 26) పాకిస్తానీ క్రికెట్‌ నిర్వాహకుడు, ఆటగాడు. అతను 1930లలో టెస్ట్ క్రికెటర్‌గా భారత క్రికెట్ జట్టుకు ఆడాడు. [1]

దిలావర్ మూడు టెస్టు మ్యాచ్‌ల్లో భారత్‌ తరఫున వికెట్‌ కీపరుగా ఆడాడు. అతని తొలి మ్యాచ్‌లో 1933-34లో కలకత్తాలో గ్రీన్ వికెట్‌పై ఇంగ్లాండ్‌పై ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. మోరిస్ నికోల్స్ వేసిన డెలివరీ తలకు తగిలి రిటైరయ్యాడు. తలకు కట్టు కట్టుకుని తిరిగి వచ్చాకా ఆడుతూండగా నోబీ క్లార్క్ వేసిన బంతితో బొటనవేలికి దెబ్బ తగిలింది. కానీ అతను అత్యధిక స్కోరు, 59 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 57 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ టాప్ స్కోర్ చేసిన అతికొద్ది మంది టెస్ట్ క్రికెటర్లలో అతనొకడు. ఫస్ట్-క్లాస్ కెరీర్‌లో తన మొదటి మ్యాచ్‌లో 64, 112 పరుగులు చేసాడు. అతని చివరి ప్రదర్శన 1936 భారత ఇంగ్లాండ్ పర్యటనలో జరిగింది; దిలావర్ ఆ సమయంలో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు.

భారత టెస్ట్ బ్యాట్స్‌మెన్ కోటా రామస్వామి దిలావర్‌ను కిందివిధంగా వర్ణించాడు:

అతను పొడవాటి, స్థూలకాయుడు,. పెద్ద పొట్టతో, టోపీ తలపాగా లేమీ లేకుండా గుడు చేయించుకుని ఉండేవాడు. చాలా వదులుగా ఉండే ప్యాంటు ధరించేవాడు. కాసేపు బ్యాటింగ్ చేసిన తర్వాత లేదా కొంత సేపు వికెట్ కీపింగ్ చేసిన తర్వాత అతని చొక్కా ప్యాంటులోంచి వేలాడుతూ ఉండేది. ఎవరైనా వచ్చి దానిని మళ్ళీ ప్యాంటు లోపలికి తోయాల్సి వచ్చేది. అతను బ్యాట్‌ను చాలా కిందికి పట్టుకుని, శరీరాన్ని ముందుకు వంచి వికెట్‌పై నిలబడే తీరు చిత్రంగా ఉండేది. దాంతో అతని తల వికెట్ల ఎత్తులో ఉండేది. ప్రక్క నుండి అతనిని చూసేవారికి అతని శరీరంలోని ప్రముఖమైన వెనుక నుండి (ఆన్ సైడు నుండి) చూసేవారికి అతని పృష్ట భాగం మాయ్త్రమే కనబడేది. తల, బ్యాటు కనబడేవి కావు. అయితే, అతని డిఫెన్సు చాలా బలంగా ఉండి, అతనిని అవుట్ చేయడం చాలా కష్టంగా ఉండేది. అతను నేను చూసిన అత్యంత స్వార్థపూరిత బ్యాట్స్‌మెన్. [2]

అతను కేంబ్రిడ్జ్‌లో చదువుతున్నప్పుడు 1925 నుండి 1941 వరకు, 1935, 1938 మధ్య కొద్ది గ్యాప్‌తో, భారతదేశంలో ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు.

రిచర్డ్ క్యాష్‌మన్, అతనికి ఎన్‌సైక్లోపెడిక్ మెమరీ ఉందని, క్రికెట్ స్కోర్ షీట్‌లను గుర్తుంచుకునేవాడనీ, "గొప్పగా తినేవాడు బాగా మాట్లాడేవాడు" అనీ కూడా వ్రాశాడు. "తత్వశాస్త్రంతో మ్నొదలుపెట్టి మంచికూర ఎలావండాలనే దాకా ఏ విషయంపైనైనా సరే అనర్గళంగా మాట్లాడి రంజింపజేసేవాడు" అని అన్నాడు. [3]

తరువాతి కాలంలో దిలావర్‌ను "ప్రొఫెసర్" అని పిలిచేవారు. అతను ఫిలాసఫీలో డాక్టరేట్ తీసుకున్నాడు, డబుల్ ఎంఏ డిగ్రీ లున్నాయి. అతను లండన్‌లోని ప్రభుత్వ కళాశాల, లాహోర్‌లోని ముస్లిం ఆంగ్లో-ఓరియంటల్ కాలేజీల్లో ప్రిన్సిపాల్‌గా పనిచేశాడు. అతను పాకిస్థాన్‌లో క్రికెట్ కంట్రోల్ బోర్డు వ్యవస్థాపక సభ్యుడు, సెలెక్టరు.

మూలాలు[మార్చు]

  1. "Dilawar Hussain". ESPN Cricinfo. Retrieved 15 May 2020.
  2. Quoted in Bose, Mihir, A History of Indian Cricket, Andre Deutsch, 1990
  3. Cashman, Richard, Patrons, Players and the Crowd: The Phenomenon of Indian Cricket, Orient Longman, 1979