దిలీప్ దోషి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దిలీప్ రసిక్‌లాల్ దోషి (జననం 1947 డిసెంబర్ 22) గుజరాతీ మూలానికి చెందిన మాజీ భారత క్రికెటర్ [1] అతను 1979 నుండి 1983 వరకు 33 టెస్టులు, 15 వన్డేల్లో ఆడాడు. 1947 డిసెంబర్ 22గుజరాత్ లోని రాజ్‌కోట్లో జన్మించాడు.

ముప్పై ఏళ్ళ వయస్సు దాటాక టెస్టులు ఆడడం మొదలు పెట్టడమే కాకుండా 100 కి పైగా వికెట్లు పడగొట్టిన నలుగురు టెస్ట్ బౌలర్లలో దోషి ఒకడు. మిగిలిన ముగ్గురు క్లారీ గ్రిమ్మెట్, సయీద్ అజ్మల్, ర్యాన్ హారిస్ . భారతీయులలో ఈ ఘనత సాధించిన మొదటి బౌలర్ ఇతడే. టెస్ట్ క్రికెట్ లో దిలీప్ మొత్తం 114 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒకే ఇన్నింగ్సులో 5 వికెట్లను 6 సార్లు సాధించాడు. అతని అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 102 పరుగులకు 6 వికెట్లు.

టెస్టు క్రికెట్[మార్చు]

దోషి తన 30 ఏళ్ళ వయసులో టెస్టుల్లో ఆడ్డం మొదలుపెట్టాడు (చెన్నైలో, ఆస్ట్రేలియాతో 11- 1979 సెప్టెంబరు 16). ఆలస్యంగా ఆడడం మొదలుపెట్టినా తన ఉనికిని చాటుకోవడంలో అతను సమయాన్ని వృథా చేయలేదు. 6/103 & 2/64 గణాంకాలతో అతను ఈ మ్యాచ్లో భారతదేశపు ఉత్తమ బౌలర్ అయ్యాడు. [2] అతను ఈ సిరీస్‌ అంతా మంచి ప్రదర్శన కొనసాగించాడు. బొంబాయిలో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్‌లో, 5/43 & 3/60 గణాంకాలతో భారతదేశానికి విజయం సాధించిన వీరులలో ఒకడు. 70,000 మంది ప్రేక్షకుల ముందు స్వస్థలమైన కలకత్తాలోని ఈడెన్ గార్డెన్‌లో (అతణ్ణి దత్తత తీసుకున్న నగరం) 4/92 తీసుకున్నప్పుడు అతనికి గొప్ప ఆనందం కలిగింది.

ఈ సిరీస్ తరువాత, భారత టెస్ట్ జట్టులో దోషి స్థానం స్థిరపడింది. దురదృష్టవశాత్తు, తరువాతి సంవత్సరాల్లో దోషి అంతర్జాతీయ స్థాయిలో రెగ్యులర్ మ్యాచ్ గెలిపించే బౌలరుగా ఎదగలేకపోయాడు. అతని బౌలింగు కచ్చితంగానూ, స్థిరం గానూ ఉంటుంది. కానీ కిల్లర్ ఇన్‌స్టింక్ట్ చూపించడంలో విఫలమయ్యాడు. ఆసీ సిరీస్ తరువాత అతని ఏకైక మ్యాచ్ విన్నింగ్ ప్రయత్నం - 1981-82లో ఇంగ్లాండ్‌తో బొంబాయిలోనే. ఆ తక్కువ స్కోరింగ్ మ్యాచ్‌లో అతని 5/39 భారత్ మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించడానికి సహాయపడింది. [3] 82–83 సీజన్‌లో మనీందర్ సింగ్ తెరమీదికి రావడంతో దోషి టెస్ట్ కెరీర్ ముగింపును వేగవంతమైంది.

ఇతర దేశాలతో కెరీర్ టెస్ట్ బౌలింగ్ ప్రదర్శనలు: [4][మార్చు]

ప్రతిపక్ష మ్యాచ్‌లు వికెట్లు సగటు ఉత్తమ ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు
ఆస్ట్రేలియా 9 38 28,15 6/103 2
ఇంగ్లాండ్ 10 36 27,55 6/102 2
న్యూజిలాండ్ 2 5 32,80 2/18 0
పాకిస్థాన్ 11 27 38,66 5/90 1
శ్రీలంక 1 8 29,00 5/85 1
మొత్తం 33 114 30,71 6/102 6

టెస్ట్ క్రికెట్ చరిత్రలో దోషి చెత్త బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా పరిగణించబడ్డాడు, అతడి బ్యాటింగ్ సగటు 4.60 మాత్రమే. కెరీర్‌లో అత్యధిక టెస్ట్ మ్యాచ్ ఇన్నింగ్స్‌;లో అట్టడుగున, 11 వ స్థానంలో, (38 ఇన్నింగ్స్‌లో) బ్యాటింగు చేసిన రికార్డు సృష్టించాడు దోషి . [5]

వన్డేల్లో[మార్చు]

1980–81 ఆస్ట్రేలియా పర్యటనలో దోషి వన్డేలో అడుగుపెట్టాడు. గబ్బా వద్ద, న్యూజీలాండ్‌కు కి వ్యతిరేకంగా, అతను తన ఉత్తమ గణాంకాలను 4/30 సాధించాడు. వన్డేల్లో అతని సగటు 23.81, ఆర్‌పిఓ (3.96) రెండూ ఆకట్టుకున్నాయి. కానీ, అతను ఫీల్డింగులో చురుగ్గా ఉండేవాడు కాదు. పైగా బ్యాటింగులో మరీ బలహీనం. అంచేత అతను భారతదేశం కోసం 15 వన్డేలు మాత్రమే ఆడాడు. 1983 ప్రపంచకప్పులో ఆయన బదులు ఆల్ రౌండర్ రవిశాస్త్రిని తీసుకున్నారు. [6]

మూలాలు[మార్చు]

  1. Sharma, Pranay (June 2, 2014). "Those Nights In Nairobi". Outlook India.
  2. "1st Test: India v Australia at Chennai, Sep 11–16, 1979". espncricinfo. Retrieved 2011-12-13.
  3. [1] Cricinfo Player Page Dilip Doshi (Retrieved on 2009-06-17)
  4. Cricinfo Player Page: Dilip Doshi (Retrieved on 2009-06-30)
  5. Walmsley, Keith (2003). Mosts Without in Test Cricket. Reading, England: Keith Walmsley Publishing Pty Ltd. p. 457. ISBN 0947540067.
  6. [2][dead link] Cricinfo Player Page Dilip Doshi (Retrieved on 2009-06-18)