Jump to content

దిలీప్ బోస్

వికీపీడియా నుండి

దిలీప్ బోస్
పూర్తి పేరుదిలీప్ కుమార్ బోస్
దేశం భారతదేశం
జననం1921
పాట్నా
మరణం30 డిసెంబరు 1996 (aged 74–75)
కోల్‌కతా
ఆడే విధానంకుడిచేతి వాటం
సింగిల్స్
గ్రాండ్ స్లామ్ సింగిల్స్ ఫలితాలు
వింబుల్డన్నాలుగో రౌండు (1948)
డబుల్స్
గ్రాండ్ స్లామ్ డబుల్స్ ఫలితాలు
వింబుల్డన్రెండో రౌండు (1947)
Grand Slam Mixed Doubles results
వింబుల్డన్మూడో రౌండు (1948)

దిలీప్ కుమార్ బోస్ (1921 - 1996 డిసెంబరు 30) భారతీయ ప్రొఫెషనల్ టెన్నిస్ ఆటగాడు. అతను ఆసియా ఛాంపియన్‌షిప్ విజేత, ఇండియా డేవిస్ కప్ జట్టు సభ్యుడు. ఆట నుండి విరమణ తర్వాత, అతను కోచ్‌గా, నిర్వాహకుడిగా పనిచేశాడు.[1][2] ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ 2002 లో అతని పేరు మీద జీవితకాల సాఫల్య పురస్కారాన్ని స్థాపించింది.[3]

1949లో కలకత్తాలోని కలకత్తా సౌత్ క్లబ్‌లో జరిగిన తొలి ఆసియా ఛాంపియన్‌షిప్‌లో బోస్ సింగిల్స్ పోటీని గెలుచుకున్నాడు.[4][5] ఫలితంగా, అతను 1950 లో వింబుల్డన్‌లో 15వ సీడ్ సాధించాడు.[6] రెండో రౌండు మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌కు చెందిన హాన్స్ వాన్ స్వోల్‌తో 6–4, 5–4 తో వెనకబడి ఉండగా, రిటైరై ఆ మ్యాచ్‌ను మధ్య లోనే వదులుకున్నాడు.[7][8] అంతకు కొద్ది రోజుల ముందే అతను మలేరియా నుండి కోలుకున్నాడు. ఆట ఆడవద్దని వైద్యులు సలహా కూడా ఇచ్చారు.[9] అదే సంవత్సరంలో, అతను బెర్లిన్ ఛాంపియన్‌షిప్‌లో ఆస్ట్రేలియాకు చెందిన బిల్ సిడ్‌వెల్‌తో కలిసి డబుల్స్ ఈవెంట్‌ను గెలుచుకున్నాడు.[10]

కెరీర్

[మార్చు]

1949 లో కలకత్తాలో జరిగిన ఆసియా మొదటి అంతర్జాతీయ లాన్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌ల ప్రారంభ ఎడిషన్‌లో బోస్ సింగిల్స్ ఈవెంట్‌ను గెలుచుకున్నాడు. ఆ సమయంలో భారతదేశపు నంబర్ వన్ ర్యాంక్ ఆటగాడు. 1950 జనవరి 1 న జరిగిన ఫైనల్‌లో స్వదేశీయుడు, దేశంలో రెండవ ర్యాంకరూ ఐన సుమంత్ మిశ్రాను 6–1, 6–2, 8–6 తో ఓడించాడు.[11]

మూలాలు

[మార్చు]
  1. "Dilip Bose dead". The Indian Express. 31 December 1996. Archived from the original on 23 April 1997. Retrieved 25 October 2018. {{cite news}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  2. Sabanayakan, S. (6 May 2006). "The man who serves". Sportstar. sportstarlive.com. Retrieved 25 October 2018.[permanent dead link]
  3. "Kawaljeet, Rama Rao get Dilip Bose award". The Hindu (in Indian English). 4 October 2011. Retrieved 25 October 2018.
  4. Majumdar, Boria; Mangan, J. A. (2013). Sport in South Asian Society: Past and Present (in ఇంగ్లీష్). Routledge. p. 122. ISBN 9781317998938. Retrieved 25 October 2018.
  5. Mellow, Melville De (1979). Reaching for Excellence: The Glory and Decay of Sport in India (in ఇంగ్లీష్). Kalyani Publishers. p. 102. Retrieved 25 October 2018.
  6. Menon, Mohandas (23 June 2001). "Indians at Wimbledon". Rediff. Retrieved 25 October 2018.
  7. "Bose Concedes Singles Match". The Indian Express. 28 June 1950.
  8. "Road to Wimbledon: An introduction to the Calcutta South Club". Wimbledon. wimbledon.com. 5 April 2016. Archived from the original on 25 October 2018. Retrieved 25 October 2018.
  9. "Dilip Bose Not At His Best". The Indian Express. 27 June 1950. p. 8.
  10. "Australians' Successes". 5 September 1950. Retrieved 25 October 2018.
  11. "Dilip Bose Wins First Asian Single Crown". The Indian Express. 3 January 1950. p. 7.