Jump to content

దివాన్ బహదూర్

వికీపీడియా నుండి
దివాన్ బహదూర్ బిరుదు పతకం జార్జ్ V పాలనలో ప్రదానం చేయబడింది

దివాన్ బహదూర్ బ్రిటిష్ భారతదేశంలో ప్రభుత్వం ఇచ్చిన గౌరవ బిరుదు. [1] [2] ఇది దేశానికి విశ్వాసపాత్రమైన సేవ లేదా ప్రజా సంక్షేమం చేసిన వ్యక్తులకు ప్రదానం చేసేవారు. 1911 నుండి ఈ బిరుదుతో పాటు ప్రత్యేక బిరుదు పతకం కూడా ఇచ్చేవారు. [3] దివాన్ అంటే ప్రధానమంత్రి అని, బహదూర్ అంటే ధైర్యవంతుడు అని అర్థం.

ఈ బిరుదు రావు బహదూర్ బిరుదు కంటే పై స్థాయిది. రావు బహదూర్ పొందిన వ్యక్తులు దివాన్ బహదూర్ పొందేందుకు అర్హులే. [4] [5]

సంస్థానాల ప్రధానమంత్రులను దివాన్ అని పిలిచేవారు. దివాన్‌గా నియమితులైనపుడూ, వారి స్థాయికి తగినట్లుగా, బ్రిటిష్ అధికారులు వారికి నేరుగా దివాన్ బహదూర్ బిరుదు ఇచ్చేవారు.

బ్రిటిష్ వారు ఏర్పరచిన ఇతర బిరుదులు, పురస్కారాలతో పాటు దివాన్ బహదూర్‌ను కూడా 1947 లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నిర్మూలించారు. [6]

దివాన్ బహదూర్ బిరుదు ఉన్న వ్యక్తుల జాబితా

[మార్చు]
  • గుత్తి కేశవపిళ్లె - పాత్రికేయుడు, రాజకీయవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు
  • ఆర్. రఘునాథ రావు - 1875 నుండి 1880 వరకు, మళ్ళీ 1886 నుండి 1888 వరకు ఇండోర్ సంస్థానపు దివాన్.
  • ఆర్. రామచంద్రరావు
  • ఎన్. పట్టాభిరామారావు
  • కె. రంగాచారి
  • ట్రావెన్‌కూరుకు చెందిన వి. నాగం అయ్య
  • IX పెరీరా
  • కెపి పుట్టన్న చెట్టి
  • DD థాకర్, ఝరియా [7]
  • కేటోలి చెంగప్ప, కొడగు చీఫ్ కమిషనర్ (కూర్గ్)
  • CS రత్నసభపతి ముదలియార్, CBE పారిశ్రామికవేత్త రాజకీయవేత్త.
  • మద్రాసు ఆర్. వెంకట రత్నం [8]
  • మద్రాసుకు చెందిన పిటి కుమారసామి చెట్టి
  • మద్రాసు టి. నంబెరుమాళ్ చెట్టి
  • మద్రాసు రెట్టమలై శ్రీనివాసన్
  • S. వెంకటరామదాస్ నాయుడు - 1899 నుండి 1909 వరకు పుదుక్కోటై రాష్ట్రానికి చెందిన దివాన్
  • లాడ్ గోవిందాస్ చతుర్భుజదాస్

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Iyengar, A. S. (2001). Role of Press and Indian Freedom Struggle: All Through the Gandhian Era By A. S. Iyengar. p. 280. ISBN 9788176482561.
  2. Sharma; Sharma, B. K. (2007). Introduction to the Constitution of India By Sharma, Sharma B.k. p. 83. ISBN 9788120332461.
  3. H. Taprell Dorling. (1956). Ribbons and Medals. A.H.Baldwin & Sons, London. p. 111.
  4. Iyengar, A. S. (2001). Role of Press and Indian Freedom Struggle: All Through the Gandhian Era By A. S. Iyengar. p. 280. ISBN 9788176482561.
  5. "as rewarded successively with the titles "Rai Sahab", "Rai Bahadur" and finally, towards the end of the Second World War, "Dewan Bahadur"". Archived from the original on 2015-02-19. Retrieved 2013-11-06.
  6. Sharma; Sharma, B. K. (2007). Introduction to the Constitution of India By Sharma, Sharma B.k. p. 83. ISBN 9788120332461.
  7. Proceedings of the Indian Science Congress, Volume 37
  8. The Message and Ministrations of Dewan Bahadur Sir R. Venkata Ratnam, Volume 3 by Sir R Venkata Ratnam, V. Ramakrishna Rao - 1924.

వెలుపలి లంకెలు

[మార్చు]