ది ఇండియన్ స్టోరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ది ఇండియన్ స్టోరి
ది ఇండియన్ స్టోరీ
దర్శకత్వంఆర్ రాజశేఖర్ రెడ్డి
నిర్మాతరాజ్ భీమ్ రెడ్డి
తారాగణంరాజ్ భీమ్ రెడ్డి, జరా ఖాన్, చమ్మక్ చంద్ర, ముక్తార్ ఖాన్, రామరాజు, సమీర్, సి.వి.ఎల్ నరసింహారావు , అనంత్
ఛాయాగ్రహణంనిమ్మల జైపాల్ రెడ్డి
కూర్పురామరాజు జానకిరామారావు
సంగీతంసందీప్ కనుగుల
నిర్మాణ
సంస్థ
ది భీమ్ రెడ్డి క్రియేషన్స్
పంపిణీదార్లువన్ మీడియా ఈటి ప్రైవేట్ లిమిటెడ్
విడుదల తేదీ
3 మే 2024 (2024-05-03)
సినిమా నిడివి
128 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్3 కోట్ల రూపాయలు

ది ఇండియన్ స్టోరి 2024లో విడుదలైన తెలుగు సినిమా. ది భీంరెడ్డి క్రియేషన్స్ బ్యానర్‌పై రాజ్ భీంరెడ్డి స్వయంగా నిర్మించి హీరోగా నటించారు. ఆర్.రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించగా రాజ్ భీంరెడ్డి, జారా ఖాన్ హీరో హీరోయిన్లుగా ముక్తార్ ఖాన్, చమ్మక్ చంద్ర, సమీర్, రామరాజు, CVL నరసింహా రావు, అనంత్, టార్జాన్ లాంటి నటులు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను ఏప్రిల్ 23, 2024 న విడుదల చేసి, సినిమాని మే 3న వన్ మీడియా ఈటి ప్రైవేట్ లిమిటెడ్ కంపనీ వారు థియేటర్స్ లో విడుదల చేసారు. [1][2][3]

రాష్ట్రంలో హిందూముస్లిం ల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. హిందూ వర్గానికి శ్రీరామ్ (రామరాజు), ముస్లిం వర్గానికి కబీర్ ఖాన్ (ముక్తార్ ఖాన్) నాయకత్వం వహిస్తుంటారు. ఒకరిపై మరొకరు ప్రతీకార దాడులు చేసుకుంటూ మత విద్వేషాలతో రగిలిపోతుంటారు. ఈ నేపథ్యంలో వైజాగ్ నుంచి రెహమాన్ (రాజ్ భీమ్ రెడ్డి) బంగారు బిస్కెట్లు అమ్మడానికి హైదరాబాద్ వస్తాడు. ఫేకు (చమ్మక్ చంద్ర) రెహమాన్ కి సాయం చేస్తుంటాడు. కబీర్ ఖాన్, శ్రీరామ్ క్యారెక్టర్స్ పరిచయంతో సినిమా మొదలవుతుంది. రెహమాన్ (హీరో రాజ్ భీమ్ రెడ్డి) వైజాగ్ నుంచి రావడం, అతను ఫ్రెండ్ ఫేకు (చమ్మక్ చంద్ర)ను కలవడం, వాళ్లిద్దరు బంగారు బిస్కెట్లను అమ్మేందుకు పడే పాట్లతో సరదాగా సినిమా టేకాఫ్ అవుతుంది. కబీర్ ఖాన్ ను హత్య నుంచి రెహమాన్ కాపాడటంతో సినిమాలో సీరియస్ నెస్ మొదలవుతుంది.

ఆస్పత్రిలో నర్సుతో చమ్మక్ చంద్ర చేసే కామెడీ, హీరోకు రాజ్ భీమ్ రెడ్డికి, చమ్మక్ చంద్రకు మధ్య వచ్చే సీన్స్ బాగా నవ్వించాయి. హీరో హీరోయిన్స్ మధ్య కూడా ఒక చిన్న ఎమోషనల్ లవ్ స్టోరీ చూపించారు. జర్నలిస్ట్ గా ఉన్న రాజ్ రెహమాన్ గా ఎందుకు మారాల్సి వచ్చింద‌నే విష‌యాన్ని డైరెక్ట‌ర్ ఆర్ రాజశేఖర్ రెడ్డి ఆసక్తికరంగా తెరకెక్కించాడు. ఒకవైపు కామెడీగా ఉంటూనే కథలో సీరియస్ నెస్ కంటిన్యూ అయ్యేలా చూసుకున్నాడు దర్శకుడు. మతం పేరుతో ప్రజలకు తప్పుడు సందేశం వెళ్లకుండా కేవలం తాము చెప్పదల్చుకున్న పాయింట్ ను ఈ సినిమాలో చూపించారు నిర్మాత రాజ్ భీమ్ రెడ్డి, దర్శకుడు. మతం పేరుతో మనను విడదీస్తున్న వారి కుట్రలను గమనించాంటూ మంచి సందేశాన్నిచ్చిందీ సినిమా. నాటకీయ పరిణామాల మధ్య కబీర్ ఖాన్ (ముక్తార్ ఖాన్) టీమ్ లోకి రెహమాన్ ఎలా వెళ్ళాడు ?, అసలు రెహమాన్ ఎవరు ?, అతని అసలు పేరు ఏమిటి ?, అతనికి శ్రీరామ్ వర్గానికి మధ్య సంబంధం ఏమిటి ?, ఈ మధ్యలో కబీర్ ఖాన్ మనిషి అయిన డాక్టర్ ఆయేషా (జరా ఖాన్)తో రెహమాన్ ప్రేమ ఎలా సాగింది ?, చివరికి ఈ కథ ఎలా ముగిసింది ? అనేది మిగిలిన కథ

నటీనటులు

[మార్చు]
  • రాజ్ భీమ్ రెడ్డి
  • జరా ఖాన్
  • చమ్మక్ చంద్ర
  • ముక్తార్ ఖాన్
  • రామరాజు
  • సమీర్
  • సీవీఎల్ నరసింహారావు
  • అనంత్

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: ది భీమ్ రెడ్డి క్రియేషన్స్
  • నిర్మాత: రాజ్ భీమ్ రెడ్డి
  • సహా నిర్మాత: కమలహాసన్ పాత్రుని
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆర్. రాజశేఖర్ రెడ్డి
  • సంగీతం: సందీప్ కనుగుల
  • సినిమాటోగ్రఫీ: నిమ్మల జైపాల్ రెడ్డి
  • ఎడిటర్: రామరాజు జానకిరామారావు
  • ఆర్ట్ డైరెక్టర్లు: మొహన్, వై. నాగేశ్వర రావు
  • DI : కలర్ లాజిక్స్ మీడియా వర్క్స్
  • ఆడియోగ్రఫీ : విష్ణువర్దన్ కాగిత
  • సౌండ్ డిజైన్ : వెంకటేష్ కిందిబావి
  • పబ్లిసిటీ డిజైనర్: శ్రీకాంత్ యర్రంశెట్టి
  • VFX : విరించి ప్రొడక్షన్స్, మ్యాజికల్ ఫ్రేమ్స్
  • స్టంట్స్ : శంకర్, ఆది
  • చీఫ్ కోడైరెక్టర్-అదనపు సన్నివేశాలు: ఆదిత్య భీంరెడ్డి
  • అసోసియేట్ డైరెక్టర-రచనా సహకారం: పుల్యాల సతీష్ రెడ్డి
  • అసిస్టెంట్ డైరెక్టర్/రచనా సహకారం-విప్లవ్ కాటం
  • కొరియోగ్రాఫర్: ఆనంద్ రాజ్ చిగిరి
  • 2nd యూనిట్ కెమెరామెన్: అనిల్ కుమార్
  • పాట కెమెరామెన్: షతీష్ రెడ్డి మాసం
  • డిస్ట్రిబ్యూటర్: వన్ మీడియా ఈటి ప్రైవేట్ లిమిటెడ్
  • పాటలు: కాసర్ల శ్యమ్

పాటలు

[మార్చు]

ఈ సినిమాలో ది ఇండియన్స్ ఆంథెమ్ “అడుగే సాగదూ” అంటూ ప్రారంభమయ్యే పాట సాహిత్యాన్ని కాసర్ల శ్యామ్ అందించగా, సంగీతాన్ని ప్రముఖ సంగీత దర్శకులు సురేష్ బొబ్బిలి అందించారు, ప్రముఖ గాయకుడు యాజిన్ నిజార్ పాడారు.

నిర్మాణం

[మార్చు]

ది ఇండియన్స్ స్టోరి సినిమాను “ది భీంరెడ్డి క్రియేషన్స్” బ్యానర్ పై రాజ్ భీంరెడ్డి నిర్మించి స్వయంగా నటించారు. ఈ నిర్మాణ సంస్థకు ఈ చిత్రం మొదటిది. ఇక ఇదే బ్యానర్ పై “హే పోయెట్”, నిజం లాంటి చిత్రాలను నిర్మిస్తున్నారు.

విడుదల - స్పందన

[మార్చు]

2024 మే 3 న థియేటర్లలో విడుదలైన ది ఇండియన్స్ స్టోరి సినిమా మంచి హిట్ గా నిలిచి రాజ్ భీంరెడ్డికి, రాజశేఖర్ రెడ్డికి, చిత్ర యూనిట్ కి మంచి పేరు తెచ్చింది. 3 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ చిత్రం మంచి సందేశాత్మక చిత్రమే కాక అన్ని హంగులున్న కమర్షియల్ సినిమాగా పేరు తెచ్చుకుని అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది[4][5][6][7]

మూలాలు

[మార్చు]
  1. "The Indian Story Movie Review in Telugu" (in అమెరికన్ ఇంగ్లీష్). 2024-05-07. Retrieved 2024-06-11.
  2. Telugu, ntv (2024-05-03). "The Indian Story Review: ది ఇండియన్ స్టోరి రివ్యూ". NTV Telugu. Retrieved 2024-06-11.
  3. "The Indian Story: మతం కంటే మనుషులే గొప్ప.. "ది ఇండియన్ స్టోరి" మెప్పించిందా..?". Zee News Telugu. 2024-05-03. Retrieved 2024-06-11.
  4. "'ది ఇండియన్ స్టోరీ' సినిమా రివ్యూ | Sakshi". www.sakshi.com. Retrieved 2024-06-11.
  5. "ది ఇండియన్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!". Filmy Focus. 2024-05-05. Retrieved 2024-06-11.
  6. Sistu, Suhas (2024-05-04). "'The Indian Story' review: Thought-provoking storytelling with impactful performances". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2024-06-11.
  7. డీవీ. "అందరూ సమానమే కాన్సెప్ట్ తో ది ఇండియన్ స్టోరి". telugu.webdunia.com. Retrieved 2024-06-11.

బయటి లింకులు

[మార్చు]