ది గ్రేట్ ట్రెయిన్ రాబరీ (1903 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ది గ్రేట్ ట్రెయిన్ రాబరీ
దోపిడీ నుండి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో తుపాకులతో కాలుస్తున్న బందిపోట్లు
దర్శకత్వంఎడ్విన్ ఎస్. పోర్టర్
స్క్రీన్ ప్లేఎడ్విన్ ఎస్. పోర్టర్
నిర్మాతఎడ్విన్ ఎస్. పోర్టర్
తారాగణంఆల్ఫ్రెడ్ సి. అబాడీ, బ్రోనోచా బిల్లీ ఆండర్సన్, జస్సస్ డి. బర్న్స్
ఛాయాగ్రహణంజాకబ్ బ్లెయిర్ స్మిత్, ఎడ్విన్ ఎస్. పోర్టర్
కూర్పుఎడ్విన్ ఎస్. పోర్టర్
పంపిణీదార్లువార్నర్ బ్రదర్స్ (ఎడిసన్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ), క్లీన్ ఆప్టికల్ కంపెనీ
విడుదల తేదీ
1903 డిసెంబరు 1 (1903-12-01)
సినిమా నిడివి
12 నిముషాలు (18 ఫ్రేమ్స్/సెకన్)
దేశంయునైటెడ్ స్టేట్స్
భాషమూకీ చిత్రం
బడ్జెట్$150[1]

ది గ్రేట్ ట్రెయిన్ రాబరీ 1903, డిసెంబర్ 1న విడుదలైన అమెరికా మూకీ లఘుచిత్రం. ఎడ్విన్ ఎస్. పోర్టర్ దర్శకత్వంలో ఆల్ఫ్రెడ్ సి. అబాడీ, బ్రోనోచా బిల్లీ ఆండర్సన్, జస్సస్ డి. బర్న్స్ తదితరులు నటించిన ఈ చిత్రం న్యూజెర్సీలోని మిల్టౌన్ లో చిత్రీకరించబడింది. 1896లో స్కాట్ మార్బుల్ రాసిన ది గ్రేట్ ట్రెయిన్ రాబరీ అనే నాటకం, 1900లో బుచ్ కాస్సిడీ ఆధ్వర్యంలో జరిగిన రైలు దోపిడీ ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది.[2][3]

కథ[మార్చు]

నీళ్ళకోసం ఆగిన రైలులోకి నలుగురు బందిపోట్లు చొరబడి, అందులోని ఒక ఉద్యోగిని చంపి ప్రయాణికుల వద్దనున్న సొమ్మును దోచుకొని గుర్రాలపై పారిపోతారు. అడవితో ఒకచోట చేరి సొమ్మను పంచుకుంటున్న సమయంలో టెలిఫోన్ ఆపరేటర్ కుమార్తె, మరికొంతమంది వచ్చి ఆ బందిపోట్లను చంపేస్తారు.

నటవర్గం[మార్చు]

 • అల్ఫ్రెడ్ సి. అబాడి
 • బ్రోనో బిల్ బిల్ ఆండర్సన్
 • జ్యూస్ డి. బర్న్స్
 • వాల్టర్ కామెరాన్
 • డోనాల్డ్ గల్లాహెర్
 • ఫ్రాంక్ హన్వే
 • ఆడమ్ చార్లెస్ హేమన్
 • టామ్ లండన్
 • జాన్ మనుస్ డౌగెర్టీ, సీనియర్
 • రాబర్ట్ మిలాస్చ్
 • మేరీ ముర్రే
 • మేరీ మంచు
 • జార్జ్ బర్న్స్
 • మోర్గాన్ జోన్స్
ది గ్రేట్ ట్రెయిన్ రాబరీ (1903), మొదటి పాశ్చాత్య చలనచిత్రం

సాంకేతికవర్గం[మార్చు]

 • స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వం: ఎడ్విన్ ఎస్. పోర్టర్
 • ఆధారం: స్కాట్ మార్బుల్ రాసిన "ది గ్రేట్ ట్రెయిన్ రాబరీ"
 • ఛాయాగ్రహణం: జాకబ్ బ్లెయిర్ స్మిత్, ఎడ్విన్ ఎస్. పోర్టర్
 • కూర్పు: ఎడ్విన్ ఎస్. పోర్టర్
 • పంపిణీదారు: వార్నర్ బ్రదర్స్ (ఎడిసన్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ), క్లీన్ ఆప్టికల్ కంపెనీ

చిత్ర విశేషాలు[మార్చు]

 1. వేరు వేరు రకాల షాట్స్ తో ఉన్న సినిమాకంటే ఒకే కథను వివిధ షాట్స్ తో చెప్పిన సినిమాకు ఎక్కువ ఆదరణ ఉంటుందని గ్రహించిన తొలి దర్శకుడు ఎడ్విన్ ఎస్. పోర్టర్.[4]
 2. ఒకే సన్నివేశంతో కూడిన చిత్రాలతో విసుగుచెందిన ప్రేక్షకులు థియేటర్ రావడం మానేసిన సమయంలో ఈ చిత్రం విడుదలై ప్రేక్షకులను మళ్ళీ థియేటర్ కు రప్పించింది.[5]
 3. న్యూయార్క్ కు కొన్ని మైళ్ళదూరంలో ఉన్న పాటర్ సన్ సమీపంలో అవుట్ డోర్ లో ఈ చిత్రం తీయబడింది.[5]
 4. చలనచిత్రరంగంలో మొదటి స్టార్ గా గుర్తింపుపొందిన యాండర్ సన్ అనే నటుడు ది గ్రేట్ ట్రెయిన్ రాబరీ చిత్రం విడుదలైన తరువాత వారానికి ఒక సినిమా చొప్పున ఏడెళ్ళపాటు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.[5]
 5. చలనచిత్రరంగంలో ది గ్రేట్ ట్రెయిన్ రాబరీ సినిమాతో కథాచిత్రాల యుగం ప్రారంభమై, స్క్రీన్ ప్లే పరంగా తరువాతికాలంలో వచ్చిన అనేక సినిమాలకు ఆధారమయింది.[6]
 6. ట్రిక్ షాట్స్, ఫేడౌట్స్, పారలెల్ రిలేషన్ షాట్స్, ఇంటర్ కట్స్, ప్రాపర్ స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ మొదలైనవన్ని ఈ చిత్రంతోనే ప్రారంభమయ్యాయి.[6]

మూలాలు[మార్చు]

 1. Souter, Gerry (2012). American Shooter: A Personal History of Gun Culture in the United States. Potomac Books, Inc. p. 254. ISBN 1-597-97690-3.
 2. p.39 Mayer, David Stagestruck Filmmaker: D. W. Griffith and the American Theatre University of Iowa Press 1 Mar 2009
 3. Kramer, Fritzi (3 November 2013). "The Great Train Robbery (1903) A Silent Film Review". moviessilently.com/. Retrieved 5 February 2019. they blow up the safe (with a pink and orange hand-colored explosion)
 4. పాలకోడేటి సత్యనారాయణరావు 2007, p. 5.
 5. 5.0 5.1 5.2 పాలకోడేటి సత్యనారాయణరావు 2007, p. 6.
 6. 6.0 6.1 పాలకోడేటి సత్యనారాయణరావు 2007, p. 7.

ఇతర లంకెలు[మార్చు]

ఆధార గ్రంథాలు[మార్చు]