ది ట్రాజికల్ హిస్టరీ ఆఫ్ డాక్టర్ ఫాస్టస్ (నాటకం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ది ట్రాజికల్ హిస్టరీ ఆఫ్ డాక్టర్ ఫాస్టస్

ది ట్రాజికల్ హిస్టరీ ఆఫ్ డాక్టర్ ఫాస్టస్ (The Tragical hisory of Dr.Faustus) అనేది ఆంగ్ల సాహిత్యంలో ఒక సుప్రసిద్ధమైన నాటకం. దీన్ని ఇంగ్లండుకు చెందిన క్రిస్టఫర్ మార్లో (Christopher Marlowe) (1564-1593) రచించాడు. దేవుడిని తెలుసుకోకుండా ఈ లోకపు ఆకర్షణలకు లోనై దుష్టశక్తులను ఆశ్రయించిన డాక్టర్ ఫాస్టస్ అనే జర్మన్ తత్వవేత్త ఎలా పతనమయ్యాడనేది ఈ నాటకం యొక్క ముఖ్య సారాంశం.

నాటక చరిత్ర[మార్చు]

క్రిష్టాఫర్ మార్లో ఈ నాటకాన్ని వ్రాయడానికి ఫాస్ట్ (Faust) అనే ఒక జర్మన్ పురాణ గాధను మూలముగా తీసుకొన్నాడు.

సారాంశము[మార్చు]

జర్మనీలోని విట్టెంబర్గ్ (Wittenberg) నగరంలో డాక్టర్ ఫాస్టస్ అను పండితుడు ప్రపంచంలోని సమస్త విషయాలు తెలుసుకోవడంలో మానవ విజ్ఞాన పరిధులు దాటిపోయినా సంతృప్తి చెందక మంత్ర విద్యలు నేర్చుకోవాలనుకుంటాడు. అంతలో క్రైస్తవ తత్వానికి, నాశన మార్గానికి సాదృశ్యములైన మంచి దేవత (Good Angel), దుష్ట దేవత (Bad Angel) ఫాస్టస్ వద్దకు వస్తాయి. మంచి దేవత మంత్ర విద్యలను వదిలివేయమని చెడు చేవత మత్ర విద్యలను నేర్చుకోమని చెబుతాయి. తోటి పండితులైన వాల్డెస్ (Waldes), కొర్నేలియస్ (Cornelius) వద్దనుండి ప్రాథమిక మంత్ర విద్యలు నేర్చుకొంటాడు. బైబిలులో సాతాను (Satan) సహచరుడైన మెఫిస్టోఫిలిస్ (Mephistophilis) అను దెయ్యాన్ని ఫాస్టస్ పిలుస్తాడు. వీరిద్దరి మధ్య ఒక ఒప్పందం జరుగుతుంది. ఆ ఒప్పందం ప్రకారం మెఫిస్టోఫిలిస్ ఫాస్టస్ కు సేవకుడిగా ఉండి 24 సంవత్సరాల సర్వాధికారం ఇస్తే, గడువు తర్వాత ఫాస్టస్ తన ఆత్మను మెఫిస్తోఫిలిస్ కు ఇచ్చేయాలి.

మెఫిస్టోఫిలిస్ ఇచ్చిన ఒప్పంద పత్రం పై ఫాస్టస్ తన రక్తంతో సంతకం చేస్తాడు. అంతే ఫాస్టస్ చేతులపై O man, fly అను పదాలు కనిపిస్తాయి. ఫాస్టస్ కు భయం పట్టుకోగా మెఫిస్టోఫిలిస్ ఇతర దెయ్యాలను నాట్యమాడించి ఫాస్టస్ దృష్టిని మళ్ళిస్తాడు. భార్య కావాలని ఫాస్టస్ అడుగగా మెఫిస్టోఫిలిస్ నిరాకరించి, అందుకు ప్రత్యామ్నాయంగా విజ్ఞాన సంబంధిత పుస్తకాలను ఇస్తాడు.

కొంత కాలం గడచిన తర్వాత ఒక దశలో ఫాస్టస్ ఎన్నో అద్భుతాలు చూసినప్పటికీ తనకు స్వర్గలోక ప్రవేశం లేదని అన్న మెఫిస్టోఫిలిస్ ను శపిస్తాడు. ఫాస్టస్ పెట్టే హింస భరించలేక మెఫిస్టోఫిలిస్ వెళ్ళిపోతాడు. మంచి దేవత, దుష్ట దేవత తిరిగి వస్తాయి. ఫాస్టస్ ను పశ్చాత్తాప పడమని మంచి దేవత చెప్పగా, అన్న మాటకు కట్టుబడియుండమని చెడు దేవత చెబుతుంది.. ఫాస్టస్ ను భయపెట్టడానికి లూసిఫర్ (సాతాను), బీల్జిబబ్ (Beelzebub), మెఫిస్టోఫిలిస్ తిరిగి వస్తారు. భయపడిపోయిన ఫాస్టస్ దేవుడి గురించి ఆలోచించడానికి వీలు లేకుండా వారితో మాట్లానికి ఒప్పుకుంటాడు. ఫాస్టస్ కు నరకం చూపిస్తానని లూసిఫర్ మాట ఇస్తాడు.

ఫాస్టస్ డ్రాగన్లచే లాగబడే రథం పై సమస్త ప్రదేశాలకు పర్యటించి సెయింట్ పీటర్ (St. Peter) గౌరవ విందు కార్యక్రమం జరుగుతున్న రోమ్ (Rome) నగరానికి ప్రయాణిస్తాడు. ఫాస్టస్, మెఫిస్టోఫిలిస్ అక్కడ ఎన్నో కనికట్టులు ప్రయోగించి అక్కడి నుండి ప్రయాణిస్తారు.. ఈలోగా రాబిన్ అనే కామెడీ పాత్రగాడు వాల్డెస్ నుండి కొన్ని మాయలు నేర్చుకుంటాడు.. నాల్గవ చార్లెస్ కోర్టులో ఫాస్టస్ తన కనికట్టులతో రాజుని రంజింపచేస్తాడు. ఫాస్టస్ తన కనికట్టు విద్యలతో అందరినీ అవమానింపజేస్తాడు. ఇతడి బాధితులైన రాబిన్, ఇతరులు న్యాయం కోసం వాన్ హోల్ట్ నగర ప్రభువుకు, అతని భార్యకు మొరపెట్టుకుంటారు. . కనికట్టు విద్యలతో ఫాస్టస్ ద్రాక్ష పండ్లు కాయని కాలంలో దక్షిణ ధృవానికి వెళ్ళి గర్భవతి అయిన ప్రభువు భార్యకు ద్రాక్ష పళ్ళు తీసుకొచ్చి అందరినీ ఆశ్చర్యపరుస్తాడు. చార్లెస్ కోరిక మేరకు గ్రీకు వీరుడైన అలెగ్జాండర్ (Alexander), అతని ప్రేయసి ఆత్మలను లేపి ప్రదర్శిస్తాడు.

ఫాస్టస్ యొక్క 24 సంవత్సరాలు గడచిపోతూవుంటాయి. ఫాస్టస్ ఇక మరణానికి సిద్ధమవుతున్నాడని వాగ్నర్ ప్రేక్షకులకు తెలియజేస్తాడు. ఫాస్టస్ తన చివరి రోజులు ఇతర విద్యార్దులతో తినుచూ త్రాగుచూ గడపడం మొదలుపెడతాడు. ట్రోజాన్ (Trojan) యుద్ధం జరుగడానికి కారణమైన హెలెన్ (Helen) అను అందమైన అమ్మాయి యొక్క ఆత్మను మెఫిస్టోఫిలిస్ లేపుతాడు. ఆమె అందాన్ని చూసి ఫాస్టస్ ముగ్ధుడై :

ఈ మొఖమేనా వెయ్యి ఓడలను దింపినది ,
ఇలియం నగర ఆకాశ హర్మ్యాలను కాల్చివేసినది ?
ప్రియమైన హెలెన్, ఒక్క ముద్దుతో నన్ను అమరుడిగా చేయుము.
ఆమె పెదవులు నా ఆత్మను జుర్రగా; అది ఎక్కడికి ఎగిరిపోవుచున్నదో !
రా హెలెన్, రా, నా ఆత్మను నాకు తిరిగివ్వు.
ఈమె పెదవుల్లోనే స్వర్గమున్నది గనుక నేను ఇక్కడే ఉండును.
హెలెన్ కానిది ఏదైనా సమస్తమునూ వ్యర్ధమే !

అని అంటాడు. ఈ సుప్రసిద్ధమైన మాటలు ఆంగ్లములో ఇలా వున్నవి:

Was this the face that launched a thousand ships,
And burnt the topless towers of Ilium?
Sweet Helen, make me immortal with a kiss.
Her lips suck forth my soul; see where it flies!
Come, Helen, come, give me my soul again.
Here will I dwell, for heaven be in these lips,
And all is dross that is not Helen.

సమయం సమీపిస్తుండగా మెఫిస్టోఫిలిస్ ఫాస్టస్ ను దూషిస్తూవుంటాడు. ఫాస్టస్ కూడా తన పతనానికి మెఫిస్టోఫిలిస్ ను దూషిస్తూవుంటాడు. మంచి దేవత ఫాస్టస్ ను వదిలేస్తుంది. నరక లోకపు ద్వారాలు తెరచుకుంటాయి. దుష్ట దేవత నరకలోకపు శిక్షలను ప్రస్తావిస్తూ ఫాస్టస్ ను దూషిస్తూవుంటుంది. గడియారము పదకొండవ ఘడియ కొట్టగా ఫాస్టస్ తాను ఎంచుకొన్న మార్గాన్ని గురించి పశ్చాతాప పడతాడు, ఒక్క ఏసు క్రీస్తు రక్తపు చుక్క తనను కాపాడేది అని గ్రహిస్తాడు . అర్ధరాత్రి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి. తనను క్షమించమని దేవుడిని, దెయ్యాలను వేడుకొంటాడు. దెయ్యాలు ఫాస్టస్ ను తీసుకుపోతాయి. తరువాత ఫాస్టస్ మిత్రులు ఫాస్టస్ శరీరం ముక్కలైపోవడం చూస్తారు. ఫాస్టస్ వెళ్ళిపోయాడని, అతని గొప్ప సామర్ధ్యం వ్యర్ధమైందని పల్లవి వినబడుతుంది. ఫాస్టస్ పతనాన్ని, అతనికి జరిగిన గుణపాఠాన్ని గుర్తుంచుకోమని ప్రేక్షకులకు పల్లవి చెబుతుంది.

బైబిలుతో గల సంబంధము[మార్చు]

క్రిస్టాఫర్ మార్లో రచించిన ఈ నాటకము క్రైస్తవ్యాన్ని బోధించే విధంగా ఉంటుంది. ఒక వ్యక్తి మంచి మార్గాన్ని ఎంచుకోకుండా చెడ్డ మార్గాన్ని ఎంచుకుంటే ఆ వ్యక్తి యొక్క పతనము ఎలా ఉంటుందనేది ఈ నాటకం ఒక చక్కటి ఉదాహరణ. బైబిల్ గ్రంథము (మత్తయి 7:13-14) ఇరుకు ద్వారమున ప్రవేశించండి; నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైయున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది అని ప్రభోధిస్తున్నది.

లంకెలు[మార్చు]