Jump to content

ది ఫ్యామిలీ మాన్ సినిమా

వికీపీడియా నుండి

ఫామిలిమాన్ హాలీవుడ్ రొమాంటిక్, హాస్యరస చిత్రం(2000). ఆ యువకుడు MBA చదవడానికి పేరిస్ వెళ్తూంటాడు. ఎయిర్ పోర్ట్ లో అతని ప్రియురాలు వెళ్ళొద్దని కాళ్ళావేళ్ళా పడుతుంది. "ఎడబాటు ఎంతకాలం ఏడాది ఇట్టే గడిచిపోతుంది" అతను ఓదార్చుతాడు. ఉన్నతవిద్య పూర్తి చేసుకొని న్యూయార్క్.లో పేద్దకంపెనీలో ఫైనాన్షియల్ అడ్వైజర్ వుద్యోగం, భోగభాగ్యాలు, రికామీగా జీవితం గడుపుతూంటాడు. వ్యాపారం, ఉద్యోగం, పదవులకోసం అతడు వివాహ జీవితాని తృణీకరించిన వ్యక్తి. క్రిస్మస్ ముందురోజు పొద్దుపోయినతర్వాత కేక్ కొనడానికి షాప్.కి వెళ్తాడు. అక్కడ ఒక ఆఫ్రో అమెరికన్ (నల్లవాడు)తనవద్ద వున్న లాటరీ టికెట్ తీసుకొని క్రిస్మస్ కేక్ యివ్వమని షాపు వాళ్ళను ప్రాధేయపడుతూంటాడు. షాపువాళ్ళు హీనంగా చూస్తూ అతణ్ణి వెళ్ళమంటారు. ఆవ్యక్తి ఆకస్మికంగా పిస్టల్ తీసి అందర్నీ కాల్చివేస్తానని వెర్రిగా కేకలు వేస్తాడు. మన ముఖ్యపాత్ర అతణ్ణి శాంతింపజేసి, టికెట్ తీసుకొని అతని చేతిలో 200 డాలర్లు పెట్టి అతని మంచి చెడ్డలు విచారించి పంపించేస్తాడు. ఆరాత్రి నిద్రపోతాడు ప్రశాంతంగా. తెల్లవారి ఉదయం యథాప్రకారం ఆఫీసుకు వెళ్తాడు. విచిత్రంగా ఆఫీసులో అతణ్ణి ఎవరూ గుర్తుపట్టి పలకరించరు. ఎవరో అతణ్ణి ఇల్లు చేరుస్తారు. తనయింట్లో తనను ప్రేమించిన యువతి పిల్లలతో కన్పిస్తుంది. ఆమె తనభార్య. భర్తగా టైర్లు అమ్మేషాపులో తను ఒక చిరుద్యోగి. తను ఆమెభర్తనుకాదనీ తెలుసు. ఏదోవిచిత్రమైన అనుభవం. ఆపరిస్థితితో సమాధానపడతాడు. సంసారజీవితంలో మాధుర్యం అనుభవానికి వస్తుంది. అంతా స్వప్నానుభూతే. కలకరిగిపోతుంది. ఆ క్రిస్మస్ ముందు రోజు ఓ అజ్ఞాతవ్యక్తి నుంచి మిస్డ్ కాల్ వచ్చింది. ఆరాతీసి ఆవ్యక్తి ఎవరో కనుగొంటాడు. ఆమె తన పూర్వపు ప్రియురాలే. ఒక స్వచ్ఛందసంస్థ తరఫున పేరిస్ వెళ్తూవుంటుంది. చివరకు విమానాశ్రయంలో కలుసుకుని తన ప్రేమను వ్యక్తం చేస్తాడు. కథసుఖాంతం. ఒకేజన్మలో రెండు జన్మల అనుభవాలు. సోషియో ఫేంటసీ. భారతీయసాహిత్యంలో ఇటువంటి గాథలు చాలావున్నాయి. నా‌రదసంసారం. క్రిస్మస్ కేకు సంఘటన ప్రథాన పాత్రలో వచ్చిన మానసికపరిణతిని సూచిస్తుంది. ఆ ఆఫ్రోఅమెరికన్ ఒక క్రిస్మస్ కేక్ కోసం అంత తెగబడడంలో కుటుంబంకోసం అతనుపడుతున్న తపనను గ్రహిస్తాడు. స్వప్నంలోజీ వనమాధుర్యం రుచి తెలుస్తుంది. సినిమా చాలా సెన్సిబుల్ గాఉంది. మూలాలు: The Family Man,2000 నాటి సినిమా, ప్రధాన పాత్రధారులు: Nicolas Cage,Tea Leoni etc.