దీపన్నిత శర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దీపన్నిత శర్మ
ది మనీష్ మల్హోత్రా - లీలావతి హాస్పిటల్ వారి 'సేవ్ అండ్ ఎంపవర్ ది గర్ల్ చైల్డ్' షోలో శర్మ
జననం (1979-11-02) 1979 నవంబరు 2 (వయసు 44)
దులియాజన్, అస్సాం, భారతదేశం
విద్యాసంస్థఇంద్రప్రస్థ మహిళా కళాశాల
వృత్తిమోడల్, నటి
క్రియాశీల సంవత్సరాలు2002–ప్రస్తుతం
ఎత్తు5 అడుగుల 9 అంగుళాలు[1]
జీవిత భాగస్వామిదిల్షేర్ సింగ్ అత్వాల్‌ (వి. 2008)
బంధువులుఅరుణిమా శర్మ (చెల్లులు)

దీపన్నిత శర్మ, అస్సాం రాష్ట్రానికి చెందిన నటి, మోడల్.

జననం, విద్య

[మార్చు]

దీపన్నిత 1979 నవంబరు 2న అస్సాం రాష్ట్రంలోని దులియాజన్ పట్టణంలోని ఆయిల్ ఇండియా లిమిటెడ్ కాలనీలో జన్మించింది. తండ్రి వృత్తిరిత్యా వైద్యుడు. తొమ్మిదో తరగతి వరకు గౌహతిలోని హోలీ చైల్డ్ స్కూల్‌లో చదువుకున్న దీపన్నిత, నహర్‌కటియాలోని సెయింట్ మేరీస్ స్కూల్ నుండి తన పాఠశాల విద్యను పూర్తిచేసింది. తర్వాత ఢిల్లీలోని ఇంద్రప్రస్థ మహిళా కళాశాలలో చరిత్రలో పట్టభద్రురాలైంది.[2][3]

కళారంగం

[మార్చు]

1998లో జరిగిన మిస్ ఇండియా పోటీలో చివరి ఐదుగురిలో ఒకరిగా ఎంపికైన తర్వాత దీపన్నితకు గుర్తింపు వచ్చింది. అదే పోటీలో 'మిస్ ఫోటోజెనిక్' టైటిల్‌ను కూడా గెలుచుకుంది. దేశంలోని ప్రముఖ డిజైనర్ల కోసం, భారతదేశంలోని వాలెంటినో & ఫెండి వంటి అంతర్జాతీయ డిజైన్ హౌస్‌ల కోసం ర్యాంప్ వాక్ చేసింది. బ్రెగ్యుట్ వాచీలు, ఆభరణాలు, గార్నియర్, నివియా, డెట్టాల్ సబ్బు వంటి అనేక బ్రాండ్‌ల ప్రకటనలలో నటించింది. ఎంటివిలో వచ్చిన ఫ్యాషన్ ఆధారిత షోలో న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరించింది. 2002లో వచ్చిన బాలీవుడ్ సినిమా 16 డిసెంబరుతో సినిమారంగంలోకి ప్రవేశించింది. అంతకుముందు లైఫ్ నహీ హై లడ్డూ అనే షోలో ప్రధాన పాత్రలో కూడా నటించింది.[4]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

దిపన్నితకు ఢిల్లీ వ్యాపారవేత్త దిల్షేర్ సింగ్ అత్వాల్‌తో వివాహం జరిగింది. అతని కుటుంబం మైనింగ్‌ వ్యాపారంలో ఉంది.[5] దీపన్నిత చెల్లెలు అరుణిమా శర్మ టెలివిజన్ నటిగా, కసమ్ సే అనే సీరియల్ లో రానో పాత్రకు బాగా పేరు తెచ్చుకుంది.[6]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర ఇతర వివరాలు
2002 16 డిసెంబర్ షీబా జీ సినీ అవార్డ్స్, ఉత్తమ డెబ్యూ ఫిమేల్ కోసం స్టార్ స్క్రీన్ అవార్డులకు నామినేట్ చేయబడింది
దిల్ విల్ ప్యార్ వ్యార్ పాయల్ సింగ్
2004 అసంభవ్ కింజల్
2005 మై బ్రదర్ నిఖిల్ లీనా గోమ్స్
కోయి ఆప్ సా ప్రీతి
99.9 ఎఫ్ఎం సోనాలి
2011 లేడీస్ వర్సెస్ రికీ బహ్ల్ రైనా పరులేకర్ జీ సినీ అవార్డ్స్ 2012 ఉత్తమ సహాయ నటికి నామినేట్ చేయబడింది
2012 జోడి బ్రేకర్స్ మ్యాగీ
2014 పిజ్జా
2015 టేక్ ఇట్ ఈజీ రామ
2017 డితో కాఫీ నేహా
2017 ఝోఇక్సోబోట్ ధేమలైట్ మొదటి అస్సామీ చిత్రం
2019 వార్ డా. మల్లికా సింఘాల్
2020 పెప్పర్ చికెన్ RJ వైదేహి
2021 రాత్ బాకీ హై వాణి చోప్రా ZEE5 చిత్రం

టెలివిజన్ కార్యక్రమాలు

[మార్చు]
సీరియల్ ఛానల్
హర్ దిల్ జో లవ్ కరేగా జూమ్
విల్స్ లైఫ్‌స్టైల్ ఇండియా ఫ్యాషన్ వీక్ స్టార్ వరల్డ్
ఫియర్ ఫాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడి 1 కలర్స్ టీవీ
ఎంటివి మేకింగ్ ది కట్ ఎంటివి ఇండియా
పియా కే ఘర్ జానా హై ఆరీ డిజిటల్
అన్ ట్యాగ్ వూట్
బేవఫా సిఐ వఫా ఏఎల్టి బాలాజీ

మ్యూజిక్ వీడియోలు

[మార్చు]
పేరు సంవత్సరం ప్రదర్శకులు(లు) ఆల్బమ్
హై రే హై మేరా ఘుంగ్తా (రీమిక్స్) 2004 సంగీతం- లెస్లే లూయిస్, ఇంద్రజిత్ నట్టోజీ దర్శకత్వం వహించిన వీడియో కలోనియల్ కజిన్స్

మూలాలు

[మార్చు]
  1. "Bollywwod Actress Dipannita Sharma Biography Archives". Archived from the original on 17 January 2019. Retrieved 2022-02-23.
  2. "Personal Agenda: Dipannita Sharma". Hindustan Times. February 24, 2012. Archived from the original on 17 May 2014. Retrieved 23 ఫిబ్రవరి 2022. {{cite news}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  3. "Catching Up With Dazzling Dipannita Sharma". Archived from the original on 29 May 2014. Retrieved 23 ఫిబ్రవరి 2022. {{cite news}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  4. "Dipannita Sharma 'almost fractured' shoulder while filming 'Pizza'". Daily News and Analysis. 4 July 2014. Archived from the original on 12 October 2014. Retrieved 2022-02-23.
  5. Soumyadipta Banerjee (11 February 2011). "There's no three-year itch: Dipannita Sharma". DNA. Archived from the original on 3 October 2012. Retrieved 2022-02-23.
  6. "Did you know that Arunima Sharma is the sister of a famous actress?". www.tellychakkar.com. Archived from the original on 24 September 2015. Retrieved 2022-02-23.

బయటి లింకులు

[మార్చు]