దీపాంకర్ ఛటర్జీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దీపాంకర్ ఛటర్జీ
Dipankarchatterji1.jpg
జననం (1951-04-21) 1951 ఏప్రిల్ 21 (వయస్సు: 69  సంవత్సరాలు)
పశ్చిమ బెంగాల్, భారతదేశం
వృత్తిమాలిక్యులర్ బయాలజిస్ట్.
క్రియాశీలక సంవత్సరాలుSince 1973
పురస్కారాలుపద్మశ్రీ
శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు
మిలీనియం బంగారు పతకం
రాన్‌బాక్సీ రీసెర్చ్ అవార్డు
ఐ. ఐ. ఎస్సీ పూర్వ విద్యార్థి అవార్డు
వెబ్ సైటుhttp://mbu.iisc.ac.in/~dclab/

దీపాంకర్ ఛటర్జీ (జననం: ఏప్రిల్ 21, 1951) ఈయన భారతీయ మాలిక్యులర్ బయాలజిస్ట్. ఈయన సైన్స్, ఇంజనీరింగ్ విభాగంలో చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం 2016 లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.[1]

తొలినాళ్ళ జీవితం[మార్చు]

ఈయన ఏప్రిల్ 21, 1951పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జన్మించాడు. ఈయన కోల్‌కతాలోని జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్, మాస్టర్స్ డిగ్రీ విద్యను పూర్తిచేశాడు. 1973 లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుండి మాలిక్యులర్ బయాలజీలో పి.హెచ్.డి పట్టాను పొందాడు. 1978 లో హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ యొక్క ఫ్యాకల్టీ సభ్యుడిగా తన వృత్తిని ప్రారంభించాడు. ఈయన బ్యాక్టీరియా ట్రాన్స్క్రిప్షన్ మెకానిజం, జన్యు వ్యక్తీకరణకు సంబంధించి ఎస్చెరిచియా కోలి, మైకోబాక్టీరియం క్షయ, ఒమేగా కారకం వంటి బ్యాక్టీరియాపై పరిశోధన చేశాడు. కోల్‌కతాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లో అనుబంధ ప్రొఫెసర్ గా పనిచేశాడు. మాలిక్యులర్ బయోఫిజిక్స్ యూనిట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో మల్టీడిసిప్లినరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో గౌరవ ప్రొఫెసర్ గా పనిచేశాడు. ఈయన బ్యాక్టీరియా లిప్యంతరీకరణపై మార్గదర్శక పరిశోధనలను చేసాడు.

పురస్కారాలు, గుర్తింపులు[మార్చు]

ఈయన ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (1994), ది వరల్డ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ (1997), నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇండియా ( 1989) లో ఫెల్లో గా పనిచేశాడు.[2] 1992 లో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ నుండి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాలలో అత్యున్నత భారతీయ అవార్డు అయిన శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారాన్ని అందుకున్నాడు. ఈయనకు మిలీనియం గోల్డ్ మెడల్ (2000), రాన్బాక్సీ రీసెర్చ్ పురస్కారం (2001) అందుకున్నాడు. 2016 లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది..[3]

మూలాలు[మార్చు]

  1. "Prof. Chatterji's Lab". MBU - IISc. 2016. Retrieved December 23, 2019.
  2. "NASI Fellow". National Academy of Sciences, India. 2016. Archived from the original on March 15, 2016. Retrieved December 24, 2019.
  3. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2016. Archived from the original (PDF) on 3 August 2017. Retrieved December 24, 2019.