Jump to content

దుర్భా సుబ్రహ్మణ్యశర్మ

వికీపీడియా నుండి
దుర్భా సుబ్రహ్మణ్యశర్మ

దుర్భా సుబ్రహ్మణ్యశర్మ నెల్లూరుకు చెందిన పండితుడు. ఇతడు 1875, అక్టోబరు 1న జన్మించాడు. నెల్లూరులోని అటవీ శాఖలో పనిచేసి, వి.ఆర్.కాలేజీలో ప్రధానాంధ్ర పండితుడిగా పనిచేశాడు. 1920 లో వి.ఆర్.కాలేజీ నెలకొల్పిన పిమ్మట ఇతను అందులో తెలుగు అధ్యాపకుడుగా పనిచేశాడు. ఇతని శిష్యులలో వేపకొమ్మ ఆదిశేషయ్య, చలినురుగు కామయ్య, కొలకుల నారాయణరావు, దుర్భా రామమూర్తి, భట్టారం మల్లికార్జున, షేక్ దావూద్ మొదలైనవారు ఎన్నదగినవారు. నెల్లూరులో ఇతను వేదం వెంకటరాయశాస్త్రి వ్యతిరేక పండిత వర్గానికి నాయకుడు. ఇతని కుమారుడు దుర్భా రామమూర్తి తండిగారి అయిదు కావ్యాలను కావ్యపంచమి పేరుతో పునర్ముద్రణ చేయించాడు.

రచనలు

[మార్చు]

ఇతడు దాదాపు 25 కావ్యాలను ఆంధ్రీకరించాడు.

  1. లక్ష్మీ శృంగార కుసుమమంజరి (అనువాదం)
  2. అభినవ సుమతి శతకము
  3. సౌందర్యలహరి (అనువాదం)
  4. భరతుడు
  5. శంకరాచార్య చరిత్రము[1]
  6. ఆంధ్ర అభిజ్ఞానశాకుంతలము[2]
  7. దీనచింతామణి
  8. వివేకచూడామణి (అనువాదం)
  9. సుమనస్మృతి
  10. విశ్వామిత్రుని చరిత్ర
  11. శంకరార్య చరిత్ర

బిరుదములు

[మార్చు]
  1. మహోపాధ్యాయ
  2. సాహిత్యస్థాపక
  3. అభినవ తిక్కన

మూలాలు

[మార్చు]

జమీన్ రయతు పత్రిక సంపుటాలు.