దువ్వూరి లలితాంబ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దువ్వూరి లలితాంబ భారత స్వాతంత్ర్యసమరయోధురాలు.[1]

జీవిత విశేషాలు[మార్చు]

దువ్వూరి లలితాంబ 1914 మే 14న వేపా రామేశం, లక్ష్మీనరసమ్మ దంపతులకు జన్మించింది. ఆమె తండ్రి వేపా రామేశం మద్రాస్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి గా ఉండేవాడు. ఆమె వాయులీన విద్వాంసురాలు, రంగస్థల కళాకారిణి, క్రీడాకారిణి, వక్త. ఆమె భర్త దువ్వూరి వెంకటరామమూర్తి ల్యూమెన్ ఎలక్ట్రికల్స్ వ్యవస్థాపకుడు. ఆమె ఎ.ఎన్.ఆర్ మహిళా భవన్ అధ్యక్షురాలిగా ఉన్న కాలంలో మహిళా సాధికారికత కోసం పనిచేసింది. దీని కోసం వివిధ కార్యక్రమాలను నిర్వహించింది. ఆమె మహిళల కోసం కుటీర పరిశ్రమలను ప్రారంభించింది. ఆమె స్వాతంత్ర్య సమరయోధురాలైన దుర్గాబాయి దేశ్‌ముఖ్ సహాయంతో నిరాశ్రయులైన మహిళల కోసం ఒక ఆశ్రమ పాఠశాలను కూడా నడిపింది. ఆమె ఆంధ్ర మహిళా సభ కు అనుబంధంగా జరిగిన కార్యక్రమాలలో పాల్గొనేది. ఆమె వివిధ సందర్భాల్లో వరద బాధితుల కోసం నిధులు సేకరించి సహాయం చేసింది. [2] ఆమె 1940.50లలో విశాఖపట్నం లేడీస్ క్లబ్ కు అధ్యక్షురాలిగా కూడా ఉంది. ఆమె కుమారుడు డి.ఎన్.సిన్హా క్రికెట్ క్రీడా పోషకుడు.[3]

భారత స్వాతంత్ర్య ఉద్యమం, జపనీయులు వైజాగ్‌పై బాంబు దాడి , 1971 లో నగరం తీరంలో పి ఎన్ఎ స్ ఘాజీని మునిగిపోవడం వంటి దాదాపు అన్ని చారిత్రక సంఘటనలకు లలితంబ సాక్ష్యమిచ్చింది.[4]

మరణం[మార్చు]

ఆమె 2016 మే 8న తన 104 ఏళ్ళ వయస్సులో మరణించింది. ఆమె చివరి కోరిక ప్రకారం పార్థివ శరీరాన్ని ఆంధ్ర మెడికల్ కళాశాలకు అందజేసారు. ఆమె కళ్ళను విశాఖపట్నంలోని మోహిసిన్ ఐ బ్యాంకుకు అందజేసారు.

మూలాలు[మార్చు]

  1. Devalla, Rani (2015-02-26). "A multi-faceted centenarian". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-05-30.
  2. "104-year-old's body donated". Deccan Chronicle (in ఇంగ్లీష్). 2016-03-13. Retrieved 2020-05-30.
  3. Mar 13, TNN |; 2016; Ist, 12:42. "The grand dame of Vizag no more | Visakhapatnam News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-05-30. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
  4. "Andhra Pradesh First » Inspiration /Positive News and Features" (in ఇంగ్లీష్). Retrieved 2020-05-31.