వేపా రామేశం
వేపా రామేశం (1875-1958 ) రచయిత, మద్రాసు హైకోర్టు మద్రాస్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా 1920 నుండి 1935 వరకు పనిచేసాడు.[1][2]
జీవిత విశేషాలు
[మార్చు]వేపా రామేశం 1875లో జన్మించాడు.[3] 12 సంవత్సరాల వయసులో మెట్రిక్యులేషన్ చేసాడు. 17, 20 సంవత్సరాల వయసులో ఆర్ట్స్, న్యాయశాస్త్రంలో పట్టబద్రుడయ్యాడు. అతను విశాఖపట్నంలోని ఎ.వి.ఎన్ కళాశాల పూర్వ విద్యార్థి.[4] అన్నింటా ప్రథమస్థానంలో నిలిచేవాడు. మొదట గ్రామీణ జిల్లాల్లో, తరువాత మద్రాసులో దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు న్యాయస్థానాల వద్ద బిజీగా ఉన్నాడు. అతను కష్టపడి పనిచేసే అభ్యాసకుడు. న్యాయమైన, మానవత్వం కలిగిన, వివేకవంతుడైన న్యాయమూర్తిగా అతను పదిహేను సంవత్సరాల పాటు మద్రాసులోని హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసాడు. 1929 లో నైట్ పదవిని పొందాడు. మూడుసార్లు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి పదవీవిరమణ చేసాడు. అతను తన చుట్టూ ఉన్న ప్రపంచంపై లోతైన ముద్ర వేసిన అసాధారణ వ్యక్తి.[5] 1928లో అతను మద్రాస్ నియో-మాల్థూసియన్ లీగ్ ను స్థాపించాడు. ఇది మద్రాసులో జనాభా నియంత్రణ పనులను నిర్వహించేది.[6]
శ్రీపతి చంద్రశేఖర్ 1950లలో రచించిన "మధ్యతరగతి సనాతన ఆంధ్రా హిందూ కుటుంబం"లో కుటుంబ నియంత్రణ గురించి అతని అభిప్రాయాలను రాస్తూ రామేశం దృష్టి సాంఘిక, ఆర్థిక రంగాలవైపు ఉండేదని తెలియజేసాడు. ఈ చర్యలు పేదరికంలో ఉన్నవారికి చిన్న కుటుంబాల ఉపశమనం కలిగిస్తాయని తెలిపాడు. వేపా రామేశం, అతని రెండవ భార్యకు 14 మంది పిల్లలు. అతను వారందరికీ జనాభా నియంత్రణ గూర్చి ప్రోత్సహించాడు. తరాల మార్పు ప్రత్యేకమైనది కాదు. వాస్తవానికి తరువాతి తరాలలో భారతదేశం అంతటా ఈ విధానాన్ని సాధారణీకరించడం గొప్పదనం.[3] జనన నియంత్రణ క్లినిక్లను వీలైనన్ని ఎక్కువ ప్రదేశాలలో ప్రారంభించాలని అతను డీమాడ్ చేశాడు.[7]
వేపా రామేశం చేత తన కథకు పరిచయ వాక్యాలు రాయించుకొన్నట్లు గురజాడ దినచర్యలో రాసుకొన్నారు.[8] వేటూరి ప్రభాకరశాస్త్రి వేపా రామేశం గారి వద్ద ఖగోళం, చరిత్ర అధ్యయనం చేశాడు.[9]
ప్రెసిడెన్సీ కాలీజీలో బౌర్డల్లన్ వ్యాసరచనపోటీ బహుమతి 20 రూపాయలు 1891లో అతనికి లభించింది.[10]
వేపా రామేశం పురస్కారం
[మార్చు]- జీవశాస్త్రంలో విశేష కృషి చేసిన వారికి విశాఖ పట్నంలోని ఎ.వి.ఎన్. కళాశాల "వేపా రామేశం గోల్డ్ మెడల్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ బయోలాజికల్ సైన్స్"ను అందజేస్తుంది.[11]
రచనలు
[మార్చు]- ది సోలార్ సిస్టమ్[12]
- ప్రిన్సిపల్స్ ఆఫ్ హిందూ లా[13]
- ఆంధ్రా క్రోనోలజీ 90-1800[14]
- The Principle of Naming the Months in the Chandramana and Fixing the Adhikamasa (Inter-Calary Months) [15]
వ్యక్తిగత జీవితం
[మార్చు]అతని భార్య లక్ష్మీనరసమ్మ. వారి కుమార్తె దువ్వూరి లలితాంబ భారత స్వాతంత్ర్య సమరయోధురాలు.[16]
మూలాలు
[మార్చు]- ↑ "104-year-old's body donated". Deccan Chronicle (in ఇంగ్లీష్). 2016-03-13. Retrieved 2020-05-30.
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2018-12-24. Retrieved 2020-05-30.
- ↑ 3.0 3.1 Motadel, David (2019-11-26). The Global Bourgeoisie: The Rise of the Middle Classes in the Age of Empire (in ఇంగ్లీష్). Princeton University Press. ISBN 978-0-691-19583-4.
- ↑ "Mrs. AVN College: The 159-year-old educational institution in Visakhapatnam". Vizag (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-10-18. Retrieved 2020-05-31.[permanent dead link]
- ↑ one eulogy by R. N. Aingar, Bar at Law dated July 26,1935.
- ↑ https://www.nyu.edu/projects/sanger/webedition/app/documents/show.php?sangerDoc=236495.xml
- ↑ Hodges, Sarah (2017-03-02). Contraception, Colonialism and Commerce: Birth Control in South India, 1920–1940 (in ఇంగ్లీష్). Routledge. ISBN 978-1-351-94888-3.
- ↑ "పుట:Gurujadalu.pdf/24 - వికీసోర్స్". te.wikisource.org. Archived from the original on 2018-07-29. Retrieved 2020-05-30.
- ↑ gdurgaprasad (2012-06-27). "సిద్ధ యోగి పుంగవులు –15 భ్రుక్త రహిత రాజ యోగి– వేటూరి ప్రభాకర శాస్త్రి గారు". సరసభారతి ఉయ్యూరు. Archived from the original on 2013-10-08. Retrieved 2020-05-30.
- ↑ http://www.dasufamily.com/site/moreinfo.php?person=55[permanent dead link]
- ↑ "Mrs. A.V.N. College". www.avncollege.ac.in. Archived from the original on 2019-10-26. Retrieved 2020-05-31.
- ↑ Ramesam, Vepa; Sarathi, Vepa P (1946). The solar system (in English). Mylapore: K. Mahadevan. OCLC 2631639.
{{cite book}}
: CS1 maint: unrecognized language (link) - ↑ Mulla, Dinshah Fardunji; Ramesam, Vepa (1946). Principles of Hindu law (in English). Caslcutta: Eastern Law House. OCLC 685224730.
{{cite book}}
: CS1 maint: unrecognized language (link) - ↑ Ramesam, Sir Vepa (1949). Andhra chronology; 90-1800 A.C., (in English). Mylapore, Madras: K. Mahadevan. OCLC 1080798095.
{{cite book}}
: CS1 maint: unrecognized language (link) - ↑ http://www.southasiaarchive.com/Content/sarf.120036/205993/014[permanent dead link]
- ↑ Devalla, Rani (2015-02-26). "A multi-faceted centenarian". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-05-30.