దేవనబోయిన నాగలక్ష్మి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దేవనబోయిన నాగలక్ష్మి
D.nagalakshmi.jpg
దేవనబోయిన నాగలక్ష్మి
జననంనాగలక్ష్మి
సెప్టెంబరు 24 1969
మహారాష్ట్ర లోని అహ్మద్ నగర్
నివాస ప్రాంతంహైదరాబాదు
ఇతర పేర్లుడి.నాగలక్ష్మి,డి.ఎన్.లక్ష్మి
వృత్తిఏనిమల్ న్యూట్రిషన్ ఇన్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్ కు అధిపతి
ప్రసిద్ధియానిమల్ సైన్సెస్ శాస్త్రవేత్త.
పిల్లలు2

డి.నాగలక్ష్మి యానిమల్ సైన్సెస్ శాస్త్రవేత్త. ఆమె ఆంధ్రప్రదేశ్ లోని కోరుట్ల నందు గల "ఏనిమల్ న్యూట్రిషన్ ఇన్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్" కు విభాగాధిపతిగా ఉన్నారు. ఆమె అనేక జాతీయ, రాష్ట్ర అవార్డులను అందుకున్నారు. ఆమె 80 కి పైగా పరిశోధన పత్రాలను వివిధ పత్రికలలో ప్రచురించారు.[1][2] [3]

జీవిత విశేషాలు[మార్చు]

తండ్రి సైనికోద్యోగి కావడంతో ఆమె మహారాష్ట్ర లోని అహ్మద్ నగర్ లో సెప్టెంబరు 24 1969 న జన్మించారు[4]. మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్ లోని కేంద్రీయ విద్యాలయాలలో విద్యాభ్యాసం చేసారు. జబల్ పూర్ లో డిగ్రీ చదివారు. ఉత్తర ప్రదేశ్ లోన్ని యిజ్జత్ నగరంలోని ఐ.వి.ఆర్.ఇనిస్టిట్యూట్ లో పోస్టు గ్రాడ్యుయేట్ చదివారు. "యానిమల్ న్యూట్రిషన్" అంశంలో పరిశోధనలు నిర్వహించారు.[5] ఈ విశ్వవిద్యాలయంలో ఐ.సి.ఎ.ఆర్ ఫెలోషిప్ అందుకున్నారు. పి.జి చేసి కొన్ని ఉద్యోగాలలో చేరిన అనంతరం యానిమల్ సైన్సెస్ లో ఒంటరి మహిళగా పరిశోధనలు మొదలుపెట్టారు. హైదరాబాదులోని వెంకటేశ్వర హాచరీస్ లో న్యూట్రిషన్ విభాగంలో అసెస్టెంట్ మేనేజరుగా చేరారు.[6][7] 1999 లో ఎన్.జి.రంగా అగ్రికల్చరల్ విశ్వవిద్యాలయం లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఎంపికయ్యారు.[8]ఐ.సి.ఎ.ఆర్ ప్రాజెక్టులో 2002 నుండి శాస్త్రవేత్తగా పరిశోధనలు చేస్తున్నారు.[9]

పరిశోధనలు[మార్చు]

డా.నాగలక్ష్మి పశువుల దాణాను వినూత్న విధానాల ద్వారా రూపొందించడం మీదనే పరిశోధనలు చేసారు. అడవులు తరిగిపోతున్న నేపద్యంలో పశువులకు ప్రత్యామ్నాయ దాణా యొక్క ఆవశ్యకతను గుర్తించి ఆమె పరిశోధనలు ప్రారంభించారు[10]. మొక్కజొన్నల్ని తీసివేసిన తర్వాత మిగిలే కంకులను మేతగా ఉపయోగించే మార్గం కనుగొన్నారు[11]. ఇదే విధంగా చెరకు పిప్పిని ఎరువుగానే కాకుండా దాణాకు వాడవచ్చునని నిరూపించారు. ఇళ్ళలో మిగిలిన ఆహార పదార్థాలను, చెత్తను కూడా పశువుల దాణాగా రూపొందించడమే ఈమె పరిశోధనా విజయమైంది. వేపగింజలు, పత్తి గింజలు నుంచి నూనెను తీసివేసిన తరువాత మిగిలిన పిండిని కేక్ ను ఎరువుగానే కాకుందా పశువుల దాణాకు కూడా వాడవచ్చునని నిరూపించారు[12] . చేదైన వేప గింజల పిండికి యూరియా, ఆల్కలీ ట్రీట్ మెంటు ఇవ్వడం ద్వారా ఆయా విషాలను పోగొట్టి దాణాగా వాడితే జంతువులకూ చాలా బలవర్ధకమైన ఆహారం కాగలదని రుజువు చేసారు. పత్తి గింజల్లో ఉండే గాసిపాల్ అనే విష పదార్థాన్ని తొలగించేందుకు కొన్ని పద్ధతులను అనుసరిస్తే దాణాగా ఉపయోగపడుతుందని చెప్పారు.

అవార్డులు[మార్చు]

2003 లో డాక్టర్ నాగలక్ష్మిని అఖిల భారత యానిమల్ సైన్సెస్ లో ఉన్న ఒకేఒక అవార్డు అయిన నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ (నాస్) 2001-2002 సంవత్సరానికి గాను యంగ్ సైంటిస్టు అవార్డుకు ఎంపిక చేసింది. యానిమల్ సైన్సెస్ లో విశేష పరిశోధనా కృషి చేసినవారిని వరించే ఈ అవార్డును ఈమె 2003 ఫిబ్రవరిలో భోపాల్ లోజరిగిన 6వ వ్యవసాయ విజ్ఞాన కాంగ్రెస్ లో అందుకున్నారు.[13] [14] ఈమె ఆనిమల్ న్యూట్రిషన్ అసోసియేషన్ లో జీవితకాల సభ్యత్వం పొందారు.[15] ఆమె "మిసెస్ మిమల్ శ్రీనివాస్ క్షీరసాగర్ మెమోరియల్ అవార్దు" ను అందుకున్నారు. [16]

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]