దొంగలున్నారు జాగ్రత్త (2022 సినిమా)
స్వరూపం
దొంగలున్నారు జాగ్రత్త | |
---|---|
దర్శకత్వం | సతీష్ త్రిపుర |
నిర్మాత | డి సురేష్ బాబు, సునీత తాటి |
తారాగణం | శ్రీ సింహా, ప్రీతి అస్రాని, సముద్రఖని, శ్రీకాంత్ అయ్యంగర్ |
ఛాయాగ్రహణం | యశ్వంత్ |
కూర్పు | గ్యారీ బీ హెచ్ |
సంగీతం | కాల భైరవ |
నిర్మాణ సంస్థలు | సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్ |
విడుదల తేదీs | 2022 సెప్టెంబర్ 23 (థియేటర్) 2022 అక్టోబర్ 7(నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
దొంగలున్నారు జాగ్రత్త 2022లో విడుదలైన తెలుగు సినిమా. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్ బ్యానర్‌లపై డి సురేష్ బాబు, సునీత తాటి నిర్మించిన ఈ సినిమాకు సతీష్ త్రిపుర దర్శకత్వం వహించాడు. శ్రీ సింహ, ప్రీతి అస్రాని, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను సెప్టెంబర్ 15న విడుదల చేసి[1] సినిమా సెప్టెంబర్ 23న విడుదలవ్వగా, అక్టోబర్ 7న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలైంది.[2]
కథ
[మార్చు]రాజు (సింహా) మెకానిక్ గా పనిచేసుకుంటూ భార్య నిరజ (ప్రీతీ అస్రానీ) ని పోషించుకుంటూ రాత్రి పూట ఆమెకి తెలియకుండా దొంగతనాలకి పాల్పడుతూంటాడు. ఈ క్రమంలో ఓ రాత్రి ఖరీదైన కారులోకి జొరబడి పని ముగించుకుని బయటపడబోతూంటే, కారు డోర్స్ లాక్ అయిపోతాయి. ఆ కారు చక్రవర్తి (సముద్రకని) అనే డాక్టరుది. ఆ కారు లోంచి రాజు ఎలా బయటపడ్డాడు ? అనేదే మిగతా సినిమా కథ.[3]
నటీనటులు
[మార్చు]- శ్రీ సింహ[4]
- ప్రీతి అస్రాని[5]
- సముద్రఖని
- శ్రీకాంత్ అయ్యంగర్
- ఆనంద చక్రపాణి
- జీవన్ కుమార్
- జోష్ రవి
- బిందు చంద్రమౌళి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్
- నిర్మాత: డి సురేష్ బాబు, సునీత తాటి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సతీష్ త్రిపుర
- సంగీతం: కాల భైరవ
- సినిమాటోగ్రఫీ: యశ్వంత్
- ఎడిటర్: గ్యారీ బీ హెచ్
- ఆర్ట్ డైరెక్టర్: గాంధీ నడికుడికర్
మూలాలు
[మార్చు]- ↑ 10TV Telugu (15 September 2022). "అడ్డంగా దొరికిపోయిన MM కీరవాణి కొడుకు శ్రీ సింహా.. "దొంగలున్నారు జాగ్రత్త" ట్రైలర్!". Archived from the original on 11 October 2022. Retrieved 11 October 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "అప్పుడే ఓటీటీలోకి దొంగలున్నారు జాగ్రత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?". 5 October 2022. Archived from the original on 22 October 2022. Retrieved 22 October 2022.
- ↑ "రివ్యూ: దొంగలున్నారు జాగ్రత్త". 23 September 2022. Archived from the original on 22 October 2022. Retrieved 22 October 2022.
- ↑ V6 Velugu (21 September 2022). "ఆయనతో సినిమా చేయడం ఒక కల". Archived from the original on 11 October 2022. Retrieved 11 October 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "'దొంగలున్నారు జాగ్రత్త' యూనిక్ మూవీ : ప్రీతి అస్రాణి". 19 September 2022. Archived from the original on 11 October 2022. Retrieved 11 October 2022.