Jump to content

దోరవేటి

వికీపీడియా నుండి
దోరవేటి
తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల కవిసమ్మేళనంలో కవితాగానం చేస్తున్న దోరవేటి
జననంఉప్పరి చెన్నయ్య
(1961-02-11)1961 ఫిబ్రవరి 11
ధారూరు, వికారాబాదు జిల్లా
వృత్తిఉపాధ్యాయుడు
ప్రసిద్ధికవి, కథారచయిత
తండ్రిఅడివయ్య
తల్లిఈశ్వరమ్మ

దోరవేటి కవి, రచయిత, విమర్శకుడు, వక్త, ఉపాధ్యాయుడు.

విశేషాలు

[మార్చు]
తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలలో భాగంగా అనుమాండ్ల భూమయ్య నుండి సత్కారం స్వీకరిస్తున్న దొరవేటి

‘దోరవేటి’ కలం పేరుతో ప్రసిద్ధి చెందిన ఉప్పరి చెన్నయ్య 1961, ఫిబ్రవరి 11న నేటి వికారాబాదు జిల్లాలోని ధారూరులో జన్మించాడు. ఇతని తల్లితండ్రులు ఈశ్వరమ్మ, అడివయ్య. ఇతని స్వగ్రామం ధారూరు అసలు పేరు ‘దోరవేటి’, ఆ పేరునే తన కలం పేరుగా పెట్టుకుని రచనలు చేస్తున్నాడు. ఉద్యోగ జీవితమంతా పాఠాలు బోధిస్తూనే యాభైకి పైగా గ్రంథాలు రచించాడు.[1]

రచనలు

[మార్చు]

కథా సంపుటాలు

[మార్చు]
  1. అమృతఝరి
  2. జెర జూస్కో
  3. నాన్నకు జేజే
  4. సంబంధం
  5. కానుక
  6. పల్లె
  7. చరితార్థులు
  8. ఆచార్య దేవోభవ
  9. మన కవులు -మహా కవులు
  10. ముగిసిన ఒంటరి పోరాటం

నవలలు

[మార్చు]
  1. మరో శివాజీ
  2. అసమాన వీరుడు-అనురాగ దేవత
  3. జీవనది
  4. పయనమెచటికోయి
  5. కలల సాకారం
  6. శంఖారావం
  7. నవ భారతం

పద్యరచనలు

[మార్చు]
  1. సాంబశివ శతకం
  2. నేస్తం (శతకం)
  3. బసవ పంశతి
  4. హృదయ స్పందన
  5. సాయి సంకీర్తనావళి
  6. అంజలి
  7. అంజలి-2
  8. శ్రమదేవోభవ
  9. పద్యారాధన
  10. దోస్తానా

శైవ సాహిత్యం

[మార్చు]
  1. శరణు బసవ
  2. ప్రభులింగ విభూతి
  3. కాశీఖండం
  4. ఆనంద తరంగిణి

వచన కవిత్వం

[మార్చు]
  1. నీవు సల్లంగుండాలి
  2. ప్రకృతి మణిపూసలు

బాలసాహిత్యం

[మార్చు]
  1. విరులబాట శతకం
  2. మీ కోసం
  3. సీత కష్టాలు (బుర్రకథ)

ఇతర ప్రక్రియలు

[మార్చు]
  1. దోరవేటి లేఖలు

పురస్కారాలు

[మార్చు]

ఇతనికి లభించిన పురస్కారాలలో కొన్ని:

  • సోహన్‌లాల్‌ బల్దావా ఉత్తమ కథా సాహిత్యం
  • ఓగేటి పురస్కారం,
  • రస నైవేద్యం గ్రంథానికి ఎస్‌.ఈ.ఆర్‌.టి. వారి ప్రథమ బహుమతి
  • రమ్య సాహితీ పురస్కారం,
  • నోముల కథా పురస్కారం,
  • బి.ఎన్‌.శాస్త్రి పురస్కారం,
  • మచిలీపట్నం పద్య కవితా పురస్కారం
  • తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం

మూలాలు

[మార్చు]
  1. పత్తిపాక మోహన్ (5 August 2023). "బాల సాహిత్యంలోనూ మేటి కవి చెన్నయ్య దోరవేటి". నవతెలంగాణ. Retrieved 4 November 2024.
"https://te.wikipedia.org/w/index.php?title=దోరవేటి&oldid=4354965" నుండి వెలికితీశారు