Jump to content

దోసకాయలు

వికీపీడియా నుండి

దోస (అయోమయ నివృత్తి)

దోస
Cucumbers grow on vines
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
కుకుమిస్, ఇంకా కొన్ని ప్రజాతులకు చెందిన స్పీషీస్

కుకుర్బిటేసి కుటుంబంలో కొన్ని ప్రజాతులకి చెందిన కూరగాయల్ని దోసకాయలు అంటారు.

తినే దోసకాయలు

కీరా దోసకాయలు

[మార్చు]

చల్లగా చూడగానే తినాలపించే కీరదోస వేసవిలో సాంత్వన నివ్వడమే కాదు దానిలోని పుష్కలమైన పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. రీహైడ్రేటింగ్‌ ఏజెంట్‌గా పనిచేస్తుంది. పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉండటంతో రక్తపోటుతో బాధపడేవారికి ఇది చక్కని ఆహారం. స్వేదం ద్వారా కోల్పోయిన నీటిని, లవణాలను శరీరానికి తిరిగి అందించడంలో కీరదోస చక్కని పాత్ర పోషిస్తుంది. రోజూ కప్పు కీరదోస రసం తాగితే మేని నిగారింపు సంతరించుకుంటుంది. దీని నుంచి ఆవస్యక ఫొలేట్‌తో పాటు విటమిన్‌- ఎ, సిలు పుష్కలంగా లభిస్తాయి.

పోషక విలువలు

[మార్చు]

శక్తి: 13కి.కెలోరీలు; మాంసకృత్తులు: 0.4గ్రా; కార్బోహైడ్రేట్లు: 2.5గ్రా; కొవ్వు: 0.1 గ్రా; పీచు: 2.6; సోడియం: 10.2మి.గ్రా; పొటాషియం: 50మి.గ్రా

ఉపయోగాలు

[మార్చు]

రక్తపోటులో తేడా ఏర్పదినవారికి దోసకాయలో ఉన్న "పొటాసియం " రక్తపోటులోని హెచ్చు తగ్గులను సవరిస్తుంది.

దోస లోని లవణాలు గోళ్ళను అందంగా, చిట్ల కుండా ఉంచుతాయి .

కళ్ళ కింద నల్లటి చారలను కీరదోసకాయ ముక్కలు తొలగించును, కళ్లు ఉబ్బినట్లు ఉంటే వాటిమీద తాజా కీరదోసకాయ ముక్కలను కాటన్ వేసి పెట్టుకుంటే చక్కటి ఫలితమిస్తాయి . శిరోజాల ఎదుగుదలకు దోసలోని సల్ఫర్, సిలికాన్, దోహదపడి జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది . దోస కడుపులోని మంటను తగ్గిస్తుంది, జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది . దోస తొక్కలో " విటమిన్ 'కే' " సమృద్ధిగా ఉన్నందున చేర్మానికి మేలుచేకురుతుంది. ఒక దోసకాయ ముక్కని 30 సెకన్ల పాటు నాలుకతో నోటి మీద పట్టుకొని ఉంటే చెడు శ్వాసకి కారణమైన బ్యాక్టీరియాను చంపేస్తుంది.

తొక్కతోనే తినాలి

[మార్చు]
దోసకాయ పప్పు
దోసకాయ ఎండు కారం పచ్చడి

దోసకాయను తోక్కతోనే తినాలి, దోసకాయను ఉరగాయగా చేసి తినకూడదు . ఆరోగ్య ప్రయోజనాలు : ఎసిడిటీ : కీరదోసకాయ జ్యూస్ తాగడం ద్వారా అందులో ఉండే ఖనిజాలలోని ఆల్కలైన్‌ స్వభావమువల్ల రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది. దీంతో ఎసిడిటీ సమస్య తగ్గుతుంది . అలాగే కీరదోసకాయ జ్యూస్ గ్యాస్ట్రిక్, డియోడినం అల్సర్లకు చికిత్సగా ఉపయోగపడి ఉపశయనం కలిగిస్తుంది . రక్తపోటు : ఎటువంటి రంగులు లేని కీరదోసకాయ జ్యూస్ వలన[1] రక్తప్రసరణ క్రమ బద్ధంగా ఉంటుంది . ఇందులోని ఖనిజాలు సోడియాన్ని నియంత్రణకు దోహదపడుతుంది. చలువ : వాతావరణం పొడిగా, వేడిగా ఉన్న రోజుల్లో కీరదోషకాయ జ్యాస్ ఏవైనా ఆకుకూరల రసంతో కలిపి తీసుముంటే చలువ చేస్తుంది. శరీర ఉష్ణోగ్రతను సమతుల్యముగా ఉండేలా చేస్తుంది . మూత్ర విసర్జన : మూత్రపిండాలలో రాళ్ళు కరిగిపోవడానికి, మూత్ర విసర్జన చక్కగా జరగడానికి దోహదపడుతుంది . నొఫ్ఫితో కూడిన వావు : కీళ్ళలో ఉండే యూరిక్ యాసిడ్ ను తొలగించడం వల్ల వాపు, నొప్పి తగ్గిపోతాయి. ఆర్త్రైటిస్, గౌట్ వ్యాధులలో ఇది మంచి చేస్తుది. జట్తు పెరుగుదల : కీరదోసకాయలో గల సిలికాన్‌, సల్ఫర్ ఖనిజలవణాలు జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తుంది చర్మం మెరుగుదల: ఇందులోగల అధిక ' సి ' విటమిన్‌ వల్ల చర్మ పరిస్థితిని మెరుగుపరుస్తుంది . సౌందర్య పోషకాలలో కీరదోషకాయ తప్పక ఉంటుంది . ఎగ్జిమ, తామర, సోరియాసిస్ వంటి చర్మ వ్యాదులకు చికిత్సకోసం కీరదోషకాయ వాడవచ్చును . ఎండలో చర్మము కమిలిపోవడం : తీవ్రమైన ఎండవలన చర్మమము కమిలి పోతుంది. అప్పుడు కీరదోషకాయ రసం తీసి కమిలిన చోట రాస్తే చల్లగా ఉండి శరీరానికి ఉపశయనం కలుగుతుంది. శరీరంలో నీటినిల్వ : కీరదోషకాయ రసంలో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి అందువలన శరీరంలో తగిన మోతాదులో నీటి నిల్వకు దోహదం చేస్తాయి. కళ్ళు చలువ : కీరదోషకాయ గుండ్రని ముక్కలుగా తరిగి కళ్ళపై ఉంచితే మంటలు తగ్గి ఉపశయనంతో పాటు కళ్ళు చల్లగా ఉంటాయి. వేడి తగ్గుతుంది. కళ్ళ వాపు తగ్గుతుంది. దోస ఈ దేశమున ప్రాచీన కాలము నుండియూ సాగునందుండిన తీగ జాతి చెట్టు. గట్టిగా చర్మంలో ముడతలు లేనివి చూసి ఎంచుకోవలెను. దోసకాయ మెత్తదైతే పండినదని అర్థము.దోస (cucumber) శాస్త్రీయ నామం - కుకుమిస్ సటైవస్ (Cucumis sativus), కుకుర్బిటేసి (cucurbitaceae) కుటుంబానికి చెందినవి.[2]

యితర భాషలలో

[మార్చు]

దోసకాయ అనబడే వేరు వేరు కూరగాయలు

[మార్చు]

దేశవాళీ దోస

[మార్చు]

12 - 15 సెం.మీ పొడవు ఉంటుంది. 7 -10 సెం.మీ లావును కలిగి ఉంటుంది. సుమారుగా అర కేజీ నుండి కేజీ వరకు ఉంటుంది. పండిన తరువాత పసుపు పచ్చగా ఉంటాయి.

నక్క దోస

[మార్చు]

చిన్న కాయలు, 5 - 10 సెం.మీ. పొడవు, 4 - 8 సెం. మీ లావు కలిగి ఉంటాయి.

ములు దోస

[మార్చు]

పందిరి దోస

[మార్చు]

బుడెం దోస కాయలు

[మార్చు]

దోసకాయతో వంటకాలు

[మార్చు]
దోసకాయ పప్పు
దోసకాయ పప్పు

కూరలు

[మార్చు]
దోసకాయ కూర
దోసకాయ + వంకాయ కూర
దోసకాయ + టమాట కూర
దోసకాయ + టమాట + ములగకాడ కూర
దోసకాయ + ఉల్లిపాయ కూర
దోసకాయ + వంకాయ + ఉల్లిపాయ కూర
దోసకాయ + టమాట + ఉల్లిపాయ కూర
దోసకాయ + టమాట + ములగకాడ + ఉల్లిపాయ కూర

పచ్చడ్లు

[మార్చు]
దోసకాయ పచ్చడి
దోసకాయ పచ్చడి (పచ్చిమిర్చి)
దోసకాయ పచ్చడి (ఎండు మిర్చి)
దోసావకాయ
దోసకాయ కాల్చి పచ్చడి
దోసకాయ + వంకాయ + టమాట పచ్చడి (ఉడకబెట్టి)
దోసకాయ కాల్చి + వంకాయ (ఉడకబెట్టి) పచ్చడి
దోసకాయ కాల్చి + టమాట (ఉడకబెట్టి) పచ్చడి
దోసకాయ + వంకాయ పచ్చడి
దోసకాయ + టమాట పచ్చడి

పులుసు

[మార్చు]
దోసకాయ పులుసు ముక్కలు

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "కీరదోసకాయ వలన మీకు లభాలు". Archived from the original on 2017-06-28. Retrieved 2017-06-06. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  2. "Health Benefits of Cucumber". Archived from the original on 2017-07-11. Retrieved 2017-06-06.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=దోసకాయలు&oldid=4310491" నుండి వెలికితీశారు