ద్రవ బుడగ
స్వరూపం
ద్రవ బుడగను ఆంగ్లంలో లిక్విడ్ బబుల్ అంటారు.
ద్రవపు బుడగ అనునది ద్రవంతో ఆవరింపబడిన గాలి. మార్గోనీ ఫలితం వలన రెండు పదార్థముల మధ్య తలతన్యత లలో మార్పుల వలన ఇవి ఏర్పడతాయి.
ఉదాహరణలు
[మార్చు]- శీతల పానీయాలలో గల కార్బన్ డై ఆక్సైడ్ దాని ద్రానణీయత కన్నా ఎక్కువగా ఉన్నపుడు మూత తీయగానె బుడగలు వస్తాయి.
- నీరు బాష్పీభవనం చెందినపుడు నీటి నుండి బుడగలు వచ్చుట మనం గమనించవచ్చు.
- సముద్ర తలంపై వచ్చు నురగలో కూడా బుడగలు వస్తాయి.
- సోడియం కార్బొనేట్లో ఏదైనా ఆమ్లం కలిపినపుడు బుడగలను గమనించవచ్చు.
వీటి ఆకారం
[మార్చు]ద్రవబుడగలు గోళాకారంగా ఉంటాయి. ఎందువనంటే ఈ ఆకారం అల్ప శక్తి స్థాయి గలది.
ఇవి ఎలా కనిపిస్తాయి
[మార్చు]మనం ద్రవపు బుడగలను చూడవచ్చు. ఎందువలనంటే అవి పరిసరాల పదార్థాల కన్నా వివిధ వక్రీభవన గుణకాలు కలిగి ఉంటాయి. ఉదాహరణకు గాలి యొక్క వక్రీభవన గుణకం 1.0003, నీటి వక్రీభవన గుణకం 1.333. ఈ తేడా వలన స్నెల్ నియమం ప్రకారం విద్యుదయస్కాంత తరంగాలు రెండు యానకాలలో ప్రయాణించునపుడు వాటి దిశను మార్చుకుంటాయి. కనుక ఈ బుడగలు వక్రీభవనం, అంతర పరావర్తనం చెందడం వలన అవి పారదర్శకంగా కనిపిస్తాయి.
ఈత కొట్టే సమయంలో బుడగల ఆట
[మార్చు]-
నీటిపై పెట్ట, పుంజుల ఆటతో బుడగలను సృస్టించుట - బొటన వ్రేలుకు చూపుడు వ్రేళ్లును గట్టిగా అనించి నీటి ఉపరితలంపై ఉంచుట
-
బొటన వ్రేలుకు చూపుడు వ్రేళ్లును గట్టిగా అనించి నీటి ఉపరితలంపై చూపుడు వేలుతో నీటిని గట్టిగా త్రోయటం ద్వారా బుడగలు, శబ్దం తక్కువగా వచ్చినట్లయితే దీనిని పెట్ట అంటారు.
-
బొటన వ్రేలుకు చూపుడు వ్రేళ్లును గట్టిగా అనించి నీటి ఉపరితలంపై చూపుడు వేలుతో నీటిని గట్టిగా త్రోయటం ద్వారా బుడగలు, శబ్దం ఎక్కువగా వచ్చినట్లయితే దీనిని పుంజు అంటారు.
-
ఈత కొట్టేటప్పుడు సహజ సిద్ధంగా ఏర్పడే బుడగలు
-
గాలిని బాగా పీల్చి ఆ గాలిని బిగబట్టి నీటిలోకి కూర్ వేయడం ద్వారా అధిక తోతుకు చేరుకుని అక్కడ గాలిని వదలి ఆ గాలి పైకి చేరుకొనక ముందే నీటి ఉపరితలంపైకి చేరి ఆ బుడగను చూస్తారు.
ఇవి కూడా చూడండి
[మార్చు]Look up ద్రవబుడగ in Wiktionary, the free dictionary.