ద్వీప
స్వరూపం
ద్వీప | |
---|---|
దర్శకత్వం | గిరీష్ కాసరవల్లి |
రచన | అపూర్వ కాసరవల్లి (రచయిత, అదనపు సంభాషణలు) |
స్క్రీన్ ప్లే | నాగేంద్రరావు ఆర్ మన్నె (విష్ణు) |
కథ | నా డిసౌజా |
దీనిపై ఆధారితం | ద్వీప నవల ఆధారంగా |
నిర్మాత | సౌందర్య |
తారాగణం | సౌందర్య అవినాష్ ఎంవి వాసుదేవరావు హరీష్ రాజ్ |
ఛాయాగ్రహణం | హెచ్‌ఎం రామచంద్ర హాల్‌కెరే |
కూర్పు | ఎం.ఎన్. స్వామి |
సంగీతం | ఐజాక్ థామస్ కొట్టుకపల్లి |
విడుదల తేదీ | 2002 సెప్టెంబరు 26 |
సినిమా నిడివి | 134 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | కన్నడం |
ద్వీప, 2002 సెప్టెంబరు 26న విడుదలైన కన్నడ సినిమా. సౌందర్య నిర్మాణ సారధ్యంలో గిరీష్ కాసరవల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా నా డిసౌజా రాసిన ద్వీప అనే నవల ఆధారంగా రూపొందించబడింది.[1] ఇందులో సౌందర్య, అవినాష్, ఎంవి వాసుదేవరావు, హరీష్ రాజ్ తదితరులు నటించారు.[2] ఈ సినిమాకు జాతీయ చలనచిత్ర పురస్కారాలలో జాతీయ ఉత్తమ చిత్రం, ఉత్తమ సినిమాటోగ్రఫీకి అవార్డులు, నాలుగు కర్ణాటక రాష్ట్ర సినిమా అవార్డులు, మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు (సౌత్)లను గెలుచుకుంది.[3]
నటవర్గం
[మార్చు]- సౌందర్య (నాగి)
- అవినాష్ (గణప)
- ఎం.వి. వాసుదేవరావు (దుగ్గజ)
- హరీష్ రాజ్ (కృష్ణ)
- పురుషోత్తమ తలవట
- సిద్దరాజ్ కల్యాంకర్
- మాలతి
- విజయసారథి
- రాధ రామచంద్ర
- శృంగేరి రామన్న
- సావంత్
అవార్డులు, ప్రదర్శనలు
[మార్చు]- ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం
- ఉత్తమ సినిమాటోగ్రఫీకి జాతీయ చిత్ర పురస్కారం - హెచ్‌ఎం రామచంద్ర హాల్‌కెరే
- 2001-02 కర్ణాటక రాష్ట్ర సినిమా అవార్డులు
- ఉత్తమ చిత్రం
- ఉత్తమ దర్శకత్వం - గిరీష్ కాసరవల్లి
- ఉత్తమ నటి - సౌందర్య
- ఉత్తమ సినిమాటోగ్రఫీ - హెచ్‌ఎం రామచంద్ర హాల్‌కెరే
- ఉత్తమ చిత్రం
- ఉత్తమ దర్శకత్వం - గిరీష్ కాసరవల్లి
- ఉత్తమ నటి - సౌందర్య
- స్క్రీనింగ్‌లు
- హ్యూమన్ రైట్స్ వాచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, న్యూయార్క్
- 33వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
- ఫుకుయోకా ఫిల్మ్ ఫెస్టివల్, జపాన్
- డర్బన్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
- రోటర్డ్యామ్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
- సినిమా వింటేజ్ ప్రోగ్రామ్, ఐసోలాసినిమా, కినోటోక్
మూలాలు
[మార్చు]- ↑ Vishwanatha, Vanamala (31 May 2014). "The region writes back". The Hindu. Retrieved 2021-06-21.
- ↑ "Dweepa (2003)". Indiancine.ma. Retrieved 2021-06-21.
- ↑ "Dweepa is showered with accolades". The Times of India. 26 May 2003. Retrieved 2021-06-21.