ధర్మారం (బి) (డిచ్పల్లి)
ధర్మారం (బి), నిజామాబాదు జిల్లా, డిచ్పల్లి మండలం, బర్దీపూర్ రెవెన్యూ గ్రామానికి చెందిన శివారు గ్రామం.ఈ గ్రామానికి గ్రామ పంచాయితీ పరిపాలానా వ్యవస్థ ఉంది. ఇది నిజామాబాదుకు 8 కి.మీ. దూరంలో,నిజామాబాదు నుండి హైదరాబాదు వెళ్ళే దారిలో ఉంది. వైశాల్యంలో పెద్ద గ్రామం.మేజరు గ్రామపంచాయతీ. రెవెన్యూ పరంగా బర్దీపూర్ గ్రామానికి చెందుతుంది. అందుకే ఈ ఊరిని ధర్మారం (బి) అంటారు.ఈ గ్రామంలో ప్రధాన వృత్తి వ్యవసాయం. అయినా చాలామంది వివిధ రంగాలలో స్థిరపడ్డారు.ఈ గ్రామం పట్టణ, గ్రామ వాతావరణపు కలయికతో ఉంటుంది. ఈ గ్రామం గుండా నిజాంసాగర్ కాలువ ప్రవహిస్తుంది. ఈ కాలువ, ఊరిలోగల చెరువు ఈ ఊరికి ప్రధాన నీటి వనరులు. మొదట చిన్న శివారు గ్రామంగా ఉన్న ఈ గ్రామం ఇప్పుడు దాదాపు 2000 పైగా గృహాలతో నిజామాబాద్ జిల్లాలోని పెద్ద గ్రామాలలో ఒకటిగా ఉంది. వ్యవసాయం, పాడి పరిశ్రమ ఇక్కడ విస్తృతంగా అభివృద్ధి చెందుతున్నాయి.పిన్ కోడ్:503230., ఎస్.టి.డి కోడ్:08462.
గ్రామ ప్రముఖులు
[మార్చు]- మండవ వెంకటేశ్వరరావు:మాజీ మంత్రి, ప్రస్తుత నిజామాబాదు గ్రామీణ శాసనసభ నియోజకవర్గ శాసనసభ్యులు
- 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో ఈదర కస్తూరి, సర్పంచిగా, ఉప సర్పంచిగా ఎడెల్లి సోమనాధ్ ఎన్నికైయ్యారు.