ధర్మ నారాయణ్ బర్మా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ధర్మ నారాయణ్ బర్మా
జననం (1935-11-10) 1935 నవంబరు 10 (వయసు 88)
విశ్వవిద్యాలయాలుకలకత్తా విశ్వవిద్యాలయం

ధర్మ నారాయణ్ బర్మా (జననం 1935 నవంబర్ 10) పశ్చిమ బెంగాల్ కూచ్ బెహార్ చెందిన భారతీయ సంస్కృత ఉపాధ్యాయుడు. కామతాపూర్ భాషను ప్రోత్సహించడంలో ఆయన చేసిన కృషికి ప్రసిద్ధి చెందారు.[1] కళలు, సాహిత్యానికి ఆయన చేసిన కృషికి గాను, 2021లో భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.[2]

ప్రారంభ జీవితం

[మార్చు]

1935లో జన్మించిన బర్మా 1959లో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి సంస్కృతం మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత కలకత్తాలోని మెట్రోపాలిటన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేయడం ప్రారంభించారు. ఆ తరువాత అతను కూచ్ బెహార్ కు తిరిగి వచ్చాడు, అక్కడ అతను పదవీ విరమణ చేసే వరకు నృపేంద్ర నారాయణ్ మెమోరియల్ హైస్కూల్లో పనిచేశాడు.[3]

పురస్కారాలు

[మార్చు]

2021లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ. [3]

మూలాలు

[మార్చు]
  1. "Rajbanshis' salience in Bengal politics surfaces as TMC, BJP lock horns over Kaliaganj flare-up". The Indian Express (in ఇంగ్లీష్). 2023-04-26. Retrieved 2023-12-11.
  2. "West Bengal: 'Bantul the Great' creator wins Padma Shri". The Times of India. 2021-01-26. ISSN 0971-8257. Retrieved 2023-12-11.
  3. 3.0 3.1 https://www.padmaawards.gov.in/Content/CitationsForTickets/2021/202125.pdf