నంగా పర్బత్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Nanga Parbat
Nanga Parbat The Killer Mountain.jpg
Nanga Parbat, Pakistan
ప్రాముఖ్యత 4,608 m (15,118 ft)
Ranked 14th
ప్రదేశం
Nanga Parbat is located in Pakistan
Nanga Parbat
Location of Nanga Parbat in Pakistan
భౌగోళిక అక్షాలు 35°14′15″N 74°35′21″E / 35.23750°N 74.58917°E / 35.23750; 74.58917Coordinates: 35°14′15″N 74°35′21″E / 35.23750°N 74.58917°E / 35.23750; 74.58917
అధిరోహణం
మొదటి అధిరోహణ July 3, 1953 by Hermann Buhl
సులభమైన అధిరోహణా
మార్గము
Diamir district (West Face)

నంగా పర్బత్ పాకిస్తాన్ లోని రెండవ అతి ఎత్తైన పర్వతం. ఇది చిలాస్ మరియు అస్తోర్ మధ్య, గిల్గిట్ బాల్టిస్తాన్ లో ఉంది. నంగా పర్బత్ అర్ధం "నగ్న పర్వతం". ఇది 26,660 అడుగుల (8,130 మీటర్లు) ఎత్తుతో ప్రపంచంలో తొమ్మిదవ అత్యంత ఎత్తైన శిఖరం. 1953లో ఆస్ట్రియన్ జర్మన్ కు చెందిన హెర్మన్ బుహ్ల్ అనే అతను మొదటిసారి ఈ పర్వతాన్ని అధిరోహించాడు. నంగా పర్బత్ హిమాలయాలకు పశ్చిమాన ఉంది, మరియు ఎనిమిది వేల మీటర్ల కంటే ఎత్తైన పర్వతాల యొక్క పశ్చిమంలో అత్యధికమైనది. ఇది కాశ్మీర్ ప్రాంతంలో ఉత్తర ప్రాంతాల యొక్క అస్తోర్ జిల్లాలో దక్షిణ సింధు నది పక్కన్న ఉంది. ఇది ఉత్తర పర్వతాలకు దూరం కాదు, ఇది కారకోరం పర్వతాల యొక్క పడమటి చివర. నంగా పర్బత్ నంగా పర్బత్ రేంజ్ లో అత్యంత ఎత్తైన శిఖరం. నంగా పర్బత్ శిఖరం నిటారుగా ఉంటుంది, అందువలన దీనిని ఎక్కడం కష్టతరం మరియు అపాయకరం. 20 వ శతాబ్దం ప్రారంభం మరియు మధ్యలో దీనిని ఎక్కబోతూ అనేకమంది మరణించడంతో దీనికి "కిల్లర్ పర్వతం" అని మారుపేరు పెట్టారు.