నంద్ కిషోర్ యాదవ్
నంద్ కిషోర్ యాదవ్ (జననం:1953 ఆగస్టు 26) ఒక భారతీయ రాజకీయ నాయకుడు, ప్రస్తుత బీహార్ శాసనసభ స్పీకర్‌గా 2024 ఫిబ్రవరి 16 నుండి ఇధికారంలో ఉన్నారు.[2] అతను బీహార్ ప్రభుత్వంలో రోడ్డు నిర్మాణం, ఆరోగ్య శాఖ మాజీ మంత్రిగా పనిచేశాడు.[3] అతను భారతీయ జనతా పార్టీ సభ్యుడు, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సభ్యుడు. 2013 జూన్‌లో మహాఘటబంధన్ పార్టీ విభజనలో రాష్ట్రీయ జనతా దళ్, జనతాదళ్ (యునైటెడ్) మధ్య విడిపోయిన తర్వాత బీహార్ ప్రభుత్వంలో మంత్రిగా చేరిన సీనియర్ బిజెపి నాయకుడు. అంతకు ముందు, అతను రోడ్డు నిర్మాణం, పర్యాటక శాఖ మంత్రిగా, బీహార్ శాసనసభ ప్రతిపక్ష నాయకుడుగా పనిచేసారు [4]
కుటుంబ నేపథ్యం, ప్రారంభ జీవితం, విద్య
[మార్చు]యాదవ్ 1953 ఆగస్టు 26న పన్నా లాల్ యాదవ్, రాజ్ కుమారి యాదవ్ దంపతులకు జన్మించారు.అతని ముత్తాత, ఝలో సర్దార్, ఒక భూస్వామి.అతను సింహాలను పెంపొందించేవాడని ఒక కథనం[5]అతని తండ్రి మొదటి నుండి పునఃప్రారంభించవలసి వచ్చి,పాత పాట్నాలోని ఖజేకలన్ ప్రాంతంలో వ్యాపారాన్ని స్థాపించి అక్కడ నివాసం ఉన్నాడు, అక్కడే అతను జన్మించి. తన బాల్యాన్ని గడిపాడు. [6]
నిర్వహించిన పదవులు
[మార్చు]కాలం | పదవులు |
---|---|
1978 | కౌన్సిలర్, పాట్నా మున్సిపల్ కార్పొరేషన్ |
1982 | డిప్యూటీ మేయర్, పాట్నా మున్సిపల్ కార్పొరేషన్ |
1990 | భారతీయ జనతా యువమోర్చా అధ్యక్షుడు, బీహార్ |
1995 | భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి, బీహార్ |
1998-2003 | భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, బీహార్ |
1995-2010 | పాట్నా తూర్పు నుండి బీహార్ శాసనసభ సభ్యుడు |
2010-ప్రస్తుతం | పాట్నా సాహిబ్ అసెంబ్లీ నుండి బీహార్ శాసనసభ సభ్యుడు |
2005-2008 | రోడ్డు నిర్మాణం, పర్యాటక శాఖ మంత్రి, బీహార్ ప్రభుత్వం |
2008-2010 | ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి, బీహార్ ప్రభుత్వం |
2010-2013 | రోడ్డు నిర్మాణ మంత్రి, బీహార్ ప్రభుత్వం |
2013-2015 | బీహార్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు |
2017-2020 | రోడ్డు నిర్మాణ మంత్రి, బీహార్ ప్రభుత్వం |
2024-ప్రస్తుతం | బీహార్ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ |
ఇవి కూడా చూడండి
[మార్చు]- బీహార్ నుండి రాజకీయ నాయకుల జాబితా
మూలాలు
[మార్చు]- ↑ Government of Bihar
- ↑ "BJP leader Nand Kishore Yadav elected Speaker of Bihar Assembly". Hindustan Times (in ఇంగ్లీష్). 2024-02-15. Retrieved 2024-02-15.
- ↑ "Ex Cabinet Ministers". Government of Bihar. Archived from the original on 22 September 2017. Retrieved 22 September 2017.- "Cabinet Ministers of Bihar". Bihar. Retrieved 26 November 2020.
- ↑ "Opposition leader of bihar". www.vidhansabha.bih.nic.in.
- ↑ "Who is Nand Kishore Yadav Bihar Assembly Speaker, know his political journey". Prabhat Khabar. Retrieved 12 February 2024.
- ↑ Santosh Singh (2015). Ruled or Misruled: Story & Destiny of Bihar. Bloomsbury India. ISBN 978-9385436307.
- బీహార్ నుండి భారతీయ జనతా పార్టీ రాజకీయ నాయకులు
- బీహార్ రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు
- బీహార్ శాసనసభలో ప్రతిపక్ష నాయకులు
- బీహార్ ఎమ్మెల్యేలు 2020–2025
- బీహార్ శాసనసభ స్పీకర్లు
- బీహార్ ఎమ్మెల్యేలు 1995–2000
- బీహార్ ఎమ్మెల్యేలు 2000–2005
- బీహార్ ఎమ్మెల్యేలు 2005–2010
- బీహార్ ఎమ్మెల్యేలు 2010–2015
- బీహార్ ఎమ్మెల్యేలు 2015–2020
- 1953 జననాలు
- జీవిస్తున్న ప్రజలు