Jump to content

నంబూరి హనుమంతరావు

వికీపీడియా నుండి
నంబూరి హనుమంతరావు

నంబూరి హనుమంతరావు ప్రాచీన భారతీయ వైద్య పరిశోధకులు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన కృష్ణా జిల్లా, విజయవాడలో 1919లో జన్మించారు. మద్రాసులోని కీల్ఫాక్ మెడికల్ కాలేజీలో ఎల్.ఐ.ఎం (ఆయుర్వేదిక్ అయిదేళ్ల డిప్లొమా కోర్సు) ను 1945లో చదివారు. ప్రభుత్వ ఉద్యోగాలతో నిమిత్తం లేకుండా వైద్యవృత్తిని ప్రైవేటుగా చేపట్టారు. స్వతంత్రం గా పరిశోధనలు జరిపారు. ఔషథాలలో మిశ్రమం చేసే రసాయనాలు వాస్తవికంగా తగు పాళ్లలో ఉన్నాయో, లేదా ఆవిష్కరించారు.[2] ఆయుర్వేద స్థాయీకరణ (ప్రామాణికత) కు ఈయన కనుగొన్న ప్రక్రియలు ఏశవ్యాప్తంగా ఆయుర్వేద కళాశాలల్లో ఔషథ నిర్మాణ రంగాలలో అనుసరిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా అనుసరిస్తున్నాయి. ఆయన 1987లో హెర్బల్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ ను స్థాపించారు.[3]

ఇండియన్ మెడికల్ ప్రాక్టీషనర్స్ కో. ఆపరేటివ్, ఫార్మసీ స్టోర్స్ లిమిటెడ్ (మద్రాసు) కు వ్యవస్థాపక డైరక్టరుగా ( 1944-94) పనిచేసారు. సెంట్రల్ కౌన్సిల్ రీసెర్చ్ ఆయుర్వేద సంస్థ గవర్నింగ్ బాడీ సభ్యులుగా ( 1989-94) ఉన్నారు. గుజరాత్ ఆయుర్వేద విశ్వవిద్యాలయం వారి సైమ సైంటిఫిక్ అడ్వయిజరీ కమిటీ సభ్యులుగా, పి.హెచ్.డి విద్యార్థులకు ఛీఫ్ ఎగ్జామినర్ గా (1991) వ్యవహరించారు.[2]

భారతీయ సంంప్రదాయ ఔషథాల రూపకల్పన మీద పరిశోధనలు ముమ్మరం చేయాలనే ఆకాంక్షతో 1961 లో "అకాడమీ ఆఫ్ ఆయుర్వేద" సంస్థను నెలకొల్పారు. 1972లో ప్రభుత్వం తలపెట్టిన "డ్రగ్ స్టాండర్‌డైజేషన్ రీసెర్చ్ ఎంక్వయిరీ" ప్రాజెక్టుకు రూపకల్పన చేసారు. వివిధ మందుల్లో కలుపుతున్నట్లు చెబుతున్న ధాతువులు అసలున్నాయా? ఉంటే ఏ స్థాయిలో ఉన్నదో తేల్చి చెప్పే వినూత్న ప్రక్రియను రూపొందించారు. నకిలీ ఔషథాలతో మోసపోకుండా అప్రమత్తం చేయడానికి ఈయన పెట్టిన విధానం ప్రయోజనకరం కాగలిగింది. ఆయుర్వేద వైద్య మందులలో భస్మాల కోసం వాడే లోహాల్లో సహజత్వాన్ని కనుగొనే పరిశోధనలు చేసారు. ఈయన నూతనంగా ఆవిష్కరించిన నైపుణ్యానికి "నంబూరి ఫేజ్డ్ స్టాల్ టెస్టు" అని ప్రసిద్ధమైంది. ఇది 1980లో ఆవిష్కారమైనది. [4]

ఆయుర్వేదంలో దశాబ్దాల తరబడి నిరంతర పరిశోధనలు నిర్వహించారు. విజయవాడ శివారు ప్రాంతంలో "డాక్టర్ రావూస్ హెర్బల్ ఫార్మా" ను నెలకొల్పి అతి ప్రామాణికమైన మందులను ఉత్పత్తి చేసారు. తమ 86 వ యేట కూదా ఆయుర్వేదంలొ శాస్త్రీయ పరిశోధనలు చెసి అద్భుతాలు సృష్టించారు. తమ సంస్థలు నాలుగు విభాగాలుగా రూపొందించి వివిధ వ్యాధులకు ఉత్తమ స్థాయి ఔషథాలను అందించారు. శరీరంలొ రోగ నిరోధక శక్తి పెంపొందించడానికి అన్ని వయసుల వారికి మందులను ఉత్పత్తి చేసారు. ఈ కారణంతో నమ్మకమైన ధాతువులతో చికిత్స సత్వర ఫలితాలనిచ్చె మందులను అతి విశ్వసనీయతతో తయారుచేయడానికి అవకాశం ఉంది. ఈ సంస్థ నుంచి దదాపు 25 రకాల మందులను తయారుచేస్తున్నారు.[2]

దేశంలోని అన్ని ప్రముఖ ఆయుర్వేదిక్ విశ్వవిద్యాలలలో విజిటింగ్ ప్రొఫెససర్ గా పని చేసాడు. అమెరికాలోని మహర్షి వేదిక్ విశ్వవిద్యాలయంలో, ఫిలిప్పిన్స్ లోని యూనివర్శిటీలో గెస్టు లెక్చర్లు అందించారు.[5] ఈయన తమ పరిశోధనా ఫలితాలను గ్రంథరూపంలో వెలువరించారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ ఆయుర్వేద, సిద్ధ మెడిసిన్ వారు ఈయన రాసిన రెండు పరిశోధక గ్రంథాలను పి.జి. కోర్సుకలో రిఫరెన్సు పుస్తకాలలాగ ఉపయోగించాలని ఆదేశించింది. ఆయుర్వెద వైద్య రంగంలో ప్రతిభ కనబరచిన ఇద్దరు యువ పరిశోధకులకు ప్రతి రెండేళ్లకు ఒకసారి గోల్డ్ మెడల్స్, నలుగురు విద్యార్థులకు సిల్వర్ మెడల్స్ అందించే వ్యవస్థను ఏర్పాటు చేసారు. 2005 నాటి వరకు 22 మంది పరిశోధకులకు పతకాలు బహూకరించారు. ఫార్మసీ సంస్థలు అసలు సిసలైన ధాతువుల్ని ఉపయోగించి, ఔషథాల తయారీకి మార్గదర్శకత్వం వహించారు.[2]

విజయవాడ లో ప్రతి నెలా మొదటి ఆదివారం వైద్యులతొ సెమినార్ కార్యక్రమాన్ని క్రమం తప్పక నిర్వహించేవారు. దాదాపు 50 సెమినార్లు నిర్వహించారు. ఈయన రాసిన గ్రంథ రచనలలో ప్రముఖమైనవి.

  • నంబూరి ఫేజ్డ్ స్టాట్ టెస్ట్[1][6]
  • పంచభూత థియరీ [7]
  • నవ్య వైశేషిక థియరీ

ఈ రెండు పుస్తకాలు పి.జి. విద్యార్థుల రిఫరెన్సు గ్రంథాలు.[1] మహర్షి మహేష్ యోగి అమెరికా, ఫిలిప్పిన్స్ దేశాలలొ ఈయన చేతుల మిదుగా 24 వైద్య అధ్యాపక కేంద్రాలను స్థాపించచేసి, ఉపన్యాసాలను అందింపజేసారు. ఆర్య వైద్యాన్ రాం వారియర్ మెమోరియల్ సంస్థ (కోయంబత్తుర్ ) వారు బృహత్రయీరత్న అవార్డును 1994 లో అందించింది. 1990 లో ఇందియన్ మెడిసిన్ నేషనల్ అకాడమీ, 1995 లో నేషనల్ అకాడమీ ఆఫ్ ఆయుర్వేద సంస్థలలో ఫెలోషిప్ లను పొందారు. జీవిత ప్ర పర్యంతం ప్రచీయన్ భారతీయ వైద్య చికిత్సారంగం పురరుజ్జీవనానికి అఖండ కృషి చెసిన డా. హనూమ్ంతరావు తన 87వ యేట 2006 సెప్టెంబరు 1 న విజయవాడలో మంరణించారు.[2]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 Greater efforts sought to popularise ayurveda
  2. 2.0 2.1 2.2 2.3 2.4 ఆంధ్ర శాస్త్రవేత్తలు (కృష్ణవేణి పబ్లిషర్స్,విజయవాడ ed.). శ్రీ వాసవ్య. 2011.
  3. Dr. Rao's About us[permanent dead link]
  4. "Bibliography on Medicine in Ancient India, with special emphasis on Classical and Modern Ayurverda". Archived from the original on 2017-06-03. Retrieved 2017-05-04.
  5. "Dr.Namburi Panchakarma Center, Vijayawada, Andhra Pradesh, India". Archived from the original on 2017-05-29. Retrieved 2017-05-04.
  6. RESEARCH IN PROGRESS Academy of Ayurveda, Hanumanpet, Vijayawada – 520 003- Andra Pradesh India[permanent dead link]
  7. about the book pamchabhuta theory[permanent dead link]

ఇతర లింకులు

[మార్చు]