Jump to content

నకిలీ స్వానుభవ చరిత్ర

వికీపీడియా నుండి

నకిలీ స్వానుభవ చరిత్ర అనేది కూట సాహిత్యంలో ఒక రకం. ఇందులో పూర్తిగా గానీ పాక్షికంగా గానీ కల్పించి వ్రాసిన ఒక ఆత్మకథో, స్వానుభవ చరిత్రో వాస్తవ సంఘటనల సమాహారంగా పేర్కొనబడుతుంది. కొన్ని సందర్భాల్లో రచయితగా పేర్కొన్నబడ్డ వ్యక్తి కూడా కల్పిత వ్యక్తి అయ్యి ఉంటాడు.

ఈ మధ్యకాలంలో పేరొందిన ముద్రణా సంస్థల నుండి వచ్చి, విమర్శకుల మన్ననలందుకుని, అత్యధిక అమ్మకాలు గడించిన రచనలు కూడా చివరికి ఈ కోవలోనివిగా బయటపడ్డాయి. ఈ నకిలీ స్వానుభవ చరిత్రల్లో చాలా భాగం రచయిత కష్టాలనీ, ప్రతికూల పరిస్థితులనీ అధిగమించి ఎదిగిన వైనాన్ని వల్లెవేసేవి అవుతూ ఉంటాయి. ఇలాంటి వాటిలో యూదు మారణహోమంలో చిక్కుకుని, చివరకు తప్పించుకున్న కల్పిత కథలు ఒక ముఖ్య రకం. ఈ నకిలీ మారణహోమ స్వానుభవ రచనల్లో ఒకటైతే నిజమైన మారణహోమ బాధితుడు వ్రాసిన రచనగా తేలింది.

నేడు ఇలాంటి రచనలు ఎక్కువగా బయటపడడంతో స్వానుభవ చరిత్రలు ముద్రించే ముందు మరింత నిశితమైన పరిశీలనా, తగిన జాగురూకతా పాటించాలని చాలామంది పిలుపునిచ్చారు.[1]

ప్రముఖ కథనాలు

[మార్చు]

19వ శతాబ్దపు భారతీయ సిపాయి స్వానుభవాలుగా చెప్పబడుతున్న రచన ఫ్రొమ్ సిపొయ్ టు సుబేదార్. దీని వాస్తవికతా, నిజానిజాలపై చాలా ఆరోపణలుండగా, ఇది అసలా లేక నకిలీ రచనా అనేదానిపై నేటికీ పండితుల్లో ఏకాభిప్రాయం లేదు. విమర్శకుల మన్ననలందుకుని, చివరికి నకిలీ రచనలుగా తేలిన వాటిలో కొన్ని ఫ్రెగ్మన్ట్స్: మెమరిస్ ఒఫ్ అ వోర్‌టైమ్ చైల్డ్‌హుడ్ (Fragments: Memories of a Wartime Childhood, అర్థం: ముక్కలు: యుద్ధసమయపు బాల్యం యొక్క జ్ఞాపకాలు, రచయిత: బిన్జమిన్ విల్కొమిర్స్కి), ద బ్లడ్ రన్స్ లైక్ అ రివర్ థ్రూ మై డ్రీమ్స్ (The Blood Runs Like a River Through My Dreams, అర్థం: నా కలల్లో రక్తం నదిలా పారుతుంటుంది, రచయిత: నస్దిజ్),[2] లవ్ అన్డ్ కొన్సిక్వన్సెస్ (love and consequences, అర్థం: ప్రేమా, పరిణామాలు, రచయిత: మార్గ్రట్ సెల్ట్సర్),[3] గొ ఆస్క్ ఎలిస్ (Go ask Alice, అర్థం:వెళ్ళి ఎలిస్‌ను అడగండి, రచయిత: అనామకులు).[4] ఇవన్నీ కూడా వీటి నకిలీతనం బయటపడక మునుపు న్యూయార్క్ టైమ్స్ పత్రికచే కొనియాడబడ్డ రచనలు. లవ్ అన్డ్ కొన్సిక్వన్సెస్తోబాటు ఒడ్ మెన్ ఔట్ (odd man out, అర్థం: తేడాగాడు, రచయిత: మెట్ మక్‌కార్తి) అనే ఇంకొక నకిలీ రచన కూడా పేరొందిన సంస్థ పెంగ్విన్ యు.ఎస్ విభాగముచే ముద్రణకు నోచుకున్నాయి. అ మిల్యన్ లిటౢ పీసెస్ (A million little pieces, అర్థం: పదిలక్షల చిన్న ముక్కలు) అనే ఇంకో నకిలీ రచన మరో పేరొందిన యు.ఎస్ ముద్రణా సంస్థ రెన్డమ్ హౌస్చే ముద్రింపబడినది.

ఈ నకిలీ రచయితలలో అ మిల్యన్ లిటౢ పీసెస్ రచయిత జెయ్మ్స్ ఫ్రె, ఎయ్న్జెల్ ఎట్ ద ఫెన్స్ (Angel at the Fence, అర్థం: కంచె దగ్గర దేవకన్య) రచయిత హేర్మన్ రొసెన్‌బ్లట్ (ఈ రచన నకిలీతనం ముద్రణకు ముందే బయటపడినందున, ఈ పుస్తకం ముద్రణకు నోచుకోలేదు), అ రొక్ అన్డ్ అ హార్డ్ ప్లెయ్స్ (A Rock and a Hard Place, అర్థం: ఒక బండా, ఒక గట్టి నేలా) రచయిత ఎన్టని గొడ్‌బి జొన్సన్నని చెప్పుకొనుచున్న ఒక వ్యక్తీ [గమనిక 1] ఓప్రా విన్‌ఫ్రే కార్యక్రమానికి అతిథులుగా వచ్చారు. చివరకు వీటన్నిటి వెనుక ఉన్న అసత్యాలు బయటపడ్డాయి. దీనితో రొసెన్‌బ్లట్ పుస్తకం అసలు ముద్రణకే నోచుకోలేదు. ఫ్రె, అతని సంపాదకురాలు నన్ టలెస్‌లు, ఓప్రా ముఖాముఖీ రెండవ భాగంలో, ఆమెచే ఈ విషయమై నిలదీయబడ్డారు.[5] ఇలాంటి వివాదాలను ఆధారంగా చేసుకుని, ఎన్డ్రియ ట్రొయ్ అనే రచయిత్రి, డెడి-ఎన్ ఎబ్సల్యూట్లి ఓథెన్టిక్ ఫెయ్క్ మెమ్వార్ (2008) (Daddy – An Absolutely Authentic Fake Memoir, అర్థం: నాన్న- పూర్తిగా విశ్వసనీయమైన ఒక నకిలీ స్వానుభవ చరిత్ర) అనే వ్యంగ్య నవల వ్రాసింది.

కొందరు తమ సొంత లాభానికై తమను తాము కొన్ని విపత్కర, బాధాకర సంఘటనలను విజయవంతంగా ఎదుర్కొన్నట్లు సమాజాన్ని నమ్మింపజూసిన వైనాలు కూడా ఉన్నాయి. ఇలాంటి వారిలో కొందరు తమ నకిలీ అనుభవాలను ముద్రించేందుకు పెద్ద పెద్ద పేరున్న ముద్రణా సంస్థలను మోసం చేసి ఒప్పించిన ఉదంతాలు కూడా కొన్ని బయటపడ్డాయి. ఉదాహరణకు ఒస్ట్రెయ్ల్యకు చెందిన బెల్ గిబ్సన్. ఈమె తను కేవలం ఇంటి వైద్యంతో కెన్సర్‌ను జయించిన తీరుకు అక్షరరూపమివ్వబోతున్నట్లు నమ్మించి, పెద్ద సంస్థలైన పెంగ్విన్, సైమన్ & షస్టర్‌లతో ఒప్పందాలు కుదుర్చుకుంది. తరువాతి కాలంలో ఈమె అనుభవాలన్నీ కల్పితాలనే విషయం బయటపడింది.

నకిలీ స్వానుభవ రచనల జాబిత

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

గమనికలు

[మార్చు]
  1. ఈ పేరుగల వ్యక్తే అసలు లేడని తరువాత తేలింది

మూలాలు

[మార్చు]
  1. "Lies and Consequences: Tracking the Fallout of (Another) Literary Fraud", The New York Times, 2008-03-05, p. B1. See also "A Family Tree of Literary Fakers," The New York Times, 2008-03-08, p. A17.
  2. Nasdijj (5 March 2009). "The Boy and the Dog Are Sleeping ,Nasdijj, 9780345453891 - Powell's Books".
  3. Barnes & Noble. "Love and Consequences: A Memoir of Hope and Survival". Barnes & Noble. Archived from the original on 7 June 2011. Retrieved 12 February 2010.
  4. Schott, Webster (1972-05-07). "Childrens Books". The New York Times. ISSN 0362-4331. Retrieved 2017-05-26.
  5. Carr, David (30 January 2006). "How Oprahness Trumped Truthiness". The New York Times. Retrieved 2007-10-05.