Jump to content

నక్కబొక్కలపాడు

అక్షాంశ రేఖాంశాలు: 15°59′48.840″N 80°1′54.516″E / 15.99690000°N 80.03181000°E / 15.99690000; 80.03181000
వికీపీడియా నుండి

నక్కబొక్కలపాడు, బాపట్ల జిల్లా, బల్లికురవ మండలానికి చెందిన గ్రామం.

నక్కబొక్కలపాడు
గ్రామం
పటం
నక్కబొక్కలపాడు is located in ఆంధ్రప్రదేశ్
నక్కబొక్కలపాడు
నక్కబొక్కలపాడు
అక్షాంశ రేఖాంశాలు: 15°59′48.840″N 80°1′54.516″E / 15.99690000°N 80.03181000°E / 15.99690000; 80.03181000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల
మండలంబల్లికురవ
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( 08404 Edit this on Wikidata )
పిన్‌కోడ్523 303.


గ్రామంలో విద్యా సౌకర్యాలు

[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల:- ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులైన అడుగుల శ్రీనివాసరావుని, 2014, జనవరి-16న ఒంగోలులో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో, ఉత్తమ ఉపాధ్యాయునిగా, కలెక్టర్ శ్రీ విజయకుమార్, సత్కరించారు.

గ్రామంలోని వ్యవసాయం, సాగునీటి సౌకర్యం

[మార్చు]

ఊరచెరువు:- మొత్తం 200 ఎకరాలలో విస్తరించియున్న ఈ చెరువులో, ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీరు-చెట్టు కార్యక్రమంలో, రెండవ విడతలో భాగంగా, రెండు లక్షల రూపాయల ప్రభుత్వ ధనంతో, చెరువులో పూడికతీత పనులు చేపట్టినారు. సారవంతమైన ఈ పూడిక మట్టిని రైతులు ట్రాక్టర్లతో తమ పొలాలకు తరలించుకొనుచున్నారు. ఈ విధంగా చేయుట వలన, చెరువులో నీటి నిలువ సార్ధ్యం పెరుగుటయేగాక, తమకు ఎరువుల ఖర్చు గణనీయంగా తగ్గుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. [4]

గ్రామ పంచాయతీ

[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, ధూళిపాళ్ళ వెంకటేశ్వర్లు, సర్పంచిగా, 38 ఓట్ల మెజారిటీతో, ఎన్నికైనారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]
  • శ్రీ ఈర్ల గంగమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయం నక్కబొక్కలపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని సనకొండ సమీపంలో ఉంది. ఈ ఆలయ వార్షికోత్సవం, 2015, ఏప్రిల్-4వ తేదీనాడు నివహించెదరు.
  • శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం:- ఈ అలయ సప్తమ వార్షికోత్సవాన్ని, 2015, నవంబరు-19వ తేదీ గురువారంనాడు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగ విచ్చేసిన ఐదువేలమంది భక్తులకు అన్నదానం నిర్వహించారు. సాయంత్రం బాబావారి పాదుకల గ్రామోత్సవం నిర్వహించారు.

గ్రామంలో ప్రధాన పంటలు

[మార్చు]

వరి, అపరాలు, కూరగాయలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]