నజీన్ సరస్సు
నిజీన్ సరస్సు | |
---|---|
ప్రదేశం | శ్రీనగర్, శ్రీనగర్, భారతదేశం |
అక్షాంశ,రేఖాంశాలు | 34°06′50″N 74°49′56″E / 34.11389°N 74.83222°E |
వెలుపలికి ప్రవాహం | నల్లా అమీర్ ఖాన్ |
గరిష్ట పొడవు | 2.7 కి.మీ. (1.7 మై.) |
గరిష్ట వెడల్పు | 0.82 కి.మీ. (0.51 మై.) |
ఉపరితల ఎత్తు | 1,582 మీ. (5,190 అ.) |
నిజీన్ సరస్సు జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉంది. ఇది దాల్ సరస్సు, ఖుషాల్ సర్ సరస్సు, గిల్ సర్ సరస్సులతో అనుసంధానించబడి ఉంటుంది.[1][2][3]
పేరు-అర్థం
[మార్చు]నిజీన్ సరస్సు చుట్టూ పెద్ద సంఖ్యలో విల్లో, పోప్లర్ చెట్లు ఉన్నాయి. అందువల్ల, దీనిని "నజీనా" అనికూడా పిలుస్తారు. నజీనా అంటే "ఉంగరంలోని ఆభరణం" అని అర్ధం. "నిజీన్" అనే పదం నజీనా నుండి వచ్చింది.[2]
భౌగోళికం
[మార్చు]ఈ సరస్సు దాల్ సరస్సుకి పశ్చిమాన హరి పర్బత్ కొండకు ఆనుకుని ఉంది. దాని ఉత్తర, పడమర వైపు బఘ్వాన్‌పోరా, లాల్ బజార్ ప్రాంతాలు ఉన్నాయి. ఈశాన్యంలో హజ్రత్‌బల్ ఉంది, ఇది ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి ప్రసిద్ధి చెందింది.[2]
ప్రస్తుత పరిస్థితి
[మార్చు]దాల్ సరస్సుతో పోలిస్తే ఇది సహజమైన నీటికి ప్రసిద్ధి చెందింది. దాల్ సరస్సు కంటే తక్కువ లోతుగా, తక్కువ రద్దీగా ఉండటం వలన ఇది ఈతకు కూడా అనువుగా ఉంటుంది. కాశ్మీర్ లోయలోని ఇతర సరస్సులకు సమస్యలు ఉన్నట్లుగా ఈ సరస్సు కూడా ఆక్రమణలతో దిగజారిపోతుంది. దీని ద్వారా దాని నీటి నాణ్యత క్షీణిస్తోంది. వరదల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అందుకని, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం సరస్సు యొక్క పరిస్థితిని మెరుగుపరచడానికి, దాని పూర్వ వైభవాన్ని పునరుద్ధరించడానికి సహాయపడే చర్యలలో నిమగ్నమై ఉంది.[2][4]
మూలాలు
[మార్చు]- ↑ "Nigeen lake turned eutrophic". 11 Aug 2012. Retrieved 11 July 2015.
- ↑ 2.0 2.1 2.2 2.3 "Nigeen Lake-JK Tourism". Retrieved 11 July 2015.[permanent dead link]
- ↑ Unni,K.S. Conservation and Management of Aquatic Ecosystems, p. 122, గూగుల్ బుక్స్ వద్ద
- ↑ Press Trust of India (10 June 2015). "J&K govt to take steps for beautification of Nigeen lake". Business Standard. Retrieved 7 March 2018.