నజ్ముల్ హుస్సేన్ శాంతో
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | నజ్ముల్ హుస్సేన్ శాంతో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | రాజషాహీ, బంగ్లాదేశ్ | 1998 ఆగస్టు 25|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 5 అ. 10 అం. (178 cమీ.)[1] | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | Top-order బ్యాటరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 84) | 2017 జనవరి 20 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2023 జూన్ 14 - Afghanistan తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 127) | 2018 సెప్టెంబరు 20 - Afghanistan తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2023 సెప్టెంబరు 3 - Afghanistan తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 99 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 66) | 2019 సెప్టెంబరు 18 - జింబాబ్వే తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2023 జూలై 16 - Afghanistan తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
T20Iల్లో చొక్కా సంఖ్య. | 99 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2015 | Kalabagan | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2016–2017 | కొమిల్లా విక్టోరియన్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2017–2018 | Rajshahi Division | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2020-present | Abahani Limited | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2023 | Sylhet Strikers | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 27 March 2023 |
నజ్ముల్ హుస్సేన్ శాంతో (జననం 1998 ఆగస్టు 25) బంగ్లాదేశ్ క్రికెట్ ఆటగాడు. [2]
సబ్బీర్ రెహమాన్ తర్వాత దేశీయ ట్వంటీ-20 ల్లో సెంచరీ చేసిన రెండో బంగ్లాదేశ్ ఆటగాడు.
2015 డిసెంబరులో, అతను 2016 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టులో ఎంపికయ్యాడు. [3] అతను ICC T20 ప్రపంచ కప్ 2022 జట్టుకు ఎంపికై, బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు తరపున అత్యధిక పరుగులు (5 మ్యాచ్‌లలో 180 పరుగులు) చేశాడు. [4]
తొలినాళ్ళ జీవితం
[మార్చు]శాంతో రాజ్‌షాహిలోని రన్‌హాట్‌కు చెందినవాడు. క్లెమోన్ రాజ్‌షాహి క్రికెట్ అకాడమీలో తన క్రికెట్ శిక్షణను ప్రారంభించాడు. అకాడమీ తన ఇంటి నుండి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది, కాబట్టి అతను అక్కడికి చేరుకోవడానికి ప్రతిరోజూ సైకిల్‌పై వెళ్ళేవాడు. [5]
COVID-19 మహమ్మారి లాక్డౌన్ సమయంలో అతను, 2020లో సబ్రిన్ సుల్తానా రత్నను వివాహం చేసుకున్నాడు. [6]
అంతర్జాతీయ కెరీర్
[మార్చు]2016 నవంబరులో, బంగ్లాదేశ్ న్యూజిలాండ్ పర్యటనకు ముందు ఆస్ట్రేలియాలో శిక్షణ పొందేందుకు 22 మందితో కూడిన ప్రిపరేటరీ స్క్వాడ్‌లో శాంతో ఎంపికయ్యాడు. [7] 2017 జనవరిలో అతన్ని న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టుకు ముందు బంగ్లాదేశ్ టెస్టు జట్టులోకి తీసుకున్నారు.[8] అతను 2017 జనవరి 20న న్యూజిలాండ్‌తో జరిగిన రెండవ టెస్టులో రంగప్రవేశం చేసాడు [9]
2018 ఆగస్టులో, 2018 ఆసియా కప్‌కు ముందు బంగ్లాదేశ్‌కు 31 మందితో కూడిన ప్రాథమిక జట్టుకు ఎంపికైన పన్నెండు మంది కొత్త ఆటగాళ్లలో అతను ఒకడు. [10] శాంతో 2018 సెప్టెంబరు 20న ఆఫ్ఘనిస్తాన్‌పై బంగ్లాదేశ్ తరపున తన వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే) రంగప్రవేశం చేసాడు [11]
2018 డిసెంబరులో, అతను 2018 ACC ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ కోసం బంగ్లాదేశ్ జట్టులో ఎంపికయ్యాడు. [12] 2018 ఆసియా కప్ జట్టు నుండి అతన్ని తొలగించాక, మళ్లీ 2019-20 బంగ్లాదేశ్ ట్రై-నేషన్ సిరీస్‌కి తీసుకున్నారు. [13] 2019 సెప్టెంబరు 18న జింబాబ్వేపై బంగ్లాదేశ్ తరపున తన T20I రంగప్రవేశం చేసాడు [14]
2019 నవంబరులో, అతను బంగ్లాదేశ్‌లో జరిగే 2019 ACC ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ కోసం బంగ్లాదేశ్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. [15] అదే నెలలో 2019 దక్షిణాసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ టోర్నమెంట్ కోసం బంగ్లాదేశ్ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. [16] బంగ్లాదేశ్ జట్టు, ఫైనల్లో శ్రీలంకను ఏడు వికెట్ల తేడాతో ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. [17]
2021 ఏప్రిల్లో, శ్రీలంకతో జరిగిన రెండు-మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రారంభ మ్యాచ్‌లో, మొదటి ఇన్నింగ్స్‌లో 163 పరుగులు చేసి, టెస్టు క్రికెట్‌లో తన మొదటి సెంచరీ సాధించాడు.[18] [19] 2021 జూలైలో, హరారేలో జింబాబ్వేపై తన రెండవ టెస్టు సెంచరీని సాధించాడు. [20]
2022 సెప్టెంబరులో, 2022 ICC పురుషుల T20 ప్రపంచ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టులో శాంతో ఎంపికయ్యాడు. [21] 2022 అక్టోబరు 30న, జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో, షాంటో T20I క్రికెట్‌లో తన తొలి అర్ధ సెంచరీని సాధించాడు. [22] అతను 55 బంతుల్లో 71 పరుగులు చేయడంతో బంగ్లాదేశ్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. [23] అతను ఆ టోర్నమెంట్‌లో 180 పరుగులు చేసి, బంగ్లాదేశ్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.[24]
2023 మార్చిలో, ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్ కోసం బంగ్లాదేశ్ T20I, వన్‌డే జట్టుల్లో అతను ఎంపికయ్యాడు. [25] 2023 మార్చి 1న, రెండవ వన్‌డేలో, అతను వన్‌డే క్రికెట్‌లో తన తొలి అర్ధ సెంచరీని సాధించాడు. [26] మొదటి T20Iలో కేవలం 30 బంతుల్లో 51 పరుగులు చేసాడు.[27] బంగ్లాదేశ్ మ్యాచ్‌ను 6 వికెట్ల తేడాతో గెలవడం లోను, ఇంగ్లాండ్‌పై వారి మొదటి T20I విజయాన్ని సాధించడంలో తోడ్పడ్డాడు. [28]
2023 జూన్లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో, శాంతో 146, 124 పరుగులతో ఒకే టెస్ట్‌లో రెండు సెంచరీలు చేసిన రెండవ బంగ్లాదేశీగా నిలిచాడు [29]
మూలాలు
[మార్చు]- ↑ Najmul Hossain Shanto’s profile on Sportskeeda
- ↑ "Najmul Hossain Shanto". ESPN Cricinfo. Retrieved 23 February 2020.
- ↑ "Mehedi Hasan to lead Bangladesh at U19 WC". ESPNCricinfo. Retrieved 23 December 2015.
- ↑ "Most Wickets | Men's T20 World Cup 2022". www.t20worldcup.com (in ఇంగ్లీష్). Archived from the original on 2022-11-07. Retrieved 2022-11-07.
- ↑ "For Najmul Hossain Shanto, it's time to make the question marks go away". ESPNCricinfo. Retrieved 14 May 2021.
- ↑ "বিয়ে করেছেন ক্রিকেটার নাজমুল হোসেন শান্ত". The Daily Star. Retrieved 14 July 2020.
- ↑ "Bangladesh include Mustafizur in preparatory squad". ESPN Cricinfo. Retrieved 4 November 2016.
- ↑ "Mushfiqur, Kayes and Mominul ruled out of crunch Test". ESPN Cricinfo. Retrieved 19 January 2017.
- ↑ "Bangladesh tour of New Zealand, 2nd Test: New Zealand v Bangladesh at Christchurch, Jan 20-24, 2017". ESPN Cricinfo. Retrieved 20 January 2017.
- ↑ "Liton Das recalled as Bangladesh reveal preliminary squad for Asia Cup 2018". International Cricket Council. Retrieved 14 August 2018.
- ↑ "6th Match, Group B, Asia Cup at Abu Dhabi, Sep 20 2018". ESPN Cricinfo. Retrieved 20 September 2018.
- ↑ "Media Release : ACC Emerging Teams Asia Cup 2018: Bangladesh emerging squad announced". Bangladesh Cricket Board. Retrieved 3 December 2018.
- ↑ "Bangladesh include uncapped Mohammad Naim, Aminul Islam for next two T20Is". Cricbuzz. Retrieved 16 September 2019.
- ↑ "4th Match (N), Bangladesh Twenty20 Tri-Series at Chattogram, Sep 18 2019". ESPN Cricinfo. Retrieved 18 September 2019.
- ↑ "Media Release : Bangladesh squad for Emerging Teams Asia Cup 2019 announced". Bangladesh Cricket Board. Retrieved 11 November 2019.
- ↑ "Media Release : Bangladesh U23 Squad for 13th South Asian Game Announced". Bangladesh Cricket Board. Retrieved 30 November 2019.
- ↑ "South Asian Games: Bangladesh secure gold in men's cricket". BD News24. Retrieved 9 December 2019.
- ↑ "Maiden century from Shanto gives Bangladesh strong start". BD News24. Retrieved 21 April 2021.
- ↑ "Slow day in Pallekele ends with Bangladesh holding all the aces". ESPN Cricinfo. Retrieved 22 April 2021.
- ↑ "Bangladesh 7 wickets away from victory vs Zimbabwe after Najmul Hossain Shanto hits 109-ball hundred on Day 4". India Today. Retrieved 10 July 2021.
- ↑ "Veteran star missing as Bangladesh name T20 World Cup squad". International Cricket Council. Retrieved 14 September 2022.
- ↑ "Battling Zimbabwe fall short as Bangladesh win in chaotic final-over finish". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-04-07.
- ↑ "Under-fire Shanto and Mustafizur finally come good". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-04-07.
- ↑ "'শান্ত বাংলাদেশের সেরাদের একজন হবে'". RTV Online (in ఇంగ్లీష్). Retrieved 2023-04-07.
- ↑ "Opener makes a return after eight years as Bangladesh name T20I squad". International Cricket Council. Retrieved 1 March 2023.
- ↑ Staff Correspondent. "Shanto reaches maiden ODI fifty, Bangladesh rebuilding after losing Mushfiq, Shakib". Prothomalo (in ఇంగ్లీష్). Retrieved 2023-04-07.
- ↑ "Najmul Hossain Shanto's 27-ball fifty lights path for Bangladesh to down world champions". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-04-07.
- ↑ "Bangladesh beat England by six wickets in first T20 cricket international". The Guardian (in ఇంగ్లీష్). Retrieved 9 March 2023.
- ↑ "Shanto, Mominul centuries help set 662 target for Afghanistan". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 17 June 2023.