వాహన చోదకము

వికీపీడియా నుండి
(నడపడం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
1899 లో ఒక ఆటోమొబైల్ వాహనాన్ని మొదటిసారి మౌంట్ వాషింగ్టన్ యొక్క శిఖరానికి నడిపారు.

ఒక వాహనం యొక్క చర్య, కదలికలను నియంత్రించడాన్ని నడపడం అంటారు, ఉదాహరణకు కారు, ట్రక్, బస్సు వంటి వాటిని నడపడం. నడపడాన్ని ఆంగ్లంలో డ్రైవింగ్ (driving) అంటారు. నడపడాన్ని తోలడం, చోదకం అని కూడా అంటారు.

చరిత్ర

[మార్చు]

ఆటోమొబైల్ ద్వారా ప్రపంచంలో మొట్టమొదటి దూర రహదారి యాత్ర ఆగష్టు 1888 లో జర్మనీలో జరిగింది, ఈ యాత్ర చేసేటప్పుడు మొట్టమొదటి పేటెంట్ మోటారు కారు సృష్టికర్త (బెంజ్ పేటెంట్-మోటార్ వ్యాగన్) బెర్తా బెంజ్, ఆయన భార్య కార్ల్ బెంజ్ మాన్హెయిం నుండి పిఫర్ర్జియిం (Pforzheim) వరకు 106 కిలోమీటర్లు (66 మైళ్ళు) దూరం ప్రయాణించారు, మళ్లీ మూడవ ప్రయోగాత్మకంగా బెంజ్ మోటారు కారులో ఆమె తన భర్త అనుమతి లేకుండానే ఆయనకు తెలియకుండా ఆమె తన ఇద్దరు టీనేజ్ కుమారులు రిచర్డ్, యూజిన్ తో గంటకు గరిష్ఠంగా 10 మైళ్ల (16 కిలోమీటర్ల) వేగంతో నడిపారు. ఆమె తన తల్లిని చూడాలనే కోరికతో నడిపానని అధికారిక కారణం చెప్పింది, కానీ అనధికారికంగా ఆమె తన భర్త చేత ఆవిష్కరింపబడిన ఉత్పత్తిని ప్రచారం చేసే ఉద్దేశంతో నడిపింది, దీనికి ముందు ఆమె నడిపేందుకు చిన్న చిన్న పరీక్షలు చేసింది. ఆ తరువాత ఆటోమొబైల్ రంగం గొప్పగా నిలిచిపోయింది, చివరికి, బెంజ్ యొక్క కుటుంబ వ్యాపారంగా నేటి మెర్సిడెస్-బెంజ్ కంపెనీ ఉద్భవించింది.

1899 లో F. O. స్టాన్లీ, అతని భార్య ఫ్లోరా వారి యొక్క ఉత్పత్తి అయిన ఆటోమొబైల్ ప్రచారం కోసం యునైటెడ్ స్టేట్స్ లోని న్యూ హాంప్షైర్ లో మౌంట్ వాషింగ్టన్ యొక్క శిఖరాగ్రానికి వారి యొక్క స్టాన్లీ స్టీమర్ ఆటోమొబైల్ ను నడిపారు, దీనిని కొన్నిసార్లు లోకోమొబైల్ అని పిలుస్తారు. 7.6 మైళ్ల (12.2 కిలోమీటర్ల) ప్రయాణానికి రెండు గంటలు పట్టింది (మరింత నీటిని జోడించడానికి పట్టిన సమయాన్ని పరిగణలోకి తీసుకోనట్లయితే) ; దిగేటప్పుడు తక్కువ గేర్ లో ఉంచి ఇంజన్ నడిపిస్తూ, అనేకసార్లు ఆపుతూ నడిపించడం ద్వారా ప్రయాణాన్ని పూర్తి చేశారు.

చోదకత్వం (డ్రైవబిలిటి)

[మార్చు]

వాహన చోదకత్వం అనగా అవసరమైన డ్రైవర్ వంటి వాని చేత మృదువుగా సరఫరా చేయగల శక్తి.

కఠిన నిశ్చలం, సరిగ్గా పనిచేయకపోవడం, గమనించకపోవడం, సంశయంతో ఆలస్యం లేదా చాలని శక్తి చోదకత్వ భ్రష్టతకు సాధారణ కారణాలు.

డ్రైవింగ్ నైపుణ్యాలు

[మార్చు]

వాహనాన్ని నడపడం ఎలా దానిని నియంత్రించడం ఎలా అని తెలుసుకోవడం కంటే ట్రాఫిక్ లో వాహనాన్ని ఎలా నడపడం, ఎలా నియంత్రించడం అనే విషయాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇందు కోసం రహదారి నియమాలు గురించి తెలుసుకోవడం చాలా అవసరం, ఈ నియమాలు వాహనం సక్రమంగా నడిపేందుకు, మన నుంచి ఇతరులకు, ఇతరుల నుంచి మనలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సురక్షితంగా గమ్యస్థానాలు చేరేందుకు ఉపయోగపడతాయి. సమర్థవంతమైన డ్రైవర్ బాధ్యతాయుతంగా డ్రైవ్ చెయ్యగలగడంతో పాటు వాహన నిర్వహణ యొక్క ప్రాథమిక విషయాలపై కూడా స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి.

కొందరు డ్రైవింగ్ చేస్తుంటే ముచ్చటేస్తుంది. ఏ మాత్రం కష్టపడకుండా ఏదో డ్రైవింగ్ సీట్లో సుఖాసీనులైనట్లు మనకు తోస్తుంది. చేతులు, కాళ్ల కదలికలు, వాహనం పూర్తిగా నియంత్రణలో ఉన్న తీరు చూస్తే డ్రైవింగ్ ఇంత తేలికా అనిపిస్తుంటుంది. కాని, అదెంతో కష్టమైన ప్రక్రియ. నిజానికి కళ్లు, కాళ్లు, చేతులు మాత్రమే కదిలినట్లనిపించినా తల దగ్గర్నుంచి కాలివరకు వేర్వేరు అవయవాలపై డ్రైవింగ్ దుష్ర్పభావం పడుతుంది. ఆ సమయంలో మనకు కలిగే ఒత్తిడి, ఆయా అవయవాలపై డ్రైవింగ్ ప్రభావం, వాటి నివారణ, డ్రైవింగ్‌లో తీసుకోవలసిన జాగ్రత్తలు వంటి అనేక అంశాలపై అవగాహన ఉండాలి.

డ్రైవింగ్ చేసేవారికి అవసరమైన వైద్య పరీక్షలు

[మార్చు]

రెగ్యులర్‌గా డ్రైవింగ్ చేసేవారు తరచూ కంటి పరీక్షలు, షుగర్, రక్తపోటు స్థాయిల పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి : శరీరభాగం - మెడ, వెన్ను

  • పని: నిరంతరం ఈ భాగంలోని కండరాలు పనిచేస్తూ ఉండాలి కాబట్టి ఆ కండరాలు బయటకు కనపడని రీతిలో పనిచేస్తుంటాయి (మజిల్ కంట్రాక్షన్ జరుగుతుంటుంది). పైగా డ్రైవింగ్‌లో భాగంగా తల మొత్తం బరువు మెడపై పడుతుంటుంది. ఆ బరువును మోసే పనితో పాటు తలను అటూఇటూ తిప్పడంలో మెడ తోడ్పడుతూ అనుక్షణం చురుకైన కదలికలతో స్ట్రెయిన్ అవుతుంటుంది.

పరిణామం - మెడ నొప్పి, వెన్నునొప్పి శరీరభాగం - భుజాలు, చేతులు

  • పని: స్టీరింగ్ / హ్యాండిల్‌ను పట్టుకుని దాన్ని నియంత్రించే పనిలో అనుక్షణం అప్రమత్తమైన కండరాల కదలికలతో పనిచేస్తుంటాయి.

పరిణామం: భుజంనొప్పి (షోల్డర్ పెయిన్) / ప్రొఫెషనల్ డ్రైవర్లలో భుజం నొప్పి, సర్వైకల్ స్పాండిలోసిస్ వంటి సమస్యలు సాధారణం. శరీరభాగం - వెన్ను / నడుము

  • పని: మన వెన్నుకు, నడుము భాగానికి సరైన సపోర్ట్ లేకపోయినా, కూర్చున్న సీట్ సక్రమంగా అడ్జెస్ట్ కాకపోయినా వెన్ను, నడుము భాగాలపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ఇక తమ ఎత్తు 170 సెం.మీ. కంటే తక్కువ ఉన్నవారిలో, మరీ ఎత్తుగా అంటే 180 సెం.మీ. కంటే ఎత్తుగా ఉన్నవారిలో తాము డ్రైవ్ చేసే వాహనం ఎంపిక సరిగా ఉండాలి. లేకపోతే వెన్ను/నడుములపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది.

పరిణామం - వెన్ను నొప్పి/నడుము నొప్పి శరీరభాగం - తల

  • పని: తలను ఎప్పుడూ అప్రమత్తంగా ఉంచాలి. ఈ క్రమంలో ఒక్కోసారి రోడ్డుపై ఉండే ఎగుడుదిగుళ్లలో పడ్డప్పుడు నిటారుగా ఉంచిన ఆ తల మనం కోరుకోని రీతిలో మన ప్రమేయం లేకుండానే కదులుతుంది.

పరిణామం - తలలో ఒత్తిడి, తలనొప్పి శరీరభాగం - కళ్లు

  • పని: కళ్లకు రక్షణ లేకుండా చేసే డ్రైవింగ్‌లో కళ్లపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఒక్కోసారి పక్కలకు, దూరాలకు, దగ్గరకు చూసే తీరును క్షణాల్లో మారుస్తూ అనుక్షణం కళ్లకు పని కల్పించాల్సి ఉంటుంది.

పరిణామం - కళ్లు ఎర్రబారడం, కార్నియల్ అల్సర్స్ శరీరభాగం - తొడలు, మోకాళ్లు, కాలి మడమ జాయింట్ (యాంకిల్ జాయింట్)

  • పని: మనం డ్రైవింగ్ చేసే సమయంలో యాక్సిలరేటర్, బ్రేక్ వంటివి నొక్కే ప్రక్రియలో వీటిపై నిరంతరం ఒత్తిడి పడుతూనే ఉంటుంది.

పరిణామం - తొడల విషయంలో క్రాంప్స్ / కీళ్ల విషయంలో ఒక్కోసారి బెణుకులు / కీళ్లు పట్టుకుపోయినట్లుగా అయిపోవడం / తీవ్రమైన నొప్పి రక్తనాళాలు వేరికోజ్ వెయిన్స్ వంటి సమస్య ఉన్నవారిలో రక్తనాళాలు ఉబ్బి ఉన్న ప్రాంతంలో మరింత నొప్పి, వేదన ఉంటాయి. 'గుండె / రక్తప్రసరణ వ్యవస్థా డ్రైవింగ్‌లో గుండె యాంత్రికంగా స్పందిస్తూ ఉంటుందనే భావనే సరికాదు. ఎందుకంటే డ్రైవింగ్ సమయంలో క్షణక్షణం ఎదురయ్యే ట్రాఫిక్ సమస్యల కారణంగా మనకు తెలియకుండానే గుండె వేగం, రక్తనాళాల్లో రక్తప్రసరణ వేగం పెరుగుతుంది. డ్రైవింగ్ ఒత్తిడి కూడా పై ప్రభావాన్నే కలిగిస్తుంది.* పరిణామం - గుండె స్పందనల వేగం పెరుగుదల, రక్తపోటు పెరగడం మనసు డ్రైవింగ్‌తో ఒక్కోసారి చికాకు, కోపం, ఏకాగ్రత సరిగా లేకపోవడం, తరచూ దృష్టి కేంద్రీకరణ సమస్యలు రావచ్చు. డ్రైవింగ్ సమయంలో వచ్చే కోపానికి ప్రత్యేకంగా ‘రోడ్ రేజ్’ అని పేరు. దీన్ని మనం తరచూ వాహనదారుల్లో చూస్తేనే ఉంటాయి. ఎదుటివారు డ్రైవింగ్‌లో తప్పు చేసినప్పుడు అకారణంగా తామూ దానికి తగినశిక్ష అనుభవించాల్సి వస్తుందని, ఒక్కోసారి అది ప్రాణాంతకం కావచ్చనే వాస్తవం వారిని ఆగ్రహానికి గురిచేస్తుంది. పరిణామం - తీవ్రమైన కోపం ఫీలింగ్ (ఇరిటేషన్)

డ్రైవింగ్ సీట్‌లో కూర్చున్నప్పుడు సెల్‌ఫోన్ తమతోనే ఉందా లేదా అన్న విషయాన్ని తప్పక చూసుకోవాలి. కానీ డ్రైవింగ్ చేసే సమయంలో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు.

సీటింగ్ ఎర్గానమిక్స్: కంప్యూటర్ ముందు ఎక్కువసేపు ఒకేభంగిమలో కూర్చుని ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయో, దాదాపు అలాంటి సమస్యలే డ్రైవింగ్ చేసేవారికీ ఉంటాయి. అందుకే ఒక సాఫ్ట్‌వేర్ నిపుణుడికి తాను పనిచేసే సీట్ ఎంత సౌకర్యంగా ఉండాలో, మానిటర్‌తో పోల్చినప్పుడు దాని ఎత్తు ఎంత చక్కగా అమరి ఉండాలో, డ్రైవింగ్ విషయంలోనూ డ్రైవర్ సీట్‌కూ, విండ్‌షీల్డ్‌కూ అదేరీతిలో అమరిక ఉండాలి. ఒక వృత్తిలో సౌకర్యానికి గరిష్ఠ ప్రాధాన్యం ఇచ్చే భంగిమలను పాటించడాన్ని ఎర్గానమిక్స్ అంటారు. డ్రైవింగ్ విషయంలోనూ దాదాపు కంప్యూటర్ ఎర్గానమిక్సే వర్తిస్తాయి.

డ్రైవింగ్‌లో జాగ్రత్తలు

[మార్చు]
  • డ్రైవింగ్ చేసేప్పుడు ఎక్కువసేపు కూర్చుని ఉండటం వలన మెడ, వీపు నొప్పి వస్తుంటాయి.
  • ట్రాఫిక్ ఎక్కువగా ఉంటూ డ్రైవింగ్ సజావుగా సాగకపోతే ఒత్తిడి పెరిగి రక్తపోటు కూడా పెరుగుతుంది. అంతేకాదు... వాహనంలో ఏసీ లేకపోతే వాయు, ధ్వని కాలుష్యం బారినపడే అవకాశాలు కూడా ఎక్కువ. ద్విచక్రవాహనం మీద వెళ్తుంటే దుమ్ము, ధూళి కంట్లోకి వెళ్లి కళ్లు పొడిబారడం, అలర్జీ వంటి సమస్యలు రావచ్చు. డ్రైవింగ్ సమస్యల దుష్ర్పభావాన్ని తగ్గించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలివి...
  • డ్రైవింగ్‌సీట్‌ను సౌకర్యంగా ఉండేలా చూసుకోవడం.
  • డ్రైవింగ్ మొదలుపెట్టడానికి ముందే సీట్‌బెల్ట్ తప్పనిసరిగా కట్టుకోవటం.
  • పార్క్‌చేసిన తర్వాత వాహనంలోనే ఉండటం కంటే బయటకు వచ్చి అటు ఇటు తిరగటం.
  • కారులాంటి వాహనాల్లోకి వంగి వాహనంలోకి ప్రవేశించకపోవటం. శరీరాన్ని పక్కకు తిప్పిన తరువాతే కారు ఎక్కటం కాని, దిగటం కాని చేయటం.
  • మంచినీళ్ల బాటిల్ వెంట ఉంచుకోవటం.
  • వాహనాన్ని ఎప్పుడూ కండిషన్‌లో ఉంచుకోవటం. ట్యాంక్‌నిండా ఇంధనం ఉందాలేదా అన్నది పరిశీలించుకోవటం. (వాహనంలో తగినంత ఇంధనం లేకపోవడంతో, పెట్రోల్ బంక్‌ను వెతుక్కునే ప్రక్రియలో కూడా శరీరంపై ఒత్తిడి పడి, ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు).
  • ద్విచక్రవాహనంపై ప్రయాణించేవారు తప్పనిసరిగా హెల్మెట్ వాడటం
  • హెల్మెట్ వల్ల మెడపై ఒత్తిడి తగ్గుతుంది. హెల్మెట్ వాడటం వల్ల బయటి వాయుకాలుష్యం, రసాయన కాలుష్యం ప్రభావాలు తగ్గి జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
  • హెల్మెట్ వాడటం వలన ప్రమాదాలు జరిగినప్పుడు గాయాల నుంచి తప్పించుకోవచ్చు.
  • డ్రైవింగ్ చేసేవారికి తగినంత నిద్ర ఉండటం తప్పనిసరి. నిద్రవస్తున్న భావనతో డ్రైవ్ చేయకూడదు.
  • ఆల్కహాల్ తీసుకొని డ్రైవ్ చేయటం అత్యంత ప్రమాదం.
  • వాహనదారులంతా పై జాగ్రత్తలు తీసుకుంటే డ్రైవింగ్‌లో సేఫ్టీతోబాటు ఆరోగ్యరక్ష కూడా ఏకకాలంలో లభిస్తుంది.

భారతదేశంలో వాహన చోదకులు పాటించవలసిని నిబంధనలు

[మార్చు]
  • డ్రైవింగ్ లైసెన్సు లేని వ్యక్తికి మీ వాహనం ఇవ్వరాదు. ఇస్తే వాహన యజమానికి రూ.1000 జరిమానా లేదా సెక్షన్ 180 ప్రకారం మూడు నెలల జైలు శిక్ష విధిస్తారు.
  • వాహనదారుడు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్సు ఉండాలి. లేకుంటే రూ.500 జరిమానా, సెక్షన్ 181 ప్రకారం మూడు నెలల జైలు శిక్ష విధిస్తారు.
  • పోలీసు ఉత్తర్వులు పాటించని వారికి, సమాచారం ఇచ్చేందుకు నిరాకరించిన వారికి సెక్షన్ 179 ప్రకారం రూ.500 జరిమానా వసూలు చేస్తారు.
  • వాహనానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలి. లేకుండ నడిపితే వాహనాన్ని స్వాధీనపరచుకుంటారు. సెక్షన్ 192 ప్రకారం రూ.2వేల నుంచి రూ.5వేలు వరకు జరిమానా వేస్తారు.
  • బీమా లేకుండా వాహనం నడిపితే చట్టరీత్యా నేరం. అలా నడిపిన వారికి సెక్షన్ 196 ప్రకారం రూ.1000 జరిమాన, మూడు నెలలు జైలు లేదా రెండు శిక్షలు విధించవచ్చు.
  • మద్యం తాగి వాహనం నడపడం క్షమించరాని నేరం. మద్యం మత్తులో వాహనం నడుపుతూ పట్టుబడితే అరెస్టు చేస్తారు. సెక్షన్ 185 ప్రకారం ఆరు నెలల జైలు శిక్ష, రూ.2వేలు జరిమానా విధిస్తారు.
  • సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం చట్టరీత్యా నేరం. అలా వాహనం నడిపితే సెక్షన్ 184 ప్రకారం రూ.1000 జరిమానా, ఆరు నెలలు జైలు శిక్ష. ప్రమాదకరమైన డ్రైవింగ్ జంపింగ్ సిగ్నిల్స్ చేస్తే రూ.1000 జరిమానా విధిస్తారు.
  • ద్విచక్రవాహనం నడిపేవారు తప్పనిసరిగా శిరస్త్రాణం (హెల్మెట్) ధరించాలి. లేకుంటే సెక్షన్ 177 ప్రకారం రూ.100 జరిమానా వేస్తారు.
  • ద్విచక్రవాహనంపై ఇద్దరు మాత్రమే ప్రయాణించాలి. ముగ్గురు ప్రయాణిస్తే ప్రమాదకరం. అలా ప్రయాణించిన వారికి సెక్షన్ 128, 177, 184 ప్రకారం రూ.500 జరిమానా విధిస్తారు.
  • వాహనాలను రోడ్లపై ఎక్కడంటే అక్కడ నిలుపరాదు. అలా నిలిపితే 122 సెక్షన్ ప్రకారం రూ.200 అపరాధరుసుం వసూలు చేస్తారు.
  • ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లకూడదు. నిబంధనలు అతిక్రమిస్తే ఆటోను స్వాధీనపరచుకుంటారు. సెక్షన్ 32 (111)177 ప్రకారం డ్రైవరుకు రూ.2 వేలు అపరాధం, ఆరు నెలల జైలు శిక్ష విధిస్తారు.
  • డ్రైవరు పక్కన ప్రయాణికులు కూర్చుని ప్రయాణించరాదు. అలా చేస్తే సెక్షన్ 125 ప్రకారం డ్రైవరుకు రూ.100 అపరాధం విధిస్తారు.
  • సరుకు రవాణా వాహనాల్లో ప్రయాణికులు ప్రయాణించరాదు. అలా ప్రయాణిస్తే సెక్షన్ 252 ప్రకారం వాహన డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్సు రద్దు చేస్తారు.
  • సరుకు రవాణా వాహనాల్లో పరిమితికి మించి సరకులు రవాణా చేయకూడదు. ఒక వేళ చేస్తే సెక్షన్ 194 ప్రకారం రూ.3 వేలు జరిమానా విధిస్తారు.
  • వాహనదారులు తప్పనిసరిగా సీటు బెల్టు ధరించాలి. లేదంటే సెక్షన్ 138 (3) ప్రకారం రూ.100 జరిమానా విధిస్తారు.
  • ఉద్దేశపూర్వకంగా ట్రాఫిక్ సిగ్నల్స్, డివైడర్స్, బోర్డులను చెరిపేసినా, గోడ పత్రాలు అతికించినా సెక్షన్ 119 ప్రకారం రూ.200 అపరాధంవసూలు చేస్తారు.
  • వాహన నెంబరు ప్లేట్‌పై నెంబరు తప్ప ఎలాంటి రాతలు ఉండకూడదు. నెంబరు ప్లేటుపై ఫ్యాన్సీ నెంబర్లు ఉంటే సెక్షన్ 177 ప్రకారం రూ.100 జరిమానా వేస్తారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

రహదారి నియమాలు

తెప్ప నడపడం

బయటి లింకులు

[మార్చు]