నదేజ్దా మిఖల్కోవా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నదేజ్దా మిఖల్కోవా
నదేజ్దా మిఖల్కోవా (2018)
జననం
నదేజ్దా నికితిచ్నా మిఖల్కోవా

(1986-09-27) 1986 సెప్టెంబరు 27 (వయసు 37)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1992–ప్రస్తుతం
జీవిత భాగస్వామిరెజో గిగినీష్విలి
పిల్లలు2

నదేజ్దా నికితిచ్నా మిఖల్కోవా, రష్యన్ సినిమా నటి.

జననం

[మార్చు]

నదేజ్దా మిఖల్కోవా 1986, సెప్టెంబరు 27న సినీ నటుడు, దర్శకుడు నికితా మిఖల్కోవ్ - ఫ్యాషన్ డిజైనర్ టాట్యానా షిగేవా దంపతులకు మాస్కో నగరంలో జన్మించింది. ఈమె సోదరుడు ఆర్టియోమ్, సోదరి అన్నా కూడా నటులే.

సినిమారంగం

[మార్చు]

6 సంవత్సరాల వయస్సులో తన తండ్రి దర్శకత్వం వహించిన బర్న్ట్ బై ది సన్ [1] సినిమాలో తొలిసారిగి నటించింది. ఈ సినిమా కేన్స్‌లో గ్రాండ్ ప్రైజ్,[2] అనేక ఇతర అవార్డులతోపాటు ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా అకాడమీ అవార్డును కూడా అందుకుంది.[3]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

దర్శకనిర్మాత రెజో గిగినీష్విలితో నదేజ్దా మిఖల్కోవా వివాహం జరిగింది. వారికి ఒక కుమార్తె,[4] కుమారుడు ఉన్నాడు. 7 సంవత్సరాల వివాహం తర్వాత 2017 అక్టోబరులో వారు విడాకులు తీసుకున్నారు.[5]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర ఇతర వివరాలు
1993 అన్నా: 6 - 18 నదియా డాక్యుమెంటరీ, ఆమె వలె
1994 బర్న్ట్ బై ది సన్ నాడియా కోటోవా తొలి సినిమా
1999 ది బార్బర్ ఆఫ్ సైబీరియా ఫెయిర్ వద్ద అమ్మాయి గుర్తింపు పొందలేదు
2000 ది ప్రెసిడెంట్ అండ్ హిజ్ గ్రాండ్ ఢాటర్ మాషా, ఆమె కవల
2010 బర్న్ట్ బై ది సన్ 2: ఎక్సోడస్ నాడియా కోటోవా
2011 బర్న్ట్ బై ది సన్ 2: సిటాడెల్ నాడియా కోటోవా
2019 డెడ్ లేక్ నటాషా
2021 బ్రైటన్ ఫోర్త్

మూలాలు

[మార్చు]
  1. "Nadezhda Mikhalkova Profile". Special Broadcasting Service. Archived from the original on 2011-11-12. Retrieved 2023-06-30.
  2. "The Exodus, the destiny of Serguei Kotov seen by Nikita Mikhalkov". Festival de Cannes. Retrieved 2023-06-30.
  3. "Burnt By The Sun 2: Exodus". AllBusiness.com. Retrieved 2023-06-30.
  4. Стрельникова, Елена. "Надежда Михалкова родила дочку". Komsomolskaya Pravda. Retrieved 2023-06-30.
  5. "Дочь Михалкова развелась с режиссером Резо Гигинеишвили". ria.ru. Retrieved 2023-06-30.

బయటి లింకులు

[మార్చు]